కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్జున్ సర్జా | Tollywood Actor Arjun Sarja Visits Kondagattu Hanuman Temple, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Arjun Sarja: కొండగట్టు అంజన్నకు అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు

Feb 17 2026 5:37 PM | Updated on Feb 17 2026 6:14 PM

tollywood actor Arjun Sarja Visits Kondagattu Hanuman Temple

తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్‌ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.

కాగా.. అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ సీతాపయనం. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయన్‌గా మెప్పించింది. ఈ మూవీ ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో అర్జున్‌ సర్జా కీలక పాత్రలో మెప్పించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement