ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక! | Anthropic Head Of AI Safety Mrinank Sharma Quits | Sakshi
Sakshi News home page

ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక!

Feb 10 2026 6:38 PM | Updated on Feb 10 2026 6:44 PM

Anthropic Head Of AI Safety Mrinank Sharma Quits

ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్‌ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.

ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement