రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌: 10,001 mAh బ్యాటరీతో.. | Realme P4 Power 5G Launched with 10001 mAh Battery in India | Sakshi
Sakshi News home page

రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌: 10,001 mAh బ్యాటరీతో..

Jan 29 2026 6:35 PM | Updated on Jan 29 2026 6:55 PM

Realme P4 Power 5G Launched with 10001 mAh Battery in India

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులతో చాలామందికి ఎదురయ్యేది ఛార్జింగ్ సమస్యే. దీనికి చెక్ పెట్టడానికి రియల్‌మీ (Realme) లేటెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఏకంగా 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర ఎంత?, డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.

రియల్‌మీ లాంచ్ చేసిన ఎక్కువ బ్యాటరీ పవర్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ పేరు 'పీ4 పవర్ 5జీ'. ఇది 6.78 అంగుళాల 4డి కర్వ్⁺ అమోలెడ్ డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ & 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో 12 జిబి వరకు ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌బ్లూ ఎంపికలలో లభించే రియల్‌మీ పీ4 పవర్ 5జీ మొబైల్.. 8 జీబీ/ 128 జీబీ ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ / 256 జీబీ ధర రూ. 27,999 &12 జీబీ / 256 జీబీ ధర రూ. 30,999. ఇది పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ.. 219 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement