బాధ్యత నిండిన భవిత కోసం... | Artificial intelligence is captivating the world | Sakshi
Sakshi News home page

బాధ్యత నిండిన భవిత కోసం...

Feb 21 2026 3:39 AM | Updated on Feb 21 2026 3:39 AM

Artificial intelligence is captivating the world

కృత్రిమమేధ (ఏఐ) ప్రపంచాన్ని సమ్మోహపరుస్తోంది. దాని ప్రభావంతో మానవ జీవితంలోని ప్రతి పార్శ్వమూ రూపాంతరం చెందుతోంది. మానవాళికీ, అవనికీ మేలు చేకూర్చగల గొప్ప సామర్థ్యం దానికి ఉందనడంలో సందే హం లేదు. అయితే,  అది చూపగల ప్రభా వాల గురించే తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా చాలామంది ఉపాధి కోల్పోతారని, తప్పుడు సమా చారం పెరుగుతుందని చెబుతున్నారు. 

మానవాళికి ఏఐ గొప్ప మేలు చేసినదవుతుంది, లేదా భయంకరమైన శత్రువుగా పరిణమిస్తుందని నేను భావిస్తున్నాను. ఏఐకి మార్గదర్శక సూత్రాలు లేదా నియంత్రణలు తీసుకురావాలనే ప్రయత్నం ఊపందుకుంది. నేను ‘కరుణా పూరిత ఏఐ’ అనే కొత్త భావనను పరిచయం చేయాలనుకుంటు న్నాను. ఇది దయా గుణంలో ఏఐకి దారి చూపుతుంది. దానిగురించి మరింత వివరించే ముందు ఇపుడు ఎదురవుతున్న కొన్ని తీవ్రమైన సవాళ్ళు ఏమిటో చూద్దాం. 

ఏఐ విసురుతున్న సవాళ్ళు 
ఒకటి – భారీ ప్రయోజనాలు పణంగా ఉన్న రేసులో ఏఐ అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిణమించింది. ఏఐ తెచ్చి పెట్టగల లాభాలు, అధికారం కోసం కొద్దిపాటి దేశాల మధ్య, దిగ్గజాల వంటి టెక్‌ కంపెనీలు, ప్రైవేటు సంస్థల మధ్య పోటీ మొద లైంది. సంపన్న దేశాలు, అభివృద్ధిలో ఇంకా అఆలు కూడా నేర్చు కోని దేశాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఏఐపై గుత్తాధిపత్యం సంపాదించినవాళ్ళు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపైన కూడా అసా ధారణమైన పట్టును ప్రదర్శించ గలుగుతారు. 

రెండు – ఏఐ ఇక ఎంతమాత్రం సాంకేతిక సాధనం కాదు. అది తనకుతాను మార్గదర్శనం చేసుకుని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తిగల ఏజెంట్‌గా పరిణమిస్తోంది. ఇపు డున్న మానవ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏఐ సిస్టంలు సిద్ధమవుతున్నాయి. వీటిలో పక్షపాతపూరిత చారిత్రక కథ నాలు, భ్రమలు, విశ్వాసాలు, అభూత కల్పనలు, అసత్యాలు కూడా ఉన్నాయి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఏఐ ఆటోమేటిక్‌గా సృష్టించగలదు. 

మోసపూరిత చర్యలకు వెసులుబాటు కల్పించ గలదు. విభేదాలను, విద్వేషాలను రెచ్చగొట్టగలదు. హింసకు కూడా ప్రేరేపించగలదు. మానవ సంభాషణలను ఏఐ సిస్టంలు తిమ్మిని బమ్మి చేయగలవు. బ్యాంకులను వంచించడం, డీప్‌ ఫేక్‌ పోర్నోగ్రఫీ, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతతో సహా ఏఐ సంబంధిత నేరాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 

మూడు – సమాజంపై సైకలాజికల్‌ ప్రభావం. ముఖ్యంగా ఏఐపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న యువత దాని ప్రభావా నికి లోనవుతున్నారు. భవిష్యత్తులో వచ్చే సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఊహించనలవికానిది. తల్లితండ్రులు, టీచర్లు, సహాధ్యాయులతో నామమాత్రపు చనువు, లేదా అసలేమీ పట్టనట్లుగా పెరిగే తరాన్ని ఊహించుకోండి. ఏఐ ప్రాథమిక రూపంపై ఆధారపడిన సోషల్‌ మీడియా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతోందో  ఇప్పటికే మనం గమనిస్తున్నాం. కౌమారంలో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక వైకల్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒంటరితనం, మనోవ్యధ, ఆందోళనతో వారు సతమతమవుతున్నారు. 

నాలుగు – సహజంగానే మెషీన్‌ మెదడు మానవ మెదడు కన్నా చురుకుగా పనిచేస్తుంది. ఏఐ వల్ల లాభాలు ఉత్తేజపరచేవిగాను, వినోదపరచేవిగాను కనిపిస్తున్నప్పటికీ, ఎవరు ఎవరిని అంతిమంగా నియంత్రిస్తారనే తాత్త్విక ప్రశ్న తలెత్తుతోంది. సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, న్యాయం, పరిపాలనను కాపాడే నిర్ణయాలు ఎవరివవుతాయి? భావోద్రేకాలు, స్పందించే గుణం ఉన్న మానవ మెదళ్ళవా, లేక ఇతరుల బాధలను, కష్టాలను కనిపెట్టగల జీవశాస్త్ర సామర్థ్యం కొరవడిన కలనగణితాలవా? 

కరుణ ఆధారంగా...
నైతికత, నియంత్రణలు ముఖ్యమే. కానీ, వాటికి పరిమి తు లున్నాయి. వాటిని సృష్టించేది, పర్యవేక్షించేది మనుషులే కదా! తన మార్గాన్ని నిర్ణయించుకోవడంలో మెషీన్‌ మెదడు యుక్తితో, వేగంతో వ్యవహరిస్తుంది. ఏఐ వెనుక ఉండే మానవ మనస్తత్త్వం మారకపోతే ఎటువంటి నియంత్రణనైనా అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళి పోగలదు. కనుక, ఏఐ దిక్సూచి కరుణను ఆధారం చేసుకున్నదిగా ఉండాలి. 

కరుణను నేనొక విలువగానో, సద్గుణంగానో, బలహీ నమైన మనస్కుల నుంచి వ్యక్తమయ్యేదిగానో, లేదా నైతిక నైరూప్య ఆలోచనగానో చెప్పడం లేదు. ఇతరుల బాధను చూసి అలాంటి కష్టం తనకూ రావచ్చుననే జ్ఞానంతో, ఎదుటి వ్యక్తిని దాన్నుంచి బయటపడేయడానికి కార్యాచరణకు దిగాలని ప్రోత్సహించే శక్తిగా చూస్తున్నాను. న్యాయం, సమానత్వం, శాంతి, స్వావలంబనను ఏర్పరచడానికి అటువంటి చోదక శక్తి అత్యవసరం. 

మనసు లోపల ఉండే ఆర్ద్రతను కనిపెట్టవచ్చు. వ్యక్తులు,సంస్థలలో దానిని పెంపొందించవచ్చు. దీని నిమిత్తం మేమొక శాస్త్రీయ చట్రాన్ని అభివృద్ధి చేశాం. దానిని ‘సత్యార్థి కంప్యాషన్‌ కోషియంట్‌’గా పిలుస్తున్నారు. యుక్తితోనే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించగల భవిష్యత్తుకు అది తోడ్పడ గలదు. అందరూ పంచుకోవలసిన విలువలు, సంపద, బాధ్యత, జవాబు దారీతనంతో కూడిన ప్రపంచాన్ని అది స్వప్నిస్తోంది. 

ఏఐని సృజించే, అమలుపరచే, దాన్నుంచి లబ్ధి పొందేవారిలో మనం దయా గుణాన్ని ప్రోత్సహించాలి. కరుణలో చైతన్యం, అను సంధానమవడం, స్పందించడం, కార్యాచరణకు దిగడమనే నాలుగు కీలక కోణాలున్నాయి. మానవ, జీవావరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆ నాలుగింటి గురించి ఏఐ అభివృద్ధిలో చొప్పించాలి. తొలు తటి ఆలోచన నుంచి తుది ఉత్పత్తి వరకు ఆ అంశాలను సమైక్య పరచాలి. సమస్య నిర్వచనం, వ్యూహం, డేటా సేకరణ, ఇంజనీరింగ్, మోడల్‌ డెవలప్‌మెంట్, మదింపు, పరీక్ష, డిప్లాయ్‌మెంట్, ఇంటెగ్రేషన్, నిర్వహణ... ఇలా అన్నింటిలోనూ ఆ నాలుగూ మమేక మవ్వాలి. ఈ విధానం కంప్యాషనేట్‌ ఏఐ అభివృద్ధికి దారి తీస్తుంది. 

టెక్‌ కంపెనీలు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వాలతో సహా ఈ విభాగంలో పాత్రధారులైన అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. ఉమ్మడి శ్రేయస్సును ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. ఋగ్వేదం‘సంగచ్ఛధ్వవం, సంవదధ్వవమ్, సం వో మనాంసి జానతావ్‌ు’అంటుంది. మనందరం కలసి నడుద్దాం. ఉమ్మడి భాషను మాట్లాడు కుందాం. అందరి క్షేమం కోసం అందరం పంచుకునే విధంగా సమష్టిగా విజ్ఞానాన్ని సృష్టించుకుందాం అని దాని అర్థం.

-వ్యాసకర్త నోబెల్‌ బహుమతి గ్రహీత
-కైలాశ్‌ సత్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement