యాపిల్ ఫోన్‌నూ మడతెట్టేయొచ్చు..? | Everything We Need To Know About The iPhone Fold | Sakshi
Sakshi News home page

యాపిల్ ఫోన్‌నూ మడతెట్టేయొచ్చు..?

Feb 9 2026 4:06 PM | Updated on Feb 9 2026 4:16 PM

Everything We Need To Know About The iPhone Fold

శాంసంగ్, వివో, గూగుల్, వన్ ప్లస్ వంటి కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి, విక్రయిస్తున్న తరుణంలో.. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో & ప్రో మాక్స్ లాంచ్ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్ వినియోదాగారులు ఫోల్డబుల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ కోసం ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను శాంసంగ్ ఉత్పత్తి చేయనుంది. ఎందుకంటే.. శాంసంగ్ అత్యుత్తమ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ కలిగి ఉంది.

ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే దీని ధర కూడా ఎక్కువగా (సుమారు 2399 డాలర్లు) ఉండే అవకాశం ఉందని ప్రముఖ రీసర్చ్ అనలిస్ట్ ఆర్థర్ లియావో పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ పరంగా రెండు విధాలుగా ఉండవచ్చని అంచనా. ఒకటి బుక్ స్టైల్ ఫోల్డ్(ఫోన్ తెరిస్తే టాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్), మరొకటి ఫ్లిప్-స్టైల్ ఫోల్డ్ (మడిచినప్పుడు చిన్నదిగా మారే డిజైన్).

బ్యాటరీ విషయంలో.. పెద్ద స్క్రీన్‌కు సరిపడే విధంగా అధిక సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, పవర్ ఎఫిషియెన్సీపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే.. దీనికి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement