దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగాలు | Deepinder Goyal Health Tech Startup Temple Is Hiring But Body Fat Criteria Sparks Debate | Sakshi
Sakshi News home page

దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగాలు

Feb 27 2026 5:03 PM | Updated on Feb 27 2026 5:28 PM

Deepinder Goyal Startup Temple Is Hiring But Only If You Have Less Body Fat

జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.

ఏమిటీ ‘టెంపుల్’?
ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్‌ టైమ్‌లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం
‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.

ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్‌ సరదాగా కామెంట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement