ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.
సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.
#NDTVProfitConclave2026 | V. Anantha Nageswaran, Chief Economic Adviser to @TamannaInamdar on AI and its impact
Co-presented by: @NSEIndia
Co-powered by: @LICIndiaForever & @apollotyres
Special Partners: @Niva_Bupa, APIS & Adani Airports
Energy Partner: @kpgroupgujarat
NBFC… pic.twitter.com/2LBMuPNI54— NDTV (@ndtv) February 7, 2026


