డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్ | Money Cant Buy Happiness Elon Musk Tweet Viral | Sakshi
Sakshi News home page

డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్

Feb 5 2026 6:24 PM | Updated on Feb 5 2026 7:34 PM

Money Cant Buy Happiness Elon Musk Tweet Viral

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎప్పడూ సంచనల వ్యాఖ్యలు చేసే ఈయన.. ఇప్పుడు ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "డబ్బుతో ఆనందాన్ని కొనలేము" అని ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.

ఎలాన్ మస్క్ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు తన సంపదను దృష్టిలో ఉంచుకుని సరదాగా కూడా వ్యాఖ్యానించారు. అంటే మీరు సంతోషంగా లేరా? అని ఒకరు ప్రశ్నించగా.. మరొకరు, ముందు నాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వండి, నేనూ అనుభవించి చెబుతాను అని అన్నారు. ఇంకొకరు బిలియనీర్‌గా బాధపడటం, బిలియనీర్ కాకుండా బాధపడటం కంటే మెరుగైనదే.. అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఈ చర్చలో ప్రముఖ అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్‌మన్ కూడా పాల్గొనడం మరో ముఖ్యమైన అంశం. మీరు ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు. అంతేకాదు.. జీవిత భాగస్వామితో దీర్ఘకాలికమైన, స్థిరమైన సంబంధం కూడా నిజమైన ఆనందానికి కారణమవుతుందని ఆయన వ్యక్తిగత సలహా ఇవ్వడం గమనార్హం.

ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!

సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ మరో రికార్డ్ సృష్టించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 800 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. స్పేస్‌ఎక్స్, xAI వంటి సంస్థల విస్తరణ, వాటి విలువ పెరుగుదల మస్క్ సంపదను ఆ స్థాయికి తీసుకెళ్లాయి.

ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ.. డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని మస్క్ వ్యాఖ్యానించడం చాలామందిని ఆలోచనల్లోకి నెట్టేసింది. మానవ సంబంధాలు, ఇతరులకు ఉపయోగపడే పనులు అన్నీ నిజమైన సంతోషాన్ని ఇస్తాయని కొందరు మరోసారి గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement