
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీతోపాటు ఇతర సంస్థల్లోని దాదాపు అన్ని విభాగాల్లో ఏఐ పాగా వేస్తోంది. దాంతో ఉద్యోగాల్లో కోత తప్పడం లేదు. భవిష్యత్తులో ఏఐ ప్రభావంతో దాదాపు కనుమరుగయ్యే కొన్ని జాబ్స్ జాబితాను ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ఆల్ట్‌మన్ తెలిపారు. దాంతోపాటు కొత్తగా సృష్టించబడే కొలువులను కూడా పేర్కొన్నారు.
ఏఐ వల్ల కనుమరుగయ్యే ఉద్యోగాలు
డేటా ఎంట్రీ క్లర్క్‌లు
బేసిక్ కస్టమర్ సర్వీస్ రిప్రెజెంటేటివ్స్
టెలిమార్కెటర్లు
ప్రాథమిక కాపీ రైటింగ్ స్కిల్స్ కలిగిన జాబ్స్
సింపుల్ గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యాలున్న ఉద్యోగాలు
సోషల్ మీడియా షెడ్యూలింగ్ కొలువులు
జూనియర్ కోడింగ్ ఉద్యోగాలు ఉదా: బగ్ ఫిక్సింగ్, టెంప్లెట్ ఆధారిత కొలువులు
ఏఐ కొన్ని విభాగాలను ఆటోమేట్ చేసే అవకాశం ఉన్నా, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో..
ఏఐ ఓవర్‌సైట్ ఉద్యోగాలు
ప్రాంప్ట్ ఇంజినీరింగ్
హ్యూమన్-ఏఐ కొలొబరేషన్ జాబ్స్
ఏఐ ట్రయినింగ్ జాబ్స్
ఏఐ వ్యవస్థల నైతికత, భద్రత, పాలన పరమైన ఉద్యోగాలు ఉన్నాయి.
ప్రభుత్వాలు, కంపెనీలు మార్పునకు సిద్ధం కావాలని, రీస్కిల్లింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆల్ట్‌మన్ సూచించారు.
ఇదీ చదవండి: ‘నేనో మేనేజర్‌ని.. టీమ్ సభ్యులకంటే జీతం తక్కువ’