మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.
ఆటమ్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్‌కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


