ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం | After 11000 Layoffs Accenture Says Use AI At Work For Promotion | Sakshi
Sakshi News home page

ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం

Feb 20 2026 4:28 PM | Updated on Feb 20 2026 4:50 PM

After 11000 Layoffs Accenture Says Use AI At Work For Promotion

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.

ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.

యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్‌లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.

మూడు నెలల్లో 11000 మంది!
యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.

ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

Advertisement
 
Advertisement
Advertisement