2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా | Baba Vanga Gold Silver Copper Prediction 2026 | Sakshi
Sakshi News home page

2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా

Feb 8 2026 3:23 PM | Updated on Feb 8 2026 4:42 PM

Baba Vanga Gold Silver Copper Prediction 2026

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు.. బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచారు. బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే ఈమె.. అనేక దేశాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ పరిణామాలపై చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రజలు నమ్మడం వల్ల ఆమె పేరు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.

ప్రపంచంలోని చాలా దేశాలు.. కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీసాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుంది. దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళనను మొదలైపోయాయి.

కరెన్సీకి ఎప్పుడైతే విలువ తగ్గిపోతుందో.. అలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలే భద్రమైన ఆస్తులుగా మిగులుతాయని, వాటి విలువ ఈ ఏడాది మరింత పెరుగుతుందని బాబా వంగా వెల్లడించారు.

2026 ప్రారంభమైన తరువాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు రూ.1.80 లక్షలకు చేరుకుంది. వెండి ధర రూ. 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్ధిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేసాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి.

బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి, ముందుగానే బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఓసారి ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలను కూడా కొన్ని సార్లు భరించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement