సాధారణంగా పెద్దలు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి లెక్కేలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ.. చాలామంది భూములను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్వాప్నిల్ కొమ్మావర్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. ఒక విషయం వెల్లడించారు. 1990లో నా మామ ఏకంగా 15000 రూపాయల చొప్పున, నాలుగు ఎకరాలను రూ. 60వేలుతో కొన్నారు. క్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అది ఒక జిల్లా స్థాయికి చేరింది. రిటైల్ దిగ్గజం డీమార్ట్ రెండు ఎకరాలు భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. భూమిపై పెట్టే పెట్టుబడి ఎంత లాభదాయకంగా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారు
భూమిని అమ్మగా వచ్చిన డబ్బును నా మామ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టారు. ఇప్పుడు ప్రతి నెలలో రూ. 14.5 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. ఇంకా, ఆయన దగ్గర రెండు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రూ. 60,000 నుంచి రూ. 25 కోట్లకు ఎంత అద్భుతమైన ప్రయాణం! అని ఒకరు కామెంట్ చేయగా, అన్ని భూములకు ఒకే విలువ ఉంటుందని దీని అర్థం కాదు; ఇది ప్రాంతం మరియు అదృష్టంపై ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.
A true story from my hometown!
In 1990, my uncle bought 4 acres of land for 15,000 per acre.
Total investment: 60,000.
The town developed over the years. and now even a district.
Now, DMart bought 2 acres of that land from him for 25 crores.
He has now put the 25 crores in a…— Swapnil Kommawar (@KommawarSwapnil) March 12, 2026


