అందుకే.. అమెజాన్ 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి! | Amazon To Invest 200 Billion Dollars In AI After Washington Post Layoffs | Sakshi
Sakshi News home page

అందుకే.. అమెజాన్ 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి!

Feb 6 2026 4:24 PM | Updated on Feb 6 2026 4:54 PM

Amazon To Invest 200 Billion Dollars In AI After Washington Post Layoffs

కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, కస్టమ్ చిప్స్, లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వంటి సాంకేతిక రంగాల్లో.. అమెజాన్ దాదాపు 200 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఖర్చు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 50 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని.. ది వాషింగ్టన్ పోస్ట్ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మందిని తొలగించాలని తన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా సంస్థ నాల్గవ త్రైమాసిక ఆదాయం 14 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఈ ఖర్చు ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కోసం ఉపయోగిస్తామని తెలిపారు. AWS అనేది సంస్థలు, ప్రభుత్వాలు, మొబైల్ యాప్స్‌కు క్లౌడ్ సేవలు అందించే విభాగం. ఇది సంస్థను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబడటానికి ఉపయోగపడుతుందని అన్నారు.

ఇదే సమయంలో, ది వాషింగ్టన్ పోస్ట్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పత్రిక మొత్తం ఉద్యోగుల్లో సుమారు 30 శాతం.. అంటే 300 మందికి పైగా జర్నలిస్టులను తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే ప్రకారం.. పత్రిక చాలాకాలంగా నష్టాల్లో నడుస్తోంది. అందుకే ఈ ఉద్యోగాల తొలగింపు తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు.

భవిష్యత్తులో పత్రిక జాతీయ వార్తలు, రాజకీయాలు, వ్యాపారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. కాగా క్రీడలు, పుస్తకాలు వంటి విభాగాలను పూర్తిగా మూసివేయనుంది.. రోజువారీ పాడ్‌కాస్ట్ 'పోస్ట్ రిపోర్ట్స్' కూడా నిలిపివేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement