సరిహద్దు గ్రామాల ప్రగతికి పెద్దపీట  | Home Minister Amit Shah launches Vibrant Village Programme 2. 0 in Assam | Sakshi
Sakshi News home page

సరిహద్దు గ్రామాల ప్రగతికి పెద్దపీట 

Feb 21 2026 6:32 AM | Updated on Feb 21 2026 11:34 AM

Home Minister Amit Shah launches Vibrant Village Programme 2. 0 in Assam

కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్‌ షా వెల్లడి  

అస్సాంలో వైబ్రాంట్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌ రెండో దశ ప్రారంభం  

అక్రమ చొరబాట్లను సహించబోమని స్పషీ్టకరణ  

నథాన్‌పూర్‌:  వైబ్రాంట్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌(వీవీపీ) రెండో దశను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అస్సాంలోని చాచర్‌ జిల్లాలో ప్రారంభించారు. భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దును తనిఖీ చేశారు. ఆయన శుక్రవారం అస్సాంలో పర్యటించారు. వీవీపీ ప్రారం¿ోత్సవంలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో వలసలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. మనదేశంలోకి అక్రమ చొరబాట్లను సహించబోమని పునరుద్ఘాటించారు.

 దేశంలో సరిహద్దు గ్రామాల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వీవీపీ రెండో దశలో భాగంగా 1,954 సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో 17 రాష్ట్రాల్లో ఈ గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రగతితో ప్రజలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పొట్టచేతపట్టుకొని ఇతర ప్రాంతాలు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.  

చొరబాట్లను అడ్డుకున్నాం  
అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దులను ఇష్టారాజ్యంగా తెరిచారని, పొరుగుదేశం నుంచి చొరబాట్లు విచ్చలవిడిగా జరిగాయని అమిత్‌ షా ధ్వజమెత్తారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత చొరబాట్లకు అడ్డుకట్ట పడిందని స్పష్టంచేశారు. అస్సాంకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆక్షేపించారు.

 రాష్ట్రంలో బీజేపీ పాలనలో నిత్యం 14 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. సరిహద్దు గ్రామాలను గతంలో దేశంలోనే చివరి గ్రామాలుగా పరిగణించేవారని గుర్తుచేశారు. అప్పట్లో అవి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవని అన్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు మారిపోయిందని స్పష్టంచేశారు. సరిహద్దు గ్రామాలు కూడా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. 

వీవీపీ రెండో దశలో భాగంగా అస్సాంలో రూ.6,900 కోట్లతో 140 గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామని తేలి్చచెప్పారు. రాష్ట్రంలో వరదల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని అమిత్‌ షా గుర్తుచేశారు. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అస్సాంకు కేవలం రూ.1.28 లక్షల కోట్లు మాత్రమే ఇచి్చందని ఆక్షేపించారు. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అస్సాంకు ఏకంగా రూ.15 లక్షల కోట్లు ఇచి్చందని స్పష్టంచేశారు. 

మరోవైపు అమిత్‌ షా బంగ్లాదేశ్‌ సరిహద్దును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరిహద్దు వద్ద మర్రి మొక్క నాటారు. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బీఎస్‌ఎఫ్‌ క్యాంపులో అమర జవాన్ల స్మారకం వద్ద నివాళులరి్పంచారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది డిసెంబర్‌ 29 నుంచి అమిత్‌ షా అస్సాంలో పర్యటించడం ఇది మూడోసారి. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుబోతున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement