మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా.. | Today Gold and Silver Price In India Know The Latest Rates | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..

Feb 10 2026 9:16 PM | Updated on Feb 10 2026 9:18 PM

Today Gold and Silver Price In India Know The Latest Rates

భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.

చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.

ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.

వెండి ధరలు
ఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement