అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్! | Tesla Model Y Gets Up To Rs 2 Lakh Discount | Sakshi
Sakshi News home page

అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!

Jan 18 2026 5:39 PM | Updated on Jan 18 2026 5:56 PM

Tesla Model Y Gets Up To Rs 2 Lakh Discount

చాలారోజుల నిరీక్షణ తరువాత.. అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా భారతదేశంలో 'మోడల్ వై' లాంచ్ చేసింది. అయితే ప్రారంభం నుంచి దీని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కార్లన్నీ.. షోరూంలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ.. వీటి అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్ ప్రకటించింది.

టెస్లా ఇండియా.. ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్ముకోవడానికి మోడల్ Y కొనుగోలుపైై రూ. 2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ స్టీల్త్ గ్రేలో పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్‌తో కూడిన స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌కు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో కంపెనీ 300 మోడల్ వైలను దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పటికి కూడా 100 యూనిట్లను కూడా అమ్మలేకపోయింది.

టెస్లా అమ్మకాలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. 2025లో కూడా వరుసగా రెండవ సంవత్సరం సేల్స్ తగ్గినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో చైనా బ్రాండ్ బీవైడీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పోటీ & కొన్ని కార్ మార్కెట్లలో సబ్సిడీలు తగ్గడం వల్ల అమెరికా, యూరప్, చైనా అంతటా టెస్లా వాటా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement