జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ

Feb 25 2026 9:34 AM | Updated on Feb 25 2026 9:34 AM

జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ

జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ

కడప సెవెన్‌రోడ్స్‌ : 2026–27 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్‌ కార్డులను మంగళవారం కలెక్టర్‌ శ్రీధర్‌ జర్నలిస్టులకు పంపిణీ చేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ మొదటి సమావేశంలో ఆమోదం పొందిన 541 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్‌లు జారీ చేశారు. అక్రిడిటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయులకు కూడా వారి అర్హత మేరకు తదుపరి సమావేశంలో మంజూరు చేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. మొదటి జాబితాలో ఆమోదం పొందిన పాత్రికేయులందరూ బస్సు సౌకర్యాన్ని పొందగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.బాలకృష్ణారెడ్డి, డీఎంఏసీ కమిటీ సభ్యులు రామసుబ్బారెడ్డి, నూర్‌ బాషా, మనోహర్‌, సందీప్‌కుమార్‌రెడ్డి, మురళి మోహన్‌గౌడ్‌, శ్రీకాంత్‌, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement