ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం | Budget 2026 Must Make AI Governance Verifiable | Sakshi
Sakshi News home page

ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం

Jan 31 2026 2:43 PM | Updated on Jan 31 2026 2:49 PM

Budget 2026 Must Make AI Governance Verifiable

భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్‌360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇండియా డిజిటల్‌ రంగంలో ఇప్పటికే ఆధార్‌, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.

ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్‌

వికసిత్‌ భారత్ 2047

‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.

  • డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.

  • పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.

  • బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌) రంగంలో సంస్కరణలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement