కాలేజీ స్టూడెంట్స్‌ కోసం ఐక్యూ జెడ్‌11ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ | iQOO Z11x Smartphone for College Students: Price Starts at Rs 17499 | Sakshi
Sakshi News home page

కాలేజీ స్టూడెంట్స్‌ కోసం ఐక్యూ జెడ్‌11ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

iQOO Z11x Smartphone for College Students: Price Starts at Rs 17499

ధర రూ. 17,499 నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ తాజాగా కాలేజీ విద్యార్థుల కోసం జెడ్‌11ఎక్స్‌ ఫోన్‌ని ఆవిష్కరించింది. దీని ధర డిస్కౌంట్ల అనంతరం రూ. 17,499 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్, ఐక్యూ పోర్టల్స్‌తో పాటు వివో స్టోర్స్, ఇతర ఔట్‌లెట్స్‌లో మార్చి 16 మధ్యాహ్నం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

మల్టీటాస్కింగ్‌కి ఉపయోగపడేలా 7200 ఎంఏహెచ్, మీడియాటెక్‌ డైమెన్సిటీ టర్బో చిప్, సోనీ ఏఐ ఆధారిత 50 ఎంపీ కెమెరా, ముందు..వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్, 6.76 అంగుళాల డిస్‌ప్లే, రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని సంస్థ సీఈవో నిపుణ్‌ మార్యా తెలిపారు. నిర్దిష్ట ఎస్‌బీఐ, యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డులపై డిస్కౌంట్లు లభిస్తాయి. మేకిన్‌ ఇండియా నినాదానికి కట్టుబడి ఉంటూ గ్రేటర్‌ నోయిడాలోని వివో ప్లాంటులో వీటిని తయారు చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement