నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో వైఎస్‌ జగన్‌ | YS Jagan Attend Nandishwara Temple Event In Pulivendula Updates | Sakshi
Sakshi News home page

నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో వైఎస్‌ జగన్‌

Feb 25 2026 8:15 AM | Updated on Feb 25 2026 2:42 PM

YS Jagan Attend Nandishwara Temple Event In Pulivendula Updates

సాక్షి, పులివెందుల: దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని.. భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. పులివెందులలో రెండో రోజు పర్యటన సందర్బంగా వైఎస్‌ జగన్‌.. నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి, స్వామివారికి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది’ అని అన్నారు.

 

ఈ క్రమంలోనే నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్‌ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వైఎస్ జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement