రియల్‌మీ కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ‘పవర్‌’ఫుల్‌ బ్యాటరీతో.. | Realme Launches Narzo Power 5G In India With 10001mAh Battery And 80W Fast Charging, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రియల్‌మీ కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ‘పవర్‌’ఫుల్‌ బ్యాటరీతో..

Mar 5 2026 5:37 PM | Updated on Mar 5 2026 5:56 PM

Realme launches Narzo Power 5G in India with 10001mAh battery

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో కొత్తగా రియల్‌మీ నార్జో పవర్‌ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఎక్కువసేపు వినియోగానికి ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినియోగం ఎక్కువగా చేసే వారికి ఈ డివైజ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

ధర, లభ్యత
రియల్‌మీ నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ ఒకటి కాగా మరొకటి 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్. అలాగే ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ప్రారంభ విక్రయంలో దీని ధర రూ.23,999 నుంచి మొదలవుతుంది.

మార్చి 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమెజాన్‌, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి కంపెనీ రూ.3,999 వరకు బండిల్ బెనిఫిట్లు అందిస్తోంది. అదనంగా 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఇస్తోంది.

ప్రధాన ఫీచర్లు

  • ఈ ఫోన్‌లోని 10,001mAh బ్యాటరీని సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించారు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు మాత్రమే ఉండేలా రూపొందించారు.

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: కేవలం 36 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

  • పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8GB ర్యామ్‌తో పాటు ప్రత్యేక AI ప్రాసెసింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో స్థిరమైన పనితీరును అందించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.

  • డిస్‌ప్లే విషయానికి వస్తే ఫోన్ ముందుభాగంలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో హైపర్‌గ్లో 4డీ కర్వ్‌+ అమోల్‌డ్‌ డిస్‌ప్లే అందించారు. ఇది 1.07 బిలియన్ రంగులను సపోర్ట్‌ చేస్తుంది. గరిష్టంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement