ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపడుతుంది. అక్కడున్న వారిని వెంటనే వేరే ప్రాంతాల తరలించింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా తరుచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ ఫేక్‌వా లేక నిజంగానే బాంబు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.


