ప్రారంభమైన మఠాధిపతి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన మఠాధిపతి పట్టాభిషేకం

Feb 25 2026 9:34 AM | Updated on Feb 25 2026 9:34 AM

ప్రారంభమైన  మఠాధిపతి పట్టాభిషేకం

ప్రారంభమైన మఠాధిపతి పట్టాభిషేకం

ప్రారంభమైన మఠాధిపతి పట్టాభిషేకం యూరియా, పొటాష్‌ రాక సైక్లింగ్‌ జట్ల ఎంపిక ప్రభుత్వ క్యాలెండర్‌ ఆవిష్కరణ పంట రిజిస్ట్రేషన్‌ పక్కాగా చేయాలి

బ్రహ్మంగారిమఠం: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి నూతన మఠాధిపతి పట్టాభిషేకం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మఠం ఆస్థాన పండితులు వేదమంత్రాలు, హోమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠాధిపతి వెంకటాద్రి స్వామి బ్రహ్మంసాగర్‌లో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం మఠాధిపతి దంపతులు హోమం నిర్వహించారు.

కడప అగ్రికల్చర్‌: జిల్లాకు మంగళవారం 884 టన్నుల యూరియాతో పాటు 224 టన్నుల మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌(ఎంఓపీ) వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బుక్కె చంద్రనాయక్‌ తెలిపారు. ఇందులో 442 మెట్రిక్‌ టన్నుల యూరియాను ప్రైవేట్‌ డీలర్లకు కేటాయించగా, మరో 442 టన్నులను మార్కెఫెడ్‌కు.. అలాగే ఎంఓపీ 112 టన్నుల ఎంఓపీని ప్రైవేటు డీలర్లకు, మరో 112 టన్నులను మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు ఆయన తెలిపారు. కడపకు వచ్చిన యూరియా, ఎంఓపీలను కడప మండల వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్‌రెడ్డి, జేడీఏ కార్యాలయ ఏవో గోవర్ధన్‌లతో కలిసి పరిశీలించారు.

మదనపల్లెఅర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు మంగళవారం స్థానిక జడ్పీహైస్కూల్లో జిల్లా సైక్లింగ్‌ అండర్‌–18 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్‌ జట్ల వివరాలను మీడియాకు వెల్లడించారు.

కడప సెవెన్‌రోడ్స్‌: రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా ప్రచురించిన 2026 సంవత్సరం క్యాలెండర్‌ను మంగళవారం కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ఈ క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ నిధి మీనా, కేఎంసీ కమిషనర్‌ మనోజ్‌ రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, హౌసింగ్‌ పీడీ రాజారత్నం, స్టెప్‌ సీఈవో నోడల్‌ అధికారి జోయల్‌ విజయ్‌ కుమార్‌, డీఐ పీఆర్వో పద్మజ తదితరులు పాల్గొన్నారు.

పెండ్లిమర్రి: రైతులు సాగు చేసిన పంట నమోదు రిజిస్ట్రేషన్‌ పక్కాగా చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్‌ అన్నారు. మండలంలోని మిట్టమీదపల్లె గ్రామ పాలాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పుడు రైతులు స్వతహాగా పంట నమోదు చేసుకొనేందుకు ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని రైతులందరూ డౌన్లోడ్‌ చేసుకొని పంట నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే ప్రస్తుత సీజన్‌లో సాగు చేసిన బుడ్డశనగ, మినుము, కంది, పెసర పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. రైతులు సమీపంలోని డీసీఎంఎస్‌ కేంద్రాలకు వెళ్లి పంటను అమ్ముకోవచ్చన్నారు. కార్యక్రమంలో టెక్నికల్‌ ఏఓ విజయ భారతి, ఏఓ అరవింద్‌ నాయక్‌, ఏఈఓ గంగాధర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement