ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్! | PM Narendra Modi Unveils MANAV Vision at India AI Impact Summit 2026 | Sakshi
Sakshi News home page

ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

Feb 19 2026 3:57 PM | Updated on Feb 19 2026 4:20 PM

PM Narendra Modi Unveils MANAV Vision at India AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.

MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.

MANAV అంటే?
M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.

A -  Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.

N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.

A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.

V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.

మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.

ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement