ఐక్యూ15ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌: ధర ఎంతంటే? | iQOO 15R Launched in India | Sakshi
Sakshi News home page

ఐక్యూ15ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌: ధర ఎంతంటే?

Feb 27 2026 6:58 PM | Updated on Feb 27 2026 7:01 PM

iQOO 15R Launched in India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ కొత్తగా 15ఆర్‌ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. డిస్కౌంట్లు, ఆఫర్లు పోగా ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌ మొదలైన వాటిల్లో సేల్‌ మొదలవుతుంది.

ఇందులో 6.59 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5, 7600 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ క్యూ2, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆరిజిన్‌ ఓఎస్‌ 6.0 తదితర ఫీచర్లు ఉంటాయి. 4 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement