బజాజ్ ఆటో.. ఎంపిక చేసిన పల్సర్ మోడళ్ల ధరలను రూ.461 నుంచి రూ.1,460 వరకు పెంచింది. పెరిగిన ధరల కారణంగా.. చాలా బైకుల రేట్లు మారిపోయాయి. ఎంట్రీ లెవల్ పల్సర్ 125 సిరీస్‌లో, నియాన్ సింగిల్ సీట్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.79,048 నుంచి రూ.79,939కి పెరిగింది. కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ ధర రూ.85,633 నుంచి రూ.86,411కి పెరిగింది, కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ ధర రూ.87,527 నుంచి రూ.88,547కి పెరిగింది.
పల్సర్ N125 బైక్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే NS125 బేస్ వేరియంట్ ధర రూ. 91,182 నుంచి రూ. 92,642కు చేరింది. LED BT రూ. 93,792 నుంచి రూ. 94,253లకు, LED BT ABS రూ. 98,400 నుంచి రూ. 98,955లకు చేరింది. పల్సర్ 150 సింగిల్-డిస్క్ & ట్విన్-డిస్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,11,669 & రూ.1,15,481 వద్ద (వీటి ధరల్లో ఎటువంటి మార్పు లేదు) అలాగే ఉన్నాయి.
పల్సర్ NS160, NS200, RS200 ధరలు రూ.702 చొప్పున పెరిగి, ఇప్పుడు రూ.1,20,873, రూ.1,32,726 & రూ.1,71,873 వద్ద ఉన్నాయి. డిసెంబర్ 2025లో 2026 అప్‌డేట్ తర్వాత పల్సర్ 220F రూ.1,28,490 నుంచి రూ.1,29,186లకు చేరింది. 250cc విభాగంలో, పల్సర్ N250 ధర రూ.1,34,166 కాగా, టాప్-ఎండ్ పల్సర్ NS400Z ధర రూ.1,93,830 వద్ద ఉంది.


