యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఓ కొత్త ఐఫోన్ మోడల్ లాంచ్ చేస్తూ ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 పేరుతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఐఫోన్ 18 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ రెండూ కూడా కొత్త ఫీచర్స్ పొందనున్నాయి. ప్రో & ప్రో మ్యాక్స్‌లలో 6.27 అంగుళాల 120Hz, 6.86 అంగుళాల 120Hz అలాగే ఉన్నాయి. ఐఫోన్ ప్రతి సంవత్సరం కొత్త చిప్ పొందుతుంది. ఇందులో భాగంగానే.. ఐఫోన్ 18 ప్రో కోసం A20 ప్రో చిప్ 2nm ప్రాసెస్ అందించనున్నారు.
కెమెరా విషయానికి వస్తే.. ఒక వెనుక కెమెరాలో మెకానికల్ ఐరిస్ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో & ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ.1,34,900 & రూ.1,49,900గా ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే స్టోరేజ్.. కాన్ఫిగరేషన్ అప్‌గ్రేడ్‌లను బట్టి ధరలు మారుతాయి.


