ఢిల్లీలో హై అలర్ట్‌.. ఆలయాలకు భద్రత పెంపు | Delhi On High Alert, Intelligence Warns Of Potential Bombing By LeT Near Red Fort And Chandni Chowk, More Details Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో హై అలర్ట్‌.. ఆలయాలకు భద్రత పెంపు

Feb 21 2026 10:13 AM | Updated on Feb 21 2026 11:40 AM

High alert in Delhi

ఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద  బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో పోలీసులు అప్రతమ్తమై, హై అలర్ట్‌ ప్రకటించారు. పాక్ మసీదు వద్ద పేలుళ్లకు  ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భద్రతా సంస్థలు శనివారం మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. ఎర్రకోట సమీపంలోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు పేలుడు పరికరం (ఐఈడీ)తో దాడికి ప్రణాళిక వేస్తున్నారని నిఘా వర్గాలు సూచించాయి. చాందినీ చౌక్‌లోని ఒక ప్రముఖ ఆలయంపై ప్రత్యేకంగా దాడికి ప్రణాళిక వేస్తున్నాన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.

ఫిబ్రవరి 6న పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన పేలుడు తర్వాత, ఆ సంస్థ భారతదేశంలో భారీ ఉగ్ర దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఈ సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ఎర్రకోట, చాందినీ చౌక్, చుట్టుపక్కల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రత్యేక నిఘాలో ఉన్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోని ఒక ప్రధాన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement