టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ టెక్ గ్యాడ్జెట్లపై ప్రజలకు ఆసక్తి కూడా అధికమవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల తర్వాత ఇప్పుడు ఏఐ పవర్డ్ వేరబుల్స్‌పై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్లాసెస్‌లు మార్కెట్ ఏటా పెరుగుతోంది. ఐడీసీ రిపోర్ట్ ప్రకారం 2025 రెండో త్రైమాసికంలో గ్లోబల్ వేరబుల్స్ మార్కెట్ 9.6% వృద్ధి చెందింది. చైనాలో 50 మిలియన్ యూనిట్ల స్మార్ట్ గ్లాసెస్ విక్రయించారు. ఈ నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తన మొదటి ఏఐ గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. ‘క్వార్క్ ఏఐ గ్లాసెస్’ పేరుతో విడుదల చేసిన ఈ గాడ్జెట్ మెటా గ్లాసెస్‌కు పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్లాసెస్‌తో అలీబాబా కన్స్యూమర్ ఏఐ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది.
అలీబాబా క్వెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా క్వార్క్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ గ్లాసెస్‌ను రెగ్యులర్ ఐవేర్‌లాగా కనిపించే డిజైన్‌తో తీసుకొచ్చారు. బ్లాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో స్టైలిష్‌గా ఉండటం వల్ల ఇవి రోజువారీ ఉపయోగానికి సరిపోతాయని కంపెనీ తెలిపింది. మెటా రేబాన్ డిస్‌ప్లే గ్లాసెస్ లాంటి హెవీ గ్యాడ్జెట్‌లకు విరుద్ధంగా ఇవి కేవలం 40 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటాయని చెప్పింది. ప్రెస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ చేస్తూ వివిధ ఫ్రేమ్ కలర్స్, లెన్స్ ఆప్షన్‌లతో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.
క్వార్క్ ఏఐ గ్లాసెస్‌ను ఫ్లాగ్‌షిప్ S1, లైఫ్‌స్టైల్ ఫోకస్డ్ G1 మోడళ్లలో ఆవిష్కరించారు. మోడల్‌ను అనుసరించి ఫీచర్లలో తేడాలుంటాయి. ఈ గ్లాసెస్‌లోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
విదేశీ భాషల్లో సంభాషణలు లేదా టెక్స్ట్‌ను ఇన్‌స్టంట్‌గా అనువదిస్తుంది. ప్రయాణికులకు, బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఇది ఎంతో ఉపయోగం.
గ్లాసెస్ కెమెరాతో ప్రొడక్ట్‌ను స్కాన్ చేస్తే తావోబా(చైనా ఈకామర్స్ వెబ్‌సైట్)లో ధరలు, ఆఫర్‌లు డిస్‌ప్లే అవుతాయి. షాపింగ్‌ను సులభతరం చేస్తుంది.
అమాప్‌తో లింక్ అయి ఏఆర్ ఓవర్‌లేలతో రోడ్ డైరెక్షన్‌లు చూపిస్తుంది.
టెక్స్ట్ లేదా ఇమేజ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. ఆబ్జెక్ట్ రికగ్నిషన్‌తో చుట్టుపక్కల ఉన్న సమాచారాన్ని తెలుపుతుంది.
ఏఐతో మీటింగ్‌లు రికార్డ్ చేసి సమ్మరీలు జనరేట్ చేస్తుంది.
క్వార్క్ గ్లాసెస్ ధర S1కు 3,799 యువాన్ (సుమారు రూ.53,600), G1 మోడల్‌కు 1,899 యువాన్ (సుమారు రూ.26,800) వరకు ఉంది.
ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు


