ముంబై, బెంగళూరుల్లో ఓపెన్ఏఐ కార్యాలయాలు | OpenAI Announced Will Open New Offices In Mumbai And Bengaluru At AI Impact Summit 2026, CEO Highlights India's AI Leadership | Sakshi
Sakshi News home page

ముంబై, బెంగళూరుల్లో ఓపెన్ఏఐ కార్యాలయాలు

Feb 19 2026 11:58 AM | Updated on Feb 19 2026 12:34 PM

OpenAI announced will open new offices in Mumbai Bengaluru AI Impact Summit 2026

ప్రముఖ జనరేటివ్‌ ఏఐ చాట్ జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ తన భారతీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీలో తన కార్యాలయం ప్రారంభించిన సంస్థ ఈ ఏడాది చివర్లో ముంబై, బెంగళూరుల్లో రెండు కొత్త కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆల్ట్‌మన్‌ స్పందిస్తూ.. భారతదేశంలో ఏఐని వేగంగా స్వీకరిస్తుండడంపై సామ్ ఆల్ట్‌మన్ ప్రశంసలు కురిపించారు. ‘భారతదేశం ఇప్పటికే ఏఐ వినియోగంలో ప్రపంచ దేశాల కంటే ముందు వరుసలో ఉంది. ఇక్కడి అద్భుతమైన సాంకేతిక ప్రతిభ, ఏఐ పట్ల ప్రజల్లో ఉన్న ఆశావాదం, ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏఐని ఎలా అభివృద్ధి చేయవచ్చో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారనుంది’ అన్నారు.

ముంబై, బెంగళూరు కార్యాలయాల ద్వారా స్థానిక మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, భారతీయ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘భారతదేశం కోసం, భారతదేశంలో, భారత్‌తో కలిసి ఏఐని నిర్మించడమే మా సంకల్పం’ అని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: యూఎస్‌-ఇరాన్‌ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్‌ ధరలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement