ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎనిమిది శాతం పెరిగిన రేట్లు | Full Demand for Houses in Hyderabad Prices Have Increased By 8 Percent | Sakshi
Sakshi News home page

ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎనిమిది శాతం పెరిగిన రేట్లు

Feb 7 2026 5:53 PM | Updated on Feb 7 2026 6:03 PM

Full Demand for Houses in Hyderabad Prices Have Increased By 8 Percent

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2024తో పోలిస్తే.. గత ఏడాది నగరంలో ప్రరాపార్టీల రేట్లు 8 శాతం మేర పెరిగాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.

➤2024లో గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్ల ధరలు చ.అ.కు సగటున రూ.7,053గా ఉండగా.. 2025 నాటికి అది రూ.7,644కు వృద్ధి చెందింది.

➤ఇదిలా ఉండగా.. దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలు చూస్తే.. 2023తో పోలిస్తే 2024లో ప్రాపరీ్టల ధరలు 17 శాతం మేర పెరగగా.. 2024తో పోలిస్తే 2025లో 6 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. చదరపు అడుగుల్లో చూస్తే.. గతేడాది 8 నగరాలలో అపార్ట్‌మెంట్ల చ.అ.ధర సగటు రూ.7,874లుగా ఉండగా.. 2023లో రూ.7,451గా ఉంది. ఇక, ధరల పెరుగుదల, స్థిరమైన త్రైమాసిక ఇంక్రిమెంట్లు, నియంత్రిత సరఫరా వంటి కారణాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు(ఇన్వెంటరీ) విక్రయించేందుకే డెవలపర్లు దృష్టిసారించారు. గత ఏడాది కొత్త యూనిట్ల లాంచింగ్స్‌ క్షీణించగా.. అమ్మకాలు పెరిగాయి.

➤2024లో 3,85,221 యూనిట్లు సప్లై కాగా.. 2025లో 3,61,096 యూనిట్లు సరఫరా అయ్యాయి.

➤2025లో 8 నగరాలలో 3,86,365 యూనిట్లు, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement