ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది! | JSW Motors Teases Upcoming Jetour T2 | Sakshi
Sakshi News home page

JSW Jetour T2: ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!

Feb 27 2026 7:26 PM | Updated on Feb 27 2026 7:29 PM

JSW Motors Teases Upcoming Jetour T2

భారతీయ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. చాలామంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసమే జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ 'జెటోర్ టీ2' (Jetour T2) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన జెటోర్ టీ2 కారును లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది. దీనిని మహారాష్ట్రలోని దాని రాబోయే ఛత్రపతి సంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

జెటోర్ టీ2 గ్లోబల్ మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) & ఆల్-ఎలక్ట్రిక్ (EV) వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మాత్రం హైబ్రిడ్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అంటే ఇది చిన్న బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్  కూడా పొందుతుందన్నమాట

హైబ్రిడ్ వెర్షన్ 26.7kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేసిన.. 154hp / 220Nm అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సింగిల్ మోటార్ FWD సెటప్ లేదా డ్యూయల్-మోటార్ AWD లేఅవుట్‌లో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్ రేంజ్ 139 కి.మీ. కాగా పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ద్వారా ఎక్కువ మైలేజ్ లభించనుంది. కాబట్టి మొత్తం మైలేజ్ 1000 కిమీ కంటే ఎక్కువ వస్తుంది. జెటోర్ టీ2 కారు ధరలు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement