వాలెంటైన్స్ డే ఆఫర్‌.. ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్లు | Apple Launches Valentines Day Sale In India, iPhone 17 Series Available With Attractive Discounts | Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్ డే ఆఫర్‌.. ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్లు

Feb 5 2026 6:08 PM | Updated on Feb 5 2026 6:33 PM

iPhone 17 series at discounted prices in Apple Valentines Day sale

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా లేటెస్ట్‌ ఐఫోన్ 17 సిరీస్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఈ సేల్‌లో భాగంగా యాపిల్ ఎప్పటిలానే నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ ఆధారిత ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లను అందిస్తోంది.  ఈ ఆఫర్లు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులపై వర్తిస్తాయి. చెక్‌అవుట్ సమయంలో అర్హత కలిగిన కార్డును ఉపయోగించిన వెంటనే ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దీంతో ఫోన్‌ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ తప్ప, మిగతా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. డెలివరీ అంచనాలు, స్టోర్ పికప్ ఆప్షన్లు, చెల్లింపు విధానం యథాతథంగా ఉంటాయి.

ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ధర
ఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది A19 చిప్, 8GB ర్యామ్, 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉండి, 10x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

  • వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.77,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీనిపై రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

ఐఫోన్ 17 ప్రో స్పెక్స్‌.. ఆఫర్లు ఇలా..
ఐఫోన్ 17 ప్రోలో  6.3 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది  120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో వస్తుంది. ఈ మోడల్‌లో A19 ప్రో చిప్ (6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్), 12GB ర్యామ్ ఉన్నాయి. అలాగే 48MP కెమెరా అరే, 5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైటానియం ఫ్రేమ్, USB-C పోర్ట్, అధునాతన AI ఫీచర్లు, అలాగే 33 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

  • వాలెంటైన్స్ డే సేల్‌లో ఈ ఫోన్  రూ.1,29,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిపై కూడా రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు, ధర
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ మోడల్ A19 ప్రో చిప్, 12GB ర్యామ్‌తో శక్తివంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్, LiDAR సెన్సార్, 5x టెలిఫోటో జూమ్,  8K వీడియో సపోర్ట్  ఉన్నాయి.

  • వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.1,44,900 ప్రత్యేక ధరకు లభిస్తుంది. దీనిపైనా రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement