ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.
మీనమాస పూజల షెడ్యూల్
నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.
నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).
శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026
వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.
మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)
మార్చి 24: ఉత్సవ బలి
మార్చి 31: పళ్ళివేట (రాజవేట)
ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.
ముగింపు: ఏప్రిల్ 1, 2026.
ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.
(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి)


