ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌: ధర ఎంతంటే? | Oppo Launches Reno 15c in India Know The Details | Sakshi
Sakshi News home page

ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌: ధర ఎంతంటే?

Feb 6 2026 4:56 PM | Updated on Feb 6 2026 5:12 PM

Oppo Launches Reno 15c in India Know The Details

స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో 15సీ ఫోన్‌ని ఆవిష్కరించింది. ట్రావెలర్లు, క్రియేటర్లు, ఫొటోగ్రఫీపై మక్కువ గల వారి కోసం దీన్ని తెచ్చినట్లు తెలిపింది. ఇందులో 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80వాట్స్‌ సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ చార్జింగ్, 6.57 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 ఎంపీ అల్ట్రా క్లియర్‌ మెయిన్‌ కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఒప్పో రెనో 15c ఫిబ్రవరి 5 నుంచి భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఆఫ్టర్‌గ్లో పింక్ & ట్విలైట్ బ్లూ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది. 8GB RAM & 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా.. 12GB RAM & 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్మకానికి ఉంది.

కెమెరాల విషయానికొస్తే.. రెనో 15c 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో 50MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ముందు & వెనుక కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement