చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్‌ సంఘటన | AI Cold War On Stage OpenAI, Anthropic CEOs No Handshold at India AI Impact Summit | Sakshi
Sakshi News home page

చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్‌ సంఘటన

Feb 19 2026 1:55 PM | Updated on Feb 19 2026 3:11 PM

AI Cold War On Stage OpenAI, Anthropic CEOs No Handshold at India AI Impact Summit

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్‌ టెక్‌ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సహా అందరూ చేతులు కలిపగా  ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman), ఆంథ్రోపిక్‌ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్‌లైన్‌లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్‌  సిద్ధార్థ్‌ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాగా డారియో అమొడెయి ఓపెన్‌ఏఐలో రీసెర్చ్‌ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్‌ సంస్థ‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement