ఈ కారును జనం ఎగబడి కొనేస్తున్నారు! | Maruti Suzuki Dzire 3 Million Sales Milestone | Sakshi
Sakshi News home page

ఈ కారును జనం ఎగబడి కొనేస్తున్నారు!

Mar 14 2026 3:04 PM | Updated on Mar 14 2026 3:13 PM

Maruti Suzuki Dzire 3 Million Sales Milestone

భారతదేశంలో అత్యంత విజయవంతమైన, అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో ఒకటి మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 30 లక్షల సేల్స్ సాధించింది. అదే మారుతి సుజుకి డిజైర్.

2008లో మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోడల్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఒక్క 2025లోనే ఇది 2.14 లక్షల సేల్స్ సాధించి.. అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.

మారుతి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలలో LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం ఇప్పుడు కూడా ఎక్కువమంది ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement