సీఈఓలతో మోదీ భేటీ  | PM Narendra Modi Meets AI and Deeptech Startup CEOs | Sakshi
Sakshi News home page

సీఈఓలతో మోదీ భేటీ 

Feb 21 2026 4:29 AM | Updated on Feb 21 2026 4:29 AM

PM Narendra Modi Meets AI and Deeptech Startup CEOs

పలువురు దేశాధినేతలతో కూడా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు టెక్నాలజీ, ఏఐ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 16 ఏఐ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ల వ్యవస్థాపకులతో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉన్నత విద్య తదితర రంగాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపై వారితో చర్చించారు. వీటితో పాటు పలు అంశాలపై తమ వ్యూహాలు తదితరాలను సీఈఓలు ప్రధానితో పంచుకున్నారు. వారంతా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌ వచ్చారు.

 అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, స్లొఒవేకియా అధ్యక్షుడు పీటర్‌ పెలెగ్రిని, మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, లీచెన్‌స్టైన్‌ రాకుమారుడు అలోయిస్‌తో మోదీ విడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై వారితో లోతుగా చర్చించారు. దిస్సనాయకెతో భేటీ అద్భుతంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, కీలక నైపుణ్యాలు, సంస్కృతి, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. ఇతర దేశాధినేతలతో భేటీలో కూడా పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచి్చనట్టు వెల్లడించారు. 

గుటెరస్‌తో సమావేశం 
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. ఏఐ ప్రస్థానం, దాని ఫలాలు అన్ని దేశాలకు సముచితంగా అందడంలో ఐరాస పాత్ర తదితరాలపై ఆయనతో లోతుగా చర్చించారు. ఏఐ సాంకేతికతను ప్రపంచ ప్రగతి కోసం మరింత సమర్థంగా వినియోగించే విషయంలో భారత్‌ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని గుటెరస్‌కు హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement