టెక్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలక నుంది. ప్రధానంగా అమెరికాకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల నోటీసు పీరియడ్‌తో ఉద్యోగులను లేఆఫ్ చేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అమెజాన్ జనవరి 28న ప్రకటించింది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఏఐకి అప్‌డేట్ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతపై నిర్ణయం తీసుకుంది. ఈ కోతలకు ప్రభావితమైన ప్రతీ ఒక్కరికి సహకారం అందించేందుకు కృషి చేస్తామని Amazon పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి తెలిపారు. లేయర్‌లను తగ్గించడం, యాజమాన్యాన్ని పెంచడం, బ్యూరోక్రసీని తొలగించడం ద్వారా తమ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో భారీగా కోతలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇది కొత్త పద్ధతా అని అడగవచ్చు.. కానీ మా ప్లాన్ అదికాదు గాలెట్టి పేర్కొనడం విశేషం.
సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం 1.57 మిలియన్ల మందిని నియమించినప్పటికీ, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులలో పని చేస్తున్నారు. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 3 లక్షల 50వేల మంది సిబ్బంది ఉన్నారు, అంటే తాజా కోతల్లోవారిలో దాదాపు 4.6 శాతం మందిపై వేటుపడనుంది.
ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు


