టెక్ దిగ్గజాలు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటీవల ప్రకటించిన తమ మూడో త్రైమాసికం (క్యూ3) లాభాల్లో అద్భుతమైన వృద్ధి సాధించాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కంపెనీలు ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో చేసిన పెట్టుబడులు గణనీయంగా పెరగడమే. క్లాడ్ చాట్‌బాట్ సర్వీసులు అందిస్తున్న ఆంత్రోపిక్ లాభాలు పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చింది.
క్యూ3లో భారీ లాభాలు
గత వారం వెలువడిన ఫలితాల ప్రకారం ఆల్ఫాబెట్ తన లాభంలో ఈక్విటీ సెక్యూరిటీలపై నికరంగా 10.7 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా ఆంత్రోపిక్ వాటా విలువ పెరిగినట్లు చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్యూ3 లాభం 38% పెరిగింది. ఆంత్రోపిక్‌లో దాని పెట్టుబడి నుంచి వచ్చిన 9.5 బిలియన్ డాలర్లు నాన్-ఆపరేటింగ్ ఆదాయంలో ప్రతిబింబించింది.
ఆంత్రోపిక్ అందించే సేవలు
క్లాడ్ (Claude) - జనరేటివ్ ఏఐ అసిస్టెంట్
క్లాడ్ అనేది ఆంత్రోపిక్ ప్రధాన ఉత్పత్తి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్. దీన్ని సంభాషణాత్మక, టెక్స్ట్ ప్రాసెసింగ్ పనుల కోసం రూపొందించారు. ఇది లార్జ్ డాక్యుమెంట్లు లేదా సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నారు. కథనాలు, కంటెంట్, కోడ్ రాయడంలో సహాయం చేస్తుంది. రాసిన కోడింగ్‌ను డీబగ్గింగ్ చేస్తుంది. ఇది చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా (Claude.ai), డెవలపర్ల కోసం ఏపీఐ ద్వారా అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?


