మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాలమరణంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ తరుణంలో ఈ విషాదం మహారాష్ట్రకు తీరని లోటని ఎక్స్‌లో నివాళి అర్పించారు. అజిత్ పవార్ చాలా నిష్కపటమైన వ్యక్తి అని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం ఆయన నైజం కాదని థాకరే అన్నారు. అంతేకాదు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషాద సమయంలో తన కుటుంబం, పవార్ కుటుంబం దుఃఖంలో పాలుపంచుకుటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన తరపున అజిత్ పవార్‌కి హృదయపూర్వక నివాళులంటూ ట్వీట్ చేశారు. "నా స్నేహితుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. మహారాష్ట్ర రాజకీయాలు ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయాయి. అజిత్ పవార్, నేను దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా పరిచయం చాలాకాలం తర్వాత ఏర్పడింది. అపారమైన అభిరుచి, బలంతో, అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయ రంగంలో గొప్ప పురోగతి సాధించారు. ఆయన పవార్ సాహెబ్ స్ఫూర్తితోఎదిగిన నాయకుడైనప్పటికీ, తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుని,. మహారాష్ట్ర నలుమూలలా తనదైన ముద్ర వేసుకున్నారు’’ అని ట్వీట్ చేశారు.
"1990వ దశకంలో మహారాష్ట్రలో పట్టణీకరణ ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాలు పాక్షిక పట్టణీకరణ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి, అయినప్పటికీ అక్కడి రాజకీయాల తీరు గ్రామీణంగానే ఉంది, అయితే వారి సమస్యల స్వభావం కొంతవరకు పట్టణంగా మారడం ప్రారంభమైంది. ఈ రకమైన రాజకీయాలపై అజిత్ పవార్‌కు పూర్తి అవగాహన, నేర్పుగా నిర్వహించే నైపుణ్యం కూడా ఉంది. దీనికి పింప్రి చించ్వాడ్ , బారామతి దానికి రెండు అద్భుతమైన ఉదాహరణలు. అది పింప్రి చించ్వాడ్ అయినా లేదా బారామతి అయినా, అజిత్ దాదా ఈ ప్రాంతాలను తన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించే విధంగా మార్చారు అంటూ థాకరే ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
పరిపాలనపై అజిత్ పవార్‌కు కచ్చితమైన పట్టు ఉందని, నిలిచిపోయిన ఫైళ్లను ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసని ఎంఎన్ఎస్ అధినేత అన్నారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ యుగంలో, మహారాష్ట్ర అటువంటి నాయకుడిని కోల్పోవడం అత్యంత విషాదకరం అని ఆయన నివాళి అర్పించారు. ఆయన కల్మషం లేని వ్యక్తి. ఆయనలో కుల పక్షపాతం ఏమాత్రం లేదు, ఆయన రాజకీయాల్లో కులానికి అస్సలు చోటు లేదు. నేటి రాజకీయాల్లో, కులంతో సంబంధం లేకుండా వ్యవహరించే ధైర్యం చూపే నాయకులు తగ్గిపోతున్న తరుణంలో నిస్సందేహంగా అజిత్ పవార్ వారిలో అగ్రగామిగా ఉన్నారు. రాజకీయాల్లో నిష్కపటత్వానికి, నిజాయితీకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో విరోధం అనేది రాజకీయపరమైందే త ప్ప వ్యక్తిగతమైనది కాదు. అందుకే మహారాష్ట్రలో ఒకరిపై ఒకరు చేసుకునే తీవ్ర విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకునే నాయకులు తగ్గిపోతున్నారు. ఉదార స్వభావం గల ప్రత్యర్థులు రాజకీయాల నుండి వరుసగా వైదొలగడం మహారాష్ట్ర ఉన్నత రాజకీయ సంప్రదాయానికి తీరని లోటనిపేర్కొన్నారు.
ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్‌గా ఆ ఇద్దరు పైలట్లు
78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!


