దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మేనేజ్‌మెంట్ నిర్మాణంలో కీలక మార్పులను ప్రకటించింది. సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా శశ్వత్ శర్మ నియమితులయ్యారు. ఈ మార్పులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశ్వత్ శర్మ ఐదేళ్ల పాటు ఈ ఉన్నత పదవిని చేపట్టనున్నారు. హెచ్ఆర్, నామినేషన్ కమిటీ సిఫార్సుల మేరకు డిసెంబర్ 18న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శశ్వత్ శర్మ ఇకపై సంస్థ కీలక నిర్వాహక సిబ్బంది(KMP)గా కూడా వ్యవహరిస్తారు.
గోపాల్ విట్టల్‌కు పదోన్నతి
ప్రస్తుతం వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న గోపాల్ విట్టల్ ఇకపై ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జనవరి 1, 2026 నుంచి ఆయన ఐదేళ్ల పాటు పూర్తికాల డైరెక్టర్‌గా కొనసాగుతారు. సంస్థ వ్యూహాత్మక అభివృద్ధిలో ఆయన తన మార్గదర్శకత్వాన్ని కొనసాగించనున్నారు.
ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!


