టారిఫ్‌ టైమ్‌లైన్‌ | Timeline of Trump Tariffs | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ టైమ్‌లైన్‌

Feb 21 2026 4:09 AM | Updated on Feb 21 2026 4:09 AM

Timeline of Trump Tariffs

2025 
⇒  జనవరి 20: అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ రెండోసారి ప్రమాణస్వీకారం. కెనడా, మెక్సికోపై ఫిబ్రవరి 1 నుంచి 25 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ ప్రకటన 
⇒  జనవరి 26: వలసదారుల విమానాలను అనుమతించనందుకు కొలంబియాపైనా 25 శాతం టారిఫ్‌లు తప్పవని హెచ్చరికలు. దాంతో వాటిని తమ దేశంలోకి అనుమతించిన కొలంబియా. 

⇒  ఫిబ్రవరి 1: మెక్సికో, కెనడాలపై 10 శాతం, చైనా దిగుమతులన్నింటిపైనా 25 శాతం టారిఫ్‌లు. 
⇒  ఫిబ్రవరి 4: చైనా ఉత్పత్తులపై మరో 10 శాతం టారిఫ్‌లు. బదులుగా అమెరికాపైనా 15 శాతం టారిఫ్‌లు విధించిన చైనా. 

⇒  ఫిబ్రవరి 10: అమెరికాలో ప్రవేశించే స్టీలు, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్‌ల నుంచి 25 శాతానికి పెంపు. 
⇒  ఫిబ్రవరి 13: తొలిసారిగా ప్రతీకార సుంకాలను ప్రకటించిన ట్రంప్‌. చైనా, కెనడా, మెక్సికోతో పాటు భారత్‌పైనా వాటిని విధిస్తామని హెచ్చరిక. 

⇒  మార్చి 4: కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 20 శాతం టారిఫ్‌లు అమల్లోకి. అమెరికాపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన చైనా, కెనడా 
⇒  మార్చి 26: అమెరికాలోకి దిగుమతయ్యే ఆటో ఉత్పత్తులన్నింటిపైనా 25 శాతం టారిఫ్‌లు. 

⇒  ఏప్రిల్‌ 2: ఏకంగా 70కి పైగా దేశాలపై టారిఫ్‌ల విధింపు. ఏప్రిల్‌ 10    నుంచి దాదాపుగా ప్రతి దేశంపైనా 10 శాతం కనీస సుంకాలు. భారత్‌పై తొలిసారిగా 26 శాతం సుంకాలు. చైనాపై 34 శాతం, జపాన్‌పై    
24 శాతం, ఈయూపై 20 శాతం. 

⇒  ఏప్రిల్‌ 3: అన్ని చైనా దిగుమతులపైనా 34 శాతం సుంకాలు. దాంతో ఆ దేశంపై ఏకంగా 104 శాతానికి చేరిన మొత్తం సుంకాలు. రెండు వారాల పాటు పరస్పర సుంకాలను విపరీతంగా పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా. 

⇒  మే 23: ఈయూ వస్తువులన్నింటిపైనా నేరుగా 50 శాతం టారిఫ్‌లు. రెండు రోజుల్లోనే ఉపసంహరణ. 
⇒  మే 28: దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లపై స్టే విధించిన యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు. 
⇒  మే 29: ట్రేడ్‌ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ టారిఫ్‌లను పునరుద్ధరించిన ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు. 

⇒  జూన్‌ 3: అమెరికాలోకి స్టీలు, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు 25 నుంచి 50 శాతానికి పెంపు. 
⇒  జూలై 6: బ్రిక్స్‌ దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు తప్పవని ట్రంప్‌ హెచ్చరికలు. 
⇒  జూలై 7: జపాన్, దక్షిణ కొరియా సహా 14 దేశాలపై 25 నుంచి 40 శాతం దాకా టారిఫ్‌లు. 

⇒  జూలై 8: అమెరికాలోకి రాగి దిగుమతులపై 50 శాతం సుంకాలు. 
⇒  జూలై 10, 12: కెనడాపై 35 శాతం, ఈయూపై 30 శాతం టారిఫ్‌లు. 
⇒  జూలై 15: పలు చిన్న దేశాలపై మరో 10 శాతం టారిఫ్‌లు. 
⇒  జూలై 27: ఈయూతో అమెరికా వాణిజ్య ఒప్పందం. టారిఫ్‌లు 15 శాతానికి తగ్గింపు. 

⇒  జూలై 30: భారత వస్తూత్పత్తులపై 25 శాతం సుంకాలు. బ్రెజిల్‌పై 50 శాతం బాదుడు. 
⇒  జూలై 31: 69 దేశాలపై 10 నుంచి 41 శాతం దాకా టారిఫ్‌లు. 
⇒  ఆగస్టు 6: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై మరో 25 శాతం టారిఫ్‌లు. 
⇒  సెప్టెంబర్‌ 25: అన్ని దేశాలపైనా బ్రాండెడ్‌ డ్రగ్స్‌పై 100 శాతం, ట్రక్కులపై 25 శాతం టారిఫ్‌లు.

2026 
⇒  ఫిబ్రవరి 2: భారత్‌పై టారిఫ్‌లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు. 25 శాతం చమురు టారిఫ్‌ ఎత్తివేత 
⇒  ఫిబ్రవరి 20: దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement