గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.
ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్‌సెట్ పొందుతుంది.
ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!
ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, ఫోన్‌లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్‌సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.


