లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 9th February 2026 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Feb 9 2026 3:43 PM | Updated on Feb 9 2026 3:50 PM

Stock Market Closing Update 9th February 2026

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపుతో ముగిశాయి. సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద, నిఫ్టీ 173.60 పాయింట్ల లాభంతో 25,867.30 వద్ద నిలిచాయి.

నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్మో లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.

Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement