breaking news
Assembly
-
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ... డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ భావజాలం, ఆలోచన స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ఈ రోజు మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఇది స్పీకర్‌కు కాదు సభకు జరిగిన అవమానం అని తెలిపారు. తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభ తీర్మానించిందన్నారు.యావత్ చట్టసభనే బీఆర్ఎస్ సభ్యులు అవమానించారు. సభాపతిని అంటే సభ మెుత్తాన్ని అన్నట్లే దళిత వర్గాల్లో పుట్టి ఎదిగి వచ్చిన వ్యక్తి స్పీకర్ గడ్డం ప్రసాద్ అని తెలిపారు. ఫ్యూడల్ విధానం మీద పోరాడిన చరిత్ర ఈ సభకు ఉందన్నారు. ఫ్యూడల్ భావజాలం నుంచి పుట్టిందే బీఆర్ఎస్ అని ప్రస్తుతం ఫాంహౌజ్ కుట్ర నడుస్తోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలకు మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భట్టివిక్రమార్క బలపరిచారు. తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌కు పంపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి
-
ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..
-
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ రాజు ఆసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కూప్పకూలారు. తక్షణమే స్పందించిన మంత్రి శ్రీహరి.. ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు మరణించారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
-
మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
-
కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్
-
నేను స్పీకర్‌ను ఏం అనలేదు తాతా మధు రియాక్షన్
-
అసెంబ్లీ ఘటన తర్వాత తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు
-
అసెంబ్లీ వద్ద హైటెన్షన్.. సబితా ఇంద్రారెడ్డిని మెడ పట్టి తోసేసిన పోలీసులు
-
అసెంబ్లీ వద్ద రచ్చ రచ్చ.. కేటీఆర్, హరీష్ రావు ను ఈడ్చుకెళ్ళిన పోలీసులు
-
Watch Live: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్ కు గాయాలు
-
సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై తొలి రోజు సమావేశం తర్వాత జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు. ఈ వర్షాకాల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
శాసన మండలిలో ‘మెగా’ ప్రతిష్టంభన!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలపై చర్చించాలని విపక్షం పట్టుబట్టడంతో శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియమకాలలో అవకతవకలపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణిలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ చైర్మన్ పోడియం ముందుకు చేరుకొని ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీలో మెగా డీఎస్సీపై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక దానిపై చర్చకు వీలు కాదంటూ శాసనమండలి చైర్మన్ మోషన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించడంతో చైర్మన్ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యల ఆందోళన మధ్యే ఐదు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఉదయం సభ ప్రారంభమైన 27 నిమిషాలకే పదిన్నర గంటల సమయంలో వాయిదా పడింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పునఃప్రారంభమైన వెంటనే తిరిగి బుధవారానికి వాయిదా పడింది. రైతులపై ప్రేమ అసెంబ్లీలో ఏమైంది?: బొత్సమరోవైపు.. మండలిలో ప్రతిపక్ష నేత బొత్య సత్యనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. ‘మెగా డీఎస్సీపై, దాంట్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగాలని, విచారణ జరపాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. చర్చకు రెడీ అంటూ అన్ని చోట్లా మాట్లాడుతున్నారు. మరి శాసన మండలిలో మేం అడుగుతున్నాం కదా..? సమాధానం చెప్పండి..’ అంటూ ప్రభుత్వాన్ని బొత్స నిలదీశారు. దీనిపై మంత్రి కేశవ్ స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్సీపీకి ప్రజల అజెండా పట్టదని ఆరోపించారు. దీనికి బొత్స తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘అసెంబ్లీలో ముందుగా డీఎస్సీపై చర్చించాకే కరువుపై చర్చించారు కదా? మరి రైతులపై ఈ ప్రేమ అక్కడ ఏమైంది? ఇక్కడే వచ్చిందా?’ అంటూ నిలదీశారు. వ్యవసాయం– కరువుపై చర్చించాలని అడిగింది కూడా వైఎస్సార్సీపీనే అని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎప్పుడూ లేని వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ అంశంపై కూడా చర్చ జరగాలి. కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వ్యవసాయం – కరువు పరిస్థితులపై చర్చించేందుకు మరో రెండు రోజుల పాటు సమావేశాలు పొడిగించవచ్చు కదా?’ అని బొత్స ప్రశ్నించారు. సమావేశాలను పొడిగించండి.. రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చిద్దామంటూ డిమాండ్ చేశారు. ఈ సమయంలో చైర్మన్ జోక్యం చేసుకుంటూ దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ సూచించారు. బొత్స, మంత్రి పయ్యావుల సంవాదం కొనసాగుతున్న సమయంలో సభ ఉదయం పదిన్నర గంటల సమయంలో తాత్కాలికంగా వాయిదా పడింది.డీఎస్సీ పేరెత్తితే ప్రభుత్వం పారిపోతోంది⇒ మండలిలో విపక్ష నేత బొత్స ధ్వజం⇒ మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరపాలి ⇒ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి ⇒ డీఎస్సీ అక్రమాలపై మండలిలో పూర్తిస్థాయిలో చర్చించాల్సిందే ⇒ అప్పటిదాకా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందిసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ పట్టుబడితే ప్రభుత్వం రెండో రోజు కూడా భయపడి పారిపోయిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు దాటవేత ధోరణిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని పత్రికల్లో గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో పూర్తిస్థాయిలో చర్చ జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో డీఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 3 శాతం ఉద్యోగాలిస్తూ ఇచి్చన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్లో గానీ అసెంబ్లీలో గానీ పెట్టారా? అని నిలదీశారు. మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇలాంటి చర్యలతో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. తప్పు జరిగిందని మీరే ఒప్పుకున్నారు..! మెగా డీఎస్సీలో పేపర్ లీకేజీ జరగకపోతే ప్రభుత్వం ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని బొత్స ప్రశ్నించారు. టీచర్ ఉద్యోగాల కోసం సెల్ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైనా వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై పక్కా ఆధారాలతో తాము నిలదీస్తున్నా.. ప్రభుత్వం శాసనసభలో ఏవో మాటలు చెప్పడం మినహా మండలిలో సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న వారు దానిపై సీబీఐ విచారణ వేసుకోవచ్చని.. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సవాల్ విసిరారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ డీఎస్సీపై మాట్లాడారు. ఎలాంటి తప్పు జరగకపోతే విచారణకు సిద్ధమని ఎందుకు అనడం లేదు? డీఎస్సీలో తప్పులు జరిగినట్లు అసెంబ్లీలోనే నారా లోకేశ్ ఇన్ డైరెక్ట్‌గా ఒప్పుకున్నారు. డీఎస్సీ మార్కులు తాము కన్సిడర్లోకి తీసుకోవడం లేదని లోకేశ్ ప్రకటించారు. పీవీ సింధుకు ఉద్యోగం విషయంలో లోకేష్ చెప్పింది తప్పు. ఆమె అంతర్జాతీయ క్రీడాకారిణి. ఆమె ఒక్కరికే ఉద్యోగం వచి్చంది. మీకు లాగా అందరికీ ఒకే మాదిరిగా ఇవ్వలేదు. వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో ఆనాడు వైఎస్సార్ నా శాఖ మార్చి సీబీఐ విచారణ చేయించారు’ అని బొత్స పేర్కొన్నారు.రైతు సమస్యలపై చిత్తశుద్ధి కరువురాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఏసీలో చర్చించాలని, అవసరమైతే అసెంబ్లీని మరో రెండు మూడు రోజులు పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ‘రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని కోరిందే మేం. ఈ రోజు సభకు వ్యవసాయ మంత్రి రాలేదు. కానీ దీనిపై చర్చ మాత్రం చేస్తామంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కరువు తాండవిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చారు.. ఎల్‌నినో వచ్చింది’ అని బొత్స వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలోకి సీఎం వస్తే లేచి నిలబడాలా?
సాక్షి, చెన్నై: శాసనసభలోకి సీఎం వచ్చినప్పుడు సభ్యులు గౌరవార్థం లేచి నిలబడటం తప్పనిసరా..? అనే అంశంపై అసెంబ్లీలో కాసేపు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పందిస్తూ... సీఎం సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడటం నిర్బంధం ఏమీ కాదన్నారు. అది వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సభ్యుల హక్కుకు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. సభలో దేవాదాయ శాఖమంత్రి రమేష్ మాట్లాడుతూ, సీఎం విజయ్ సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించే మర్యాదను ప్రతిపక్ష నాయకుడికి , మాజీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం నేర్పించాల్సి ఉందని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇందుకు పన్నీరుసెల్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.పన్నీర్‌సెల్వం సమాధానం ఇస్తూ స్పీకర్ సభలోకి వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరూ లేచి నిలబడటం కాలక్రమేణా వస్తున్న సాంప్రదాయం అని గుర్తు చేశారు. అయితే, సీఎం నేరుగా తమ స్థానానికి వెళ్లి నమస్కరించి కూర్చోవడం అనవాయితీగా వస్తున్నదన్నారు. తాజా సీఎం విజయ్ సభలోకి వస్తూ అటు... ఇటు ఇరువైపులా తిరిగి నమస్కరిస్తూ వెళ్తున్నారని, ఇది కొత్తగా ఉందన్నారు.. ఒకవేళ సీఎం కోసం లేచి నిలబడాలనే నిబంధనే ఉంటే, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కూడా నిలబడాలా? అని ప్రశ్నించారు. స్పీకర్ వివరణ.. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ సమాధానమిస్తూ.. సీఎంగానీ, ప్రతి పక్ష నాయకుడు గానీ సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ సభ అత్యున్నత సాంప్రదాయం ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. తమిళుల సంస్కృతి ప్రకారం అలా గౌరవం ఇవ్వడం మంచి పరిణామమేనని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలా వద్దా అనేది సభ్యుల ఇష్టానికే వదిలేస్తున్నానని వివరించారు. 100 రోజుల పాలనపై స్పీకర్ ప్రశంసలు ముందుగా అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. లౌకిక, సామాజిక న్యాయాన్ని కాపాడే సీఎం విజయ్ పాలనలో ఈ 100 రోజులు కేవలం క్యాలెండర్ రోజులు కావు అని, తమిళనాడు చరిత్రలో ఒక చారిత్రక మార్పు అని వ్యాఖ్యలు చేశారు. -
దద్దమ్మ.. ఎద్దులా పెరిగితే సరిపోదు... అచ్చెన్నాయుడుపై బొత్స ఫైర్
-
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి! ABVP పై పోలీసుల లాఠీచార్జ్
-
క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్!
కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం
చెన్నై: విజయ్ ప్రభుత్వం కీలక చట్టం చేసింది. అసెంబ్లీతో పాటు ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాలలోనైనా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను తప్పనిసరిగా ముందుగా ఆలపించాలని నిబంధనలు చేస్తూ చట్టం చేసింది. ఈ తీర్మానాన్ని డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు ఇతర పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇటీవలే వందేమాతరంపై ప్రత్యేక చట్టం తీసుకవచ్చిన నేపథ్యంలో ఈ చట్టం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశమై తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ తీర్మానం ఆమోదించబడిందని తెలిపారు. దీని అమలుకు ఇక ఎలాంటి అదనపు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రకారం విద్యాసంస్థలు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి అనేక చోట్ల జరిగే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళ్ తాయ్ వాజ్త్తును మొదటగా ఆలపించాలి.సీఎం విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ గీతానికే తొలి ప్రాధాన్యత ఉండాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా హక్కులు, సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లబోదన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఉద్వేగభరితంగా ప్రసంగించిస్తూ " తమిళం ఒక భాష మాత్రమే కాదు.. మా జీవనాడి మా భావోద్వేగం. మాతృభాష ఎంత పవిత్రమో, తల్లి ఎంత పవిత్రమో తమిళం కూడా అంతే పవిత్రమైనది తమిళం అంటే గర్వం. తమిళం అంటే శక్తి. ‘తమిళం’ అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటై నిలబడుతుంది. తమిళ్ తాయ్ వాజ్తుకు తమిళనాడులో మొదటి స్థానం ఉండాలి. తమిళ్ తాయ్ వాజ్తుకు తొలి స్థానం ఇవ్వడం మా హక్కు” అని విజయ్ పేర్కొన్నారు.కాగా ఇటీవల తమిళ రాష్ట్ర గీతం అధికారిక కార్యక్రమాల్లో చివరగా పాడడంతో వివాదం చెలరేగింది. ఈ ఏడాది మేలో ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతం, ఆ తర్వాత జాతీయ జాతీయ గీతం ఆలపించి, చివరగా తమిళ్ తాయ్ వాజ్తును ఆలపించారు. దీంతో వివాదం చెలరేగింది.అనంతరం కొన్ని వారాల తర్వాత విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా తమిళ్ తాయ్ వాజ్తు మూడో స్థానానికి వెళ్లింది. దీంతో దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. దీనిపై గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖఅధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాజ్తును మొదటగా, జాతీయ గీతాన్ని కార్యక్రమం చివరలో ఆలపించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు గవర్నర్‌ను కోరారు.ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ తమిళ్ తాయ్ వాజ్త్తుకు రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పొలిటికల్ హీట్‌గా మారింది. -
జార్ఖండ్: అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్లు..
రాంచీ: ఝార్ఖండ్‌లో నియామక పరీక్షల అక్రమాలను నిరసిస్తూ సోమవారం వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర శాసనసభ ముట్టడికి యత్నించారు. పురాతన అసెంబ్లీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను జగన్నాథ ఆలయం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. నిరసనకారులను నియంత్రించడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం దిగివచ్చి, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు 2023, 2025లో నిర్వహించిన బ్యాక్లాగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌పై విద్యార్థులు పట్టువీడలేదు.ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై జరుగుతున్న నిరసనల నడుమ సోమవారం రాంచీలో హైడ్రామా చోటుచేసుకుంది. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఆదిత్య సాహు, బాబూలాల్ మరాండీతో సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆందోళనకారులు శాంతియుతంగా అసెంబ్లీని ముట్టడించేందుకు (ఘెరావ్) అసెంబ్లీ వైపు మార్చ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి జార్ఖండ్ అసెంబ్లీ వైపు సాగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, రాజ్యాద్ధబద్ధంగా ఈ మార్చ్ కొనసాగుతుందని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జార్ఖండ్ పోలీసులు నిషేధాజ్ఞలు (ప్రొహిబిటరీ ఆర్డర్లు) జారీ చేయడంతో పాటు, నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనలో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి హింసాత్మక ప్రదర్శనలకు పాల్పడవద్దని రాంచీ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. #WATCH | Ranchi, Jharkhand: BJP leaders, protesting outside the CM residence, detained by the Police. They are protesting over JPSC-JSSC alleged irregularities. pic.twitter.com/ziejwSNz4z— ANI (@ANI) August 10, 2026జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, సోమవారం రాంచీలో రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని, ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరిగినందున సీబీఐ విచారణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. VIDEO | Ranchi, Jharkhand: Protesters leave Jaipal Singh Munda Stadium to march towards the 'Vidhan Sabha'.'Vidhan Sabha March' has been called by students who have been protesting for over two weeks against alleged irregularities in recruitment examinations in the state.… pic.twitter.com/gl3vyXt6Uf— Press Trust of India (@PTI_News) August 10, 2026విద్యాద్ధుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యార్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నిరసనల్లో భాగంగా ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహ్తో, సోమవారం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.మరోవైపు, ఈ నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీఐడీ వీరిని విచారణకు పిలవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసెంబ్లీ పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, రాంచీ వ్యాప్తంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య పట్టువీడని ధోరణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఒక రోజు అసెంబ్లీ !
సాక్షి, హైదరాబాద్: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక రోజుకు మాత్రమే పరిమితం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వర్షాకాల సమావేశాల్లో చట్టసభల్లోకి అడుగిడే యువత వయసు ప్రస్తుతం ఉన్న 25 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ అనంతరం ఆమోదించిన తరువాత వాయిదా పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. ఈ సమావేశాలను ఆగస్టు మొదటి వారంలోనే నిర్వహించే అవకాశం ఉందన్నాయి. తీర్మానం ఆమోదించిన వెంటనే దాన్ని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సమయంలోనూ వయసు తగ్గింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సంగతి విదితమే. ప్రస్తుతానికి ఒక్కరోజునే సమావేశాలు ఏర్పాటు చేసి, శీతాకాల సమావేశాల సమయంలో ఎక్కువ రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల తరువాత అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడం వల్ల.. నేరుగా స్పీకర్ అసెంబ్లీని సమావేశపర్చడానికి అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అదీకాక అసెంబ్లీలో ప్రస్తుతం మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి.సెంట్రల్ హాల్ ఏర్పాటు, కిందనున్న మంత్రుల చాంబర్స్‌ను పైకి మార్చడం, సీఎం చాంబర్‌కు మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. కింద సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రి చాంబర్లు మాత్రమే ఉంటాయి. మిగిలిన మంత్రుల చాంబర్లను మొదటి అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ మరమ్మతులన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సీఎల్పీ కార్యాలయం స్థానంలో పూర్తి గ్రీనరీని ఏర్పాటు చేయాలని మొదట్లో భావించారు. ప్రస్తుతం దాని మార్పు గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు. -
సీఎం విజయ్ తొలి స్పీచ్ దద్దరిల్లిన అసెంబ్లీ..
-
నీట్‌పై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు
చైన్నై: నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా నీట్ ఒక్కటే అర్హత పరీక్షగా ఉందని తద్వారా అది అనేక వివాదాలకు మూలంగా నిలిచిందన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. విజయ్ సీఎం హోదాలో తొలిసారిగా ఈ రోజు (మంగళవారం) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ" గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష అనేక వివాదాలకు మూలంగా ఉంది. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుకొని, దేశంలో వైద్య విద్య విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రశ్నపత్రాలు లీకవడం వరకు ఈ వివాదం కొనసాగింది. ఈ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలని తమిళనాడు పదేపదే పిలుపునిచ్చింది". అని అన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న రెండు భాషల విధానం, అంటే తమిళం (రాష్ట్ర భాషగా), ఇంగ్లీష్ (ప్రపంచ భాషగా) సరిపోతుందని నొక్కి చెప్పారు.కరూర్ తొక్కిసలాటకరూర్ తొక్కిసలాటపై ఆయన మాట్లాడుతూ "41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం గురించి నా బాధను నేను మాటల్లో చెప్పలేను. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ ఆ నిందను కూడా మాపై వేస్తున్నారు. ఇది దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విజయంపై విజయ్ ప్రసంగిస్తూ " ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలను, ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని తెలిపారు.తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడిన కష్టాలు మాకు మాత్రమే తెలుసు… కానీ ఇదంతా తెలిసినప్పటికీ, కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, పార్టీ కూడా నటుల పార్టీనే అని ఎగతాలిగా మమ్మల్ని విమర్శిస్తారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను అధిగమించి విజయం సాధించాం. " అని విజయ్ అన్నారు.డీఎంకే అవినీతిఇది వరకూ ప్రభుత్వం డీఎంకేలా తాము అవినీతి చేయబోమని పార్టీ ఫండ్స్ కోసం టాస్మాక్ ఆదాయాన్ని డీఎంకే లూటీ చేసిందని ఆరోపించారు. ద్విబాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.కాగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కొద్ది రోజల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచిన మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా సీఎం హోదాలో ప్రసంగించారు. -
ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయితీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు.బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయితీకి 4 వారాల గడువు ఇచ్చిన పవన్.. చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్ చేసుకోవాలని బాలరాజును ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు ఉన్నాయి. పవన్ ఫ్యామిలీ సెటిల్మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా సంచలనంగా మారింది. -
అసెంబ్లీ లో అన్నాడీఏంకే హైడ్రామా
-
నేడే సీఎం విజయ్ బల పరీక్ష
-
ఎమ్మెల్యేగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం
-
అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన విజయ్
-
వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?
-
అర్హతలేని వ్యక్తికి అందలమా!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన వ్యవస్థలో అర్హతలేకుండా అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వోద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. సెక్షన్ ఆఫీసర్ (ఎస్వో) కంటే తక్కువ కేడర్ వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో అత్యున్నత పదవిని కట్టబెట్టడమే కాక ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్థాయి హోదాను కల్పించడం చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన ప్రసన్నకుమార్‌ను ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా తప్పుడు పద్ధతిలో నియమించారని చెప్పారు. కాకర్ల ఏమన్నారంటే..2024 ఆగస్టులో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అందులో ప్రసన్నకుమార్ సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్‌గా పేర్కొంది. కానీ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా ప్రసన్నకుమార్ నియామకం చెల్లదని అన్ని మీడియాల్లో వచ్చింది. సుప్రీంకోర్టు అతని డెçప్యుటేషన్ నియామకాన్ని రద్దుచేసి ఆయన మాతృసంస్థ ప్రసార భారతికి తిరిగి పంపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.చట్టసభల్లో పనిచేసిన అనుభవమే లేదు..లోక్‌సభ/రాజ్యసభలో లేదా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన వారిని మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించాలి. కానీ, ప్రసన్నకుమార్‌కు ఎక్కడా ఈ అనుభవంలేదు. మరి అలాంటి వ్యక్తిని ఎలా నియమించారు? కనీసం విద్యార్హతలైనా ప్రభుత్వం చూసిందా? అసెంబ్లీ సర్వీసు నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ఉప కార్యదర్శి, ఆపై పోస్టుల్లో వ్యక్తులు తప్పనిసరిగా న్యాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రసన్నకుమార్‌కు ఆ అర్హత ఉందో లేదో ఎవరికీ తెలీదు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాటవేశారు. ప్రసన్నకుమార్‌కు చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పోస్టు కట్టబెట్టి అసెంబ్లీ శాశ్వత ఉద్యోగులను నిలువునా ముంచేసింది. వాస్తవానికి.. ప్రసన్నకుమార్ ప్రసార భారతిలో న్యూస్ రీడర్–ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే పనిచేశారు. ఇది రాష్ట్ర అసెంబ్లీలో సెక్షన్ ఆఫీసర్ కంటే కిందస్థాయి పోస్టు. ఇక సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు అడిగితే.. మీరు సరిగ్గా పనిచేయరు, నేను బయటి వ్యక్తులను తెచ్చుకుని పనిచేసుకుంటానని ప్రసన్నకుమార్ బెదిరిస్తున్నారు. దుర్బుద్ధితో ప్రసన్నకుమార్ నాటకం..ప్రస్తుతం అసెంబ్లీ సీనియర్ ఉద్యోగుల్లో జాయింట్ డైరెక్టర్ విజయరాజు పదోన్నతులకు ముందువరుసలో ఉన్నారు. ఆయనకు పదోన్నతి లభిస్తే అడిషనల్ సెక్రటరీ, ఆ తర్వాత సెక్రటరీ హోదా వస్తుంది. కానీ, తప్పుడు ఆరోపణలతో విజయరాజును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సర్వీసులోకి తీసుకున్న సమయంలో ప్రభుత్వం ‘పెండింగ్ ఎంక్వైరీ’ వేసింది. కానీ, ఏడాది నుంచి విచారణ కమిటీని నియమించకుండా.. తప్పు జరిగిందో లేదో తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. విచారణ జరిపితే విజయరాజు తప్పులేదని తేలడమే కాక అప్పుడు ఆయనకు పదోన్నతి కల్పించాల్సి వస్తుంది. ఇదే జరిగితే తన పోస్టును కోల్పోతాననే దుర్బుద్ధితో ప్రసన్నకుమార్ నాటకం అడుతున్నారన్నారు. -
TG: తల్లిదండ్రుల చట్టానికి ఆమోదం
సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. ‘తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15శాతం కోసం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టాన్ని రూపొందించామని తెలిపారు. పిల్లల్ని కనగలం..వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చింది. భక్తితో లేదా భయంతో తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నదే మా ఆలోచన. ప్రేమలు పంచాల్సి చోట చట్టం తేవడం బాధగా ఉంది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రతి కుమారికి బుద్ధి చెప్పే చట్టం ఇది. ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారులను సామాజిక బహిష్కరణ చేయాలి’అని సూచించారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెన్షన్ చేశారు. కేటీఆర్,హరీష్‌రావు, కృష్ణారావు, మహిపాల్‌రెడ్డి పద్మారావు, చింతా ప్రభాకర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను సస్పెండ్ చేశారు. బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ చర్యలు చేపట్టారు.ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్ వ్యవహారం..తెలంగాణ అసెంబ్లీని కౌశిక్‌రెడ్డి వ్యవహారం కుదిపేసింది. సభలో కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు చేశారు. కౌశిక్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తుందా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యే పట్ల కౌశిక్ ప్రవర్తన సరికాదని.. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.కడియం శ్రీహరి నిబద్ధత, నిజాయితీ ని ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించలేరు. కడియం శ్రీహరి అవినీతి మచ్చలేని నేత. కడియం శ్రీహరి విషయంలో మీ సభ్యులు వ్యవహరించిన తీరును కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తున్నారా?. కడియం శ్రీహరికి జరిగినట్లే రేపు కేసీఆర్‌కు జరిగితే సమర్థిస్తారా?. సభకు కుస్తీల పోటీకి రాలేదు. సభలో కూర్చింటే బిఆర్ఎస్ సభ్యులను కొనసాగించండి. లేదంటే ఈ రెండు రోజులు సస్పెండ్ చేయండి. కౌశిక్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని స్పీకర్‌ను రేవంత్‌రెడ్డి కోరారు. -
హరీష్‌రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని.. మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు, వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్‌ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది. నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్‌రావు తమ్ముడు మహేశ్ రావు.. ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.కాగా, సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్‌పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్‌బాబు అన్నారు.అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. -
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన నెలకొంది. సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు.బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్‌పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్‌బాబు అన్నారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. -
తప్పతాగిన వ్యక్తిలా నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు
సాక్షి, అమరావతి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తప్పతాగిన వ్యక్తిలా రెచ్చిపోయారు. సభలో లేని వారిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సభకు రాకుండా బయట బ్రోకర్లతో మాట్లాడిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు శనివారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం అవసరమని 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ బేషరతుగా టీడీపీకి మద్దతిచ్చారని, ఆయన మద్దతుతోనే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అయితే 2019లో ప్రజలు తప్పు చేశారని చెప్పారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ పోయినా, దానికి మించిన రాజ«దాని నిరి్మంచుకోవచ్చంటూ ఒక శిల్పిలా చంద్రబాబు కష్టపడి పని చేస్తుంటే.. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. ఇలా అనకూడదంటూనే పత్రికల్లో రాయలేని పదజాలంతో వైఎస్ జగన్‌ను దూషిస్తూ నోరు పారేసుకున్నారు. నాడు మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ప్రవేశ పెట్టినప్పుడు గ్యాలరీలో కూర్చున్న నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అన్న మాటలు విని.. తన చేతిలో గన్ ఉంటే అందర్నీ కాల్చేయాలనిపించిందని వ్యాఖ్యానించారు. ‘ఈ రోజు శాసన మండలి ఎందుకు పెట్టడంలేదని అడుగుతున్నారు. బుద్ది, జ్ఞానం ఉందా? తీర్మానం శాసనసభలో చేస్తారు. మండలిలో చేయరు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మండలిలోకి వెళ్తే అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఏదో ఒక సందర్భంలో మళ్లీ అధికారంలోకి వస్తారు. అందుకే రాజధానిని మార్చకుండా చట్టబద్ధం చేస్తున్నాం. ఎవరు వచి్చనా అమరావతిని మార్చడానికి వీల్లేని విధంగా పటిష్ట విధానం తీసుకొస్తున్నాం. తొలుత రాజధాని విజయవాడ–గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పాం. తర్వాత అమరావతి అనుకున్నాం. ఈ పేరు లేదు కాబట్టి ఈ ఇబ్బందులు. అందుకే ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం’అని చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన కొన్ని మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. -
రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఖమేనీ హత్యను ఖండిస్తూ విపక్షాల నిరసన
-
బీసీలను నమ్మించి మోసగించొద్దు
సాక్షి, హైదరాబాద్: బీసీలను నమ్మించి మోసగించొద్దని, 42శాతం రిజర్వేషన్ సహా అన్ని హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీలో బీసీ పద్దుపై చర్చలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారని, హామీ అమలు బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. కులగణన పారదర్శకంగా జరపలేదని, భూసాని కమిషన్ రిపోర్ట్ నేటి వరకు పబ్లిక్ డొమెన్లో పెట్టలేదని తలసాని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేస్తే ఆ పార్టీ అగ్ర నాయకత్వం హాజరు కాలేదని చెప్పారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం ఆల్ పార్టీ ప్రతినిధులను ఢిల్లీ తీసుకెళ్లలేదన్నారు. 42 శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెబుతున్నారని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్ ఎందుకు పెట్టలేదని, మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బీసీలకు బడ్జెట్లో సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైందన్నారు. కీలక పోస్టులలో బీసీలను తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. తలసాని మాట్లాడుతుండగా..మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి కలుగజేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు ఎంతో ప్రాధాన్యం ఉందని, జాతీయ స్థాయిలో బీసీల అంశాన్ని మాట్లాడిన నాయకుడు రాహుల్‌గాంధీ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలని మల్లికార్జున ఖర్గే, రా హుల్గాం«దీలు తమ వైఖరిని ఇప్పటికే స్ప ష్టం చేశారని, వారిచ్చిన మనోధైర్యంతోనే తాము చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ధీమాగా మాట్లాడుతున్నామన్నారు. రిజర్వేషన్ల సాధనలో అంతా కలిసి రావాలని కోరారు. హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తున్నారు : వివేకానంద రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తోందని, ఉన్న వారికి ఒక న్యాయం..పేదవారికి ఒక న్యాయం అన్నట్టుగా హైడ్రా పనితీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. హైడ్రా కమిషనర్ ప్రజాప్రతినిధుల ఫోన్లు సైతం మాట్లాడడం లేదని, మంత్రులను కలవొచ్చు కానీ, హైడ్రా అధికారిని కలిసే పరిస్థితి లేదన్నారు. ఎంఏయూడీ పద్దులపై చర్చలో వివేకానంద మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు జోన్లు శాస్త్రీయంగా లేవని, భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం ఇన్సైడ్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ దందా కోసమేనని ఆరోపించారు. ఇదే పద్దుపై చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగర అస్థిత్వానికి వెన్నెముకగా కాంగ్రెస్ పార్టీ విధానాలు నిలిచాయన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లు నమోదయ్యాయని చెప్పారు. నగర అభివృద్ధి, మూసీ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితోనే ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ చేశారన్నారు. హైదరాబాద్, తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌గా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పపువ్వు సారా మంచిదే గానీ.. ఇందిరమ్మ పేరు పెట్టకండంటూ రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. రాకేష్రెడ్డివ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రూల్స్ ప్రకారమే సభ నడవాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్,బీజేపీ ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చర్చను పక్కదారి పట్టించడం సరైన పద్దతి కాదన్నారు. ఒక్క విషయాన్ని పట్టుకుని గంట సమయం వృథా చేయడం సరికాదన్నారు. రాకేష్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న స్పీకర్.. కొత్త సభ్యులు పొరపాటు చేస్తే ఫ్లోర్ లీడర్ సరిచేయాలని సూచించారు.తానేం తప్పు మాట్లాడలేదన్న రాకేష్‌రెడ్డి.. ప్రతి స్కీమ్‌కు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు.. ఈ స్కీమ్‌కు ఆమె పేరు పెట్టొద్దని చెప్పానంటూ రాకేష్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే హౌస్ కమిటీ వేయండి.. ఇందిరమ్మపై తప్పుగా ప్రచారం చేస్తుంటే తానూ మాత్రమే ఖండించానని రాకేష్‌రెడ్డి అన్నారు. ఇప్పపువ్వు సారా ఫ్యాక్టరీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని చెప్పడం తప్పేమీ కాదంటూ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందిరమ్మ పేరు ఎందుకు తెచ్చారో రాకేష్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేని మంత్రి సీతక్క అన్నారు. -
ఏపీలో పెరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు..
-
Delhi : ‘అసెంబ్లీ,మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తాం’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ స్పీకర్ విజేందర్ గుప్తకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజేందర్ గుప్తా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్‌తో అణువణువూ గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులు తొలిసారి మంగళవారం ఉదయం 7.28గంటల సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్స్‌కు వచ్చింది. 21 నిమిషాల వ్యవధిలో సరిగ్గా ఉదయం 7.49 గంటలకు అసెంబ్లీ స్పీకర్‌కు మరో మెయిల్ వచ్చింది. ఖలిస్తానీ వేర్పాటు వాదుల పేరిట వచ్చినట్లు అనుమానిస్తున్న ఆ ఈమెయిల్స్‌లో మధ్యాహ్నం 1.11గంటలకు ఢిల్లీ అసెంబ్లీ, సాయంత్రం 9.11గంటలకు ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చివేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ,మెట్రో స్టేషన్‌తో పాటు అగంతకులు ప్రస్తావించిన ఇతర ప్రాంతాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు -
బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’పార్టీ నాయకులు–పోలీసుల మధ్య తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కళ్లు కప్పి ఆటోలో అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఇతర నేతలు నిరసన తెలిపారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు నకు కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘6 గ్యారంటీలు ఎక్కడ’అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమీపానికి చేరుకొని బారికేడ్లు దాటేందుకు యతి్నంచిన కార్యకర్తలను పోలీసులు అడ్డు కున్నారు. వివిధ జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకొని ముట్టడించే ప్రయత్నం చేశారు. అనంతరం రాంచందర్‌రావు తదితరులను అరెస్ట్ చేసి పంజగుట్ట స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను సాయంత్రం విడుదల చేశారు.ఆ తర్వాత కూడా ఐదు, పది మంది చొప్పున కొన్ని బ్యాచ్‌ల వారీగా ఆటోలు, క్యాబ్‌లు, ఇతర రూపాల్లో శాసనసభ సమీ పానికి చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.800 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, 50 మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ ప్రాంతా ల్లోని 9 పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. పలువురు నేతలను వారి ఇళ్ల వద్ద, అసెంబ్లీకి మార్గమధ్యలో హౌస్ అరెస్ట్‌లు చేసి పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, దాదాపు రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చింది.శాసనసభ ముట్టడికి సంబంధించి పోలీసులకు ముందస్తు సమాచారంతో చుట్టుపక్కల పెద్దసంఖ్యలో మోహరించారు. సోమ వారం ఉదయం 11 గంటల నుంచి పలు దఫాలుగా బ్యాచ్లుబ్యాచ్లుగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డా.ఎన్.గౌతమ్‌రావు, టి. వీరేందర్‌గౌడ్, బండ కార్తీకరెడ్డి, శిల్పారెడ్డి, ఎన్వీ సుభాశ్, దీపక్‌రెడ్డి, గణేశ్, మహేందర్ ఉన్నారు. రాంచందర్‌రావును పోలీస్‌స్టేషన్ లో ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, డా.సి.అంజిరెడ్డి, మల్క కొమరయ్య పరామర్శించారు.మోసపూరిత హామీల సర్కార్‌ను మరింత నిలదీస్తాం: రాంచందర్‌రావు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత నిలదీస్తామన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం: ఏలేటి కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందే తప్ప మడమ తిప్పదని బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించిన రాంచందర్‌రావు అరెస్టు.. ప్రభుత్వ నిర్బంధ పాలనకు నిదర్శనమని ఒకప్రకటనలో విమర్శించారు. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
-
తెలంగాణ అసెంబ్లీ విప్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ విప్‌లను నియమించింది. శాసనసభ విప్‌లుగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను తెలంగాణ సర్కారు నియమించింది. అలాగే, శాసన మండలి విప్‌లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వేముల వీరేశం -
వారు అహంకారం ప్రదర్శించారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి విశిష్ఠ ప్రణాళిక అని అన్నారు. ప్రతిపక్షం ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని, హుందాగా ప్రవర్తించకుండా అహంకారం ప్రదర్శించిందని అన్నారు.‘ఎన్నో త్యాగాల ఫలితం మన దేశ స్వాతంత్య్రం. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘపోరాటంతో స్వాతంత్య్రం వచ్చింది. పేదవాడికి బ్యాంకింగ్ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇందిరా గాంధీ. నెహ్రూ కట్టిన ప్రాజెక్టులను మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదు. అభివృద్ధిలో కలిసి వస్తారనుకుంటే ప్రతిపక్షం అహంకారం చూపిస్తోంది. 4 కోట్లమంది ప్రజలను నిరాశపర్చేలా విపక్షాల తీరు ఉంది. అధికారం పోయినా రాచరిక పోకడలు పోలేదు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వాళ్ల తీరు మారలేదు. కొందరు తమను తాము రాజులనుకుంటున్నారు. ఇప్పటికీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. ‘దేవుళ్ల కాలం నుంచే మారీచుల రూపంలో అడ్డంకులు సృష్టించే వారు ఉన్నారు. చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లను కబ్జాల నుంచి కాపాడుతున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. అందుకే హైదరాబాద్‌ను కాలుష్యం, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. -
Updates : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్ 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందిపంటల బీమా అమలు చేయడం లేదు వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతమొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసనఅసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్‌పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన -
MH: అసెంబ్లీకీ బాంబు బెదిరింపు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపడుతుంది. అక్కడున్న వారిని వెంటనే వేరే ప్రాంతాల తరలించింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా తరుచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ ఫేక్వా లేక నిజంగానే బాంబు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. -
కుల, మతాలు అంటూ.. పవన్ కొత్త రాజకీయం
-
ఇన్ని అబద్ధాలా? ఇంత విషమా?
అబద్ధాలు చెప్పడం చంద్రబాబు గారి జన్మహక్కు. దాన్ని మనం కాదన్నా ఆయన ఒప్పుకోరు. అందుకే అసెంబ్లీ లోనూ, బయటా, దేవుడి ముందూ, దేవుడి మీదా కూడా అబద్ధాలు చెప్ప గలరు. కోట్లాది మంది భక్తితో మోకరిల్లే తిరుమల శ్రీవారికే పంగనామం పెట్టగల సమర్థత బాబు గారి సొత్తు. మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల గురించి గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తిరుమలను రెండు కొండలుగా ప్రకటించారని ఘోరమైన అసత్యం ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని కోట గోడలా కట్టి, నమ్మించడం చంద్రబాబు స్పెషా లిటీ. గోడలు బద్ధలు కొట్టకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. బ్రిటిష్ వారి మాన్యువల్ లెక్కఏడుకొండలపై వెలసిన తిరుమల క్షేత్రం సువిశాలమైంది. శేషాచలం కొండలు సమస్తం శ్రీవారి నిలయమే. దైవానికీ, భక్తికీ పరిధి లేదు. అయితే బ్రిటిష్ వారి నార్త్ ఆర్కాట్ మాన్యుయల్‌లో తిరుమల పరిధి 27 చదరపు కిలోమీటర్లు అని లిఖితమై ఉంది. టీటీడీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులన్నీ కేంద్ర అటవీ శాఖ నుంచి లభించేవి కాబట్టి ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా పాలకులూ, ముఖ్యమంత్రులూ వచ్చారు. టీడీపీ ఎన్టీఆర్ హయాంలోనూ, తొమ్మిదేళ్లచంద్రబాబు హయాంలోనూ కూడా బ్రిటిష్ వారి లెక్కల ప్రకారమే తిరుమల ఉండింది. ఎవరికీ ఏ సందేహం లేదు, రాలేదు. ఇది దైవ కార్యం కాబట్టి! వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్ర బాబు దిగజారి తిరుమలను రాజకీయం చేయడం మొదలు పెట్టారు. కొండపై పంచాయతీ ఎన్నికల విషయమై జయచంద్ర నాయుడు అనే తెలుగుదేశం నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ సందర్భంగా అప్పటి పంచాయతీ రాజ్ సెక్రటరీ శామ్యూల్ జీవో నంబర్ 338 విడుదల చేశారు. శతాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ వారి ఉత్తర్వుల్లోని 27 చ.కి.మీ. పరిధినే జీవోలో తెలిపారు. ఇదే అదనుగా చంద్రబాబు గగ్గోలు పెట్టి బురద చల్లడం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలను రెండు కొండ లుగా మార్చాడని అబద్ధం ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఆ రెండు కొండలు ఏమిటి? మినహాయించిన ఐదు కొండల పేర్లను చంద్ర బాబు జన్మలో చెప్పలేరు. ఎందుకంటే, అటువంటి ఆలోచనే జరగ లేదు కాబట్టి! వైఎస్‌తో బాబుకు పోలికా!అయితే చంద్రబాబు కుటిలత్వాన్నీ, దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే దుర్మార్గాన్నీ అప్పటి టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న నేను గుర్తించాను. అప్పటి ఈవో కేవీ రమణాచారి, ఎండోమెంట్ సెక్రటరీ ఐవీ సుబ్బారావు గార్లతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌తో స్వయంగా చర్చించాం. చంద్రబాబు దురుద్దేశాన్ని వివరించాం. వెంటనే ఆయన తిరుమల పరిధిని 352 చదరపు కిలోమీటర్లుగా నిర్దేశిస్తూ జీవో 746, తిరుమలలో అన్య మత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747ను విడుదల చేశారు. తిరుమల శ్రీవారికి భక్తితో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారు. ఏడుకొండల చట్టం తెచ్చింది ఆయనే. అన్యమత ప్రచారాన్ని నిషే ధించింది ఆయనే. వైఎస్ హయాంలోనే, నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు, టీటీడీలో హిందువులు తప్ప మిగతా మతస్థులతోఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదని చట్టం తెచ్చాం. ఎన్టీఆర్ హయాంలో గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి కుటుంబాల వంశ పారంపర్య మిరాశీ హక్కును రద్దు చేశారు. 2007లో దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాల ఆనువంశిక హక్కును వైఎస్ రాజశేఖర రెడ్డి పునరుద్ధరించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సాధు పుంగవుల సమ్మేళనం నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే!తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడ్డానికీ, ధర్మాన్ని, విశ్వాసాల్ని పరిరక్షించడానికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పాటుపడ్డారు. ఆయన పాదాల చెంత ఉన్న నారావారిపల్లెలో పుట్టి, తెల్లారి లేస్తే స్మరించుకుంటానని అబద్ధాలు చెప్పే చంద్రబాబు తిరుమలకు పంగనామం పెట్టడం తప్ప, చేసిందేమీ లేదు. దేవుడి పేరుతో ఇంత రాజకీయమా?అలిపిరి సంఘటనలో వేంకటేశ్వరస్వామి చంద్రబాబును కాపాడిన మాట నిజమే. అయితే దేవుణ్ణి రాజకీయాలకు వాడే ఆయన స్వభావానికి అది శ్రీవారు చేసిన హెచ్చరిక కూడా! ఆ తర్వాత కూడా తిరుమల శ్రీనివాసుడిని రాజకీయాలకు వాడారు, ఇంకా వాడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి వస్త్రాలు భక్తితో తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఇద్దరూ తిరు మలను రాజకీయాలకు వాడలేదు. ఇపుడు కూడా చంద్రబాబునిందలకు సమాధానం మాత్రమే చెబుతున్నాం. ఎందుకంటే అబ ద్ధాన్ని నిజమని నమ్మించడంలో భారత రాజకీయాల్లోనే ఆయన్ని మించినవారు లేరు, ఇప్పట్లో రారు. 2009లో జరిగిన రాజకీయ సభలో జీవోలు 746, 747 రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబే,అసెంబ్లీలో జంకు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్గుగా అనిపించదా? పీవీ నరసింహారావు గారితో సహా ఎందరో మహనీయుడిగా భావించే పెజావర్ స్వామి ఈ జీవోల మీద వైఎస్‌ను ప్రశంసించారు. హైందవ ప్రచారానికి వైఎస్ చేసిన కృషిని పత్రికా సమావేశంలో కొనియాడారు. చంద్రబాబుకు బురద రాజకీయమే తెలుసు. మాకు గౌరవ రాజకీయాలు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కుమారుడు లోకేశ్ పెళ్లికి, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు శేషాద్రి స్వామిని, తిరుమల అర్చకుల్ని స్వయంగా నేనే ఏర్పాటు చేశాను. బాలకృష్ణ కూడా సౌకర్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం దర్శన ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం బాలకృష్ణతో చెబితే, ‘రాజకీ యాలతో నాకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీ ఏర్పాట్లు బాగున్నాయి’ అన్నారు. ధైర్యం ఉంటే జగన్ తో రాజకీయంగా తలపడండి. మతాన్నీ, దేవుడినీ అడ్డు పెట్టుకుని అబద్ధాల్ని చెప్పకండి చంద్రబాబూ!ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దేవుడు ఇంకా బాగా గమనిస్తు న్నాడు. తిరుమల క్షేత్రం చాలా శక్తిమంతమైనది. ఆ దైవం ప్రతిసారీ మిమ్మల్ని క్షమించక పోవచ్చు! -వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకరరెడ్డి -
మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన.. చైర్మన్ అసహనం
ఏపీ శాసన మండలి అప్డేట్స్..ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ హిందూ వ్యతిరేకి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారువైవీ సుబ్బారెడ్డి సతీమణి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాంసుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ గురించి మీకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నాబైబిల్ పట్టుకున్నంత మాత్రాన స్వర్ణమ్మ క్రిస్టియన్ అయిపోతుందా?.మీరు కూడా అనేక సార్లు మీ మీటింగ్‌లలో బైబిల్ పట్టుకున్నారుమీరు కూడా క్రిస్టియన్లే అని ఒప్పుకుంటారా?మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తేవడం మంచి పద్ధతి కాదుచంద్రబాబు కూల్చిన గుళ్లను పునఃనిర్మించిన చరిత్ర వైఎస్ జగన్‌ది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించారు801 ఆలయాలను పునఃరుద్ధరణ చేశారునవనీత సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశారు వైఎస్సార్, వైఎస్ జగన్ హిందూ సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తులు21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది వైఎస్సార్. దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలు వైఎస్ జగన్‌పై బురద జల్లుతున్నారుఇప్పటికైనా చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేయడం మానుకోవాలిఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక.వైద్యానికి వైఎస్సార్, వైఎస్ జగన్ పెద్దపీట వేశారుఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది.నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం మానేసిందిబిల్లులు నిలిపివేయడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రులు ఇబ్బందుల్లో పడ్డాయి శాసనమండలి మీడియా పాయింట్..ఎమ్మెల్సీ తూమాటి మధవరావు కామెంట్స్.. పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారుతప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారుగత ప్రభుత్వంలో చేసిన ఖర్చులనే ఈ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారుప్రభుత్వం మారగానే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారని అడిగితే వివరాలు లేవంటున్నారుఆరు ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా?పోర్టుల అనుసంధానం వల్లనే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయిగత ప్రభుత్వంలో 50-60 శాతం పనులు చేస్తే, ఈ ప్రభుత్వంలో 5% కూడా చేయలేదురేపటిలోగా మా ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం సమాధానం చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన..ఆడబిడ్డ నిధిపై మండలిలో టీడీపీ అడ్డగోలు వాదనఆడబిడ్డ నిధిపై సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రుల ఎదురుదాడికిమంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి, కూటమి ఎమ్మెల్సీలు అత్యుత్సాహంకూటమి ఎమ్మెల్సీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మండలి చైర్మన్ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొంతనలేని సమాధానంమంత్రి సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులుఆడబిడ్డ నిధి గురించి కాకుండా మిగిలిన అంశాలపై మాట్లాడిన మంత్రిసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సూచించిన చైర్మన్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారునీకు 18 వేలు నీకు 18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి చెప్పారుఎన్నికల్లో తిరిగి మరీ ప్రచారం చేశారుమూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్సశాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి. ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి. బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు.. ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్..భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు కోర్టు కేసులు క్లియర్ చేయలేదుఎన్ఓసీ తీసుకురాలేదువైఎస్ జగన్ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారుఅన్ని అనుమతులు తెచ్చింది జగన్కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారుఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు. నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభంనేడు వ్యవసాయంపై లఘు చర్చశాసనమండలి..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదుగతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించిందితురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదుడయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి -
హెరిటేజ్ గుట్టురట్టు.. అసెంబ్లీలో తప్పించుకున్న చంద్రబాబు..
-
సభకు వెళ్లే పెద్దలెవరు?
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రం నుంచి పెద్దల సభ కు ఎవరు వెళ్తారన్న చర్చ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్), కేఆర్ సురేశ్‌రెడ్డి (బీఆర్ఎస్)ల పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలుండటంతో అధికార పార్టీ ఎవరిని రాజ్యసభకు పంపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ రెండింటిలో ఒకటి అధిష్టానం కోటాకు వెళ్లనుంది. తెలంగాణకు సంబంధించిన కీలక కేసుల్లో న్యాయవాదిగా ఉన్న ఆ పార్టీ నేత సింఘ్విని రాష్ట్రం నుంచి మరోమారు పెద్దల సభకు పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రెండో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలువురు నేతలు ఎవరికి వారు రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఈసారి రెడ్డి, బీసీ, ఎస్టీ వర్గాల్లో ఒకరికి చాన్స్ ఉందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఎవరిని పంపుతారో?రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా ముగ్గురిని (రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్, అభిషేక్ సింఘ్వి) రాజ్యసభకు పంపింది. ఈ జాబితాలో రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్, అభిషేక్ సింఘ్వి ఉన్నారు. సింఘ్వికి రెన్యువల్ కావడం దాదాపు ఖరారు కాగా, రెండో సభ్యుడిగా రాష్ట్రం నుంచి రెడ్డి, బీసీ లేదంటే ఎస్టీ వర్గాల నేతల పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి ఈ సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఓటర్లున్న లంబాడా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం, ఇప్పటివరకు నల్లగొండ జిల్లాకు చెందిన శంకర్‌నాయక్‌ను మాత్రమే ఎమ్మెల్సీగా నియమించడం, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో పెద్దగా ప్రాధాన్యం కల్పించని నేపథ్యంలో ఈసారి బంజారా నాయకుడిని పెద్దల సభకు పంపే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ కోటాలో తెలంగాణ ఉద్యమకారుడు, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ చైర్మన్, ప్రస్తుత ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు అటు బంజారా సామాజిక వర్గంలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ గుర్తింపు కూడా ఉంది. సీఎం రేవంత్ ఆశీస్సులు కూడా ఆయనకున్నాయని, రాహుల్ కోటరీలో తనకున్న సంబంధాలతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బెల్లయ్య ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. రేసులో పలువురుసామాజిక సమీకరణల్లో భాగంగా బీసీలకు మరో అవకాశం ఇచ్చే అంశాన్నీ కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న టీపీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అంశాన్ని ఎజెండాగా చేసుకుని వెళుతున్న కాంగ్రెస్... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తోందని, ఇప్పటికే పలు కీలక స్థానాల్లో ఆయా వర్గాల నేతలను నియమించిన నేపథ్యంలో ఈసారి రాజ్యసభకు అగ్రవర్ణాలకు చెందిన నాయకులను పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రేవంత్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి పేరు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా తన సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపుతారని ఆశిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ రాజకీయ పరిణామాల్లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉప రాష్ట్రపతిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నా ఆయన రాజకీయ అడుగు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఆయన్ను ఒప్పించేందుకు రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక, మరో ట్విస్ట్ ఏమిటంటే.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. మంత్రిగా అజహరుద్దీన్ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తోంది. మరో రెండు నెలల్లో ఆయన ఎమ్మెల్సీ లేదంటే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ, ఆయనను ఎమ్మెల్సీగా నియమించే విషయం ఇప్పటివరకు ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో అవసరమైతే మహేశ్‌గౌడ్‌ను రాజ్యసభకు పంపి, ఆయన స్థానంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అజహరుద్దీన్‌ను ఎంపిక చేసే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
హెడ్ సెట్ విసిరి కొట్టిన పయ్యావుల.. మండలిలో అసలు ఏం జరిగిందంటే
-
అసెంబ్లీలో YSRCP నేతలను బెదిరిస్తోన్న పయ్యావుల
-
పవన్ కు బిగ్ షాక్.. అసెంబ్లీలో దేవాన్ష్ పై పొగడ్తలు.. జనసేన MLA ఓవరాక్షన్
-
YSRCP నేతల నిరసనలతో మారుమోగిన అసెంబ్లీ
-
ఏపీ అసెంబ్లీ నుంచి YSRCP సభ్యుల వాకౌట్
-
ప్రజల గొంతుకగా ఒక్కటైన ప్రతిపక్షం!
-
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని YSRCP నినాదాలు
-
మేం ప్రతిపక్షం... మాది ప్రజాపక్షం.. అసెంబ్లీ వద్ద కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు
బిహార్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అధికార పార్టీ చేసిన పనిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తుంటారు. అయితే అక్కడ అసెంబ్లీలో ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. ఇటీవల బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ అక్కడి ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఆలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యేలలో ఆమె అతి పిన్న వయస్కురాలు. అయితే ప్రస్తుతం బిహార్‌లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి వైద్యశాఖ మంత్రి మంగళ్ పాండేని మైథిలీఠాకూర్ ఆసుపత్రుల పనితీరుపై ప్రశ్న అడిగింది. దీనికి ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే దీనిపట్ల మైథిలీ ఠాకూర్ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసింది.మైథిలీ మాట్లాడుతూ "వైద్యశాఖ మంత్రి ఆసుపత్రుల భవనాలకు చిన్న మరమ్మత్తులు చేస్తే సరిపోతుందన్నారు. అయితే నేను వాటిని స్వయంగా చూశాను. అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడి ఆసుపత్రులన్ని ఒక చిన్న గదిలో కొనసాగుతున్నాయి. మంత్రి సమాధానంపై నాకు సంతృప్తి కలగలేదు". అని మైథిలీ ఠాకూర్ అన్నారు.వైద్యశాఖ మంత్రి అంతా బాగుందన్నారు. అయితే పరిస్థితులు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇంతకు ముందు ఆసుపత్రులలో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేవారని ఇప్పుడు మాత్రం ఆయుష్ ప్రాక్టీషినియర్లతోటే ఆసుపత్రులు నడుస్తున్నాయని తెలిపారు.ప్రస్తుతం జనాభా 40 నుంచి 50 వేలున్న ప్రాంతంలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ ఫోక్ సింగర్. అయితే బిహార్‌లో ఇటీవలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ, ఆర్జేడీలతో పాటు ఇతర మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో స్వంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంతో ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మైథిలీ వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి. -
అరవ శ్రీధర్ మరో రెండు వీడియోలు రిలీజ్
-
అదానీ గ్రూప్-ఎంబ్రేయర్ మధ్య ఒప్పందం
భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ (Embraer SA) మధ్య కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. తాజాగా జరిగిన ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో ప్రాంతీయ వాణిజ్య విమానాల (Regional Transport Aircraft) తయారీ, అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.సాధారణంగా ఎయిర్‌బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ నుంచి విమాన విడిభాగాలను మాత్రమే సేకరిస్తుంటాయి. కానీ, పూర్తిస్థాయి అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేసేందుకు అవి ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో అదానీ-ఎంబ్రేయర్ భాగస్వామ్యం భారత విమానయాన రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరలేపనుంది.ఒప్పందంలోని ప్రధానాంశాలుఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే ఎంబ్రేయర్ విమానాల అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. విమానాల విక్రయాలకు సంబంధించి తగినంత స్థాయిలో ఆర్డర్లు లభించిన వెంటనే అసెంబ్లీ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (Technology Transfer), శిక్షణ, పటిష్టమైన సప్లై చైన్ వ్యవస్థ ఏర్పడుతుంది.ప్రభుత్వ మద్దతుభారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘ఆత్మనిర్భర్ భారత్’, దేశంలోని చిన్న పట్టణాలను విమాన మార్గాలతో అనుసంధానించే ‘ఉడాన్’ (UDAN) పథకాలకు ఈ ఒప్పందం ఊతం ఇస్తుంది. దీనివల్ల భారత్-బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడి వివరాలు, ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. పనుల ప్రారంభ గడువు (Timeline) వంటి అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం విజయవంతం అయితే భారత్ కేవలం విమానాల వినియోగదారు దేశంగానే కాకుండా ప్రపంచ స్థాయి విమానాల తయారీ కేంద్రంగా కూడా అవతరిస్తుంది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు -
karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు (గురువారం) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే నిష్క్రమించారు. కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి, తన ప్రసంగాన్ని ముగించడం సభలో తీవ్ర కలకలం రేపింది.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)నకు సంబంధించిన వివాదాస్పద చట్టంపై ప్రభుత్వం ప్రస్తావించిన కొన్ని పేరాలపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఉన్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పెరుగుతున్న అగాధానికి అద్దం పడుతోంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మరుసటి రోజే కర్ణాటకలో ఈ తరహా ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు కేరళ గవర్నర్ కూడా తన ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవకుండా వదిలేశారు. #WATCH | Bengaluru | Karnataka Governor Thawarchand Gehlot walks out of the Karnataka Legislative Assembly; Congress leader BK Hariprasad seen trying to stop the Governor pic.twitter.com/QZjWSlZJgx— ANI (@ANI) January 22, 2026కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలలోని దాదాపు 11 పేరాలను తొలగించాలని గవర్నర్ గెహ్లాట్ ముందే సూచించారు. అయితే, ప్రభుత్వం వాటిని మార్చకపోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. కాగా గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని చదవకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 మరియు 163 ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతను గవర్నర్ విస్మరించారని, దీనిపై నిరసన తెలపడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. -
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..
-
గవర్నర్ల కోసం ప్రత్యేక చట్టాలేవి లేవు: స్టాలిన్
తమిళనాడు గవర్నర్ RN రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి వైరం ముదిరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనను అవమానించారని అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని అన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ " సభనుంచి గవర్నర్ వాకౌట్ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించడమే. గవర్నర్ తన అభిప్రాయాలను పంచుకునేలా, ఎదైనా చెప్పేలా ఉండే చట్టాలేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా గవర్నర్ మద్దతు ప్రకటించాలి కాని RNరవి అలా చేయడం లేదు" అని స్టాలిన్ అన్నారు.రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తుని ఇటువంటి చర్యలు చేయడం వల్ల సభను అవమానపరుస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం సభను వాకౌట్ చేసిన గవర్నర్ అనంతరం అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. జతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని తాను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులున్నాయని, తన మైక్ ఆప్ చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.అయితే గతంలోనూ తమిళనాడు గవర్నర్ RN రవి తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించన ప్రసంగం కాకుండా తన స్వంత ప్రసంగాన్ని చదివారు. ఈ వివాదం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంమైంది. -
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో మరోసారి జాతీయ గీతం విషయంలో వివాదం చెలరేగింది. గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీని వదిలి వెళ్లారు. తన సంప్రదాయ ప్రసంగాన్ని చదివేందుకు నిరాకరించారు. ఇదే జాతీయ గీతం ఆలాపన విషయంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ఇలాగే సభను వదిలి వెళ్లడం గమనార్హం.చెన్నైలోని తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ ఆర్.ఎన్. రవి సభలో ప్రవేశించారు. రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని ఆయన కోరారు. అయితే స్పీకర్ ఎం.అప్పావు అందుకు నిరాకరించారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం సమావేశం ముగిసిన తర్వాత జాతీయ గీతం మాత్రమే వినిపిస్తారని వివరణిచ్చారు. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రారంభించక ముందే సభను వదిలి వెళ్లిపోయారు.అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదు. నేను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులు ఉన్నాయి. నా మైక్ ఆఫ్ చేశారు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది అవమానం అని అన్నారు. ఆయన ప్రసంగాన్ని చివరికి స్పీకర్ చదివి వినిపించారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు గవర్నర్ తీరును తప్పుబడుతుంటే.. బీజేపీ వర్గాలు మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. జాతీయ గీతానికి గౌరవం ఇవ్వకపోవడం తప్పు అని పేర్కొన్నారు.జాతీయ గీలాపన విషయంలో గత మూడేళ్లుగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ సంప్రదాయ ప్రసంగాన్ని చదవకుండా నిరాకరించారు. 2024, 2025 సంవత్సరాల్లో కూడా ఇదే కారణంతో ఆయన సభను వదిలి వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. గవర్నర్ రవి చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనలు కలిసి సాంస్కృతిక గౌరవం, రాజ్యాంగ సంప్రదాయాలు, రాజకీయ విభేదాలు అన్న మూడు అంశాలను ముందుకు తెచ్చాయి. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాని పక్షంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తతకు గురయ్యే అవకాశం ఉంది.Why TN #GovernorRNRavi R N Ravi walked out of the House without delivering Customary Address? #lokiBhavan says:The speech contains numerous unsubstantiated claims and misleading statements. Several crucial issues troubling the people are ignored.Full text.@lokbhavan_tn… pic.twitter.com/ICO3k4b3BN— Dr Velamur Govindarajan (@Govindarajan67) January 20, 2026 -
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
ఇదే బీఆర్ఎస్ రాసిన మొదటి మరణ శాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్‌ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది...బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది...ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్‌లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు...21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్‌లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్.. రైతుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు.. అసెంబ్లీని ముట్టడించారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైతులు మాట్లాడుతూ..‘అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంట నష్టం జరిగింది. రంగు మారిందని సోయాబీన్ పంట కొనుగోలు చేయడం లేదు. పార్టీలకు అతీతంగా రైతు నాయకులు, రైతులు అందరం.. మంత్రిని కలవడానికి వచ్చాం. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తాం అని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు రైతులను లోపలికి అనుమతించకపోవడంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.కాగా, రైతుల వద్ద నిలువ ఉన్న సోయాబీన్ పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుల వద్ద నుంచి 2,80,000 క్వింటాళ్లకు పైగా సోయాబీన్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది.. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇప్పటి వరకు 6280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటళ్ల పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో, రైతులు ఆందోళనకు దిగారు. -
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల ప్రయత్నం
-
నేను మైక్ ఇవ్వను! హరీష్ పై స్పీకర్ ఆగ్రహం
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్
-
రేపు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి హైదరాబాద్: సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం కోసం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌లో గల తన నివాసానికి బయిలుదేరినట్లు పేర్కొంది. రేపు జరిగే అసెంబ్లీ సెషన్‌కు అక్కడి నుంచి కేసీఆర్ హాజరు కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సెషన్లకు హాజరయ్యారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వగా రెండోసారి బడ్జెట్ ప్రసంగానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించింది. కాగా ఇటీవలే కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించారు. వాటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆరాతీశారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్‌వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా? -
ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో 30,000 మంది నియామకం
భారతదేశ తయారీ రంగంలో నియామకాల పర్వం కొనసాగుతోంది. తైవాన్‌కు చెందిన దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్లో రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టింది. కేవలం 8 నుండి 9 నెలల వ్యవధిలోనే దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకోవడం ద్వారా తన కార్యకలాపాలను వేగవంతం చేసింది.మహిళలకు పెద్దపీట300 ఎకరాల ఈ భారీ సదుపాయంలో మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 19-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు, మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే కావడం గమనార్హం. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000కు పెరుగుతుందని అంచనా. తద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో లేని విధంగా ఒకే ప్రాంగణంలో అత్యధిక మంది మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్‌గా ఇది రికార్డు సృష్టించనుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తయారీ ఇక్కడే..ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్‌తో ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం యాపిల్ అత్యాధునిక మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను తయారు చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో 80 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.ప్లాంట్ విశేషాలుసుమారు రూ.20,000 కోట్లు పెట్టుబడి.2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం.సగటున వేతనం నెలకు రూ.18,000 (ఉచిత వసతి, సబ్సిడీ భోజనం).ఉద్యోగుల కోసం ఇప్పటికే 6 భారీ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి.‘మినీ టౌన్షిప్’గా దేవనహళ్లికేవలం ఫ్యాక్టరీగానే కాకుండా ఈ ప్లాంట్ భవిష్యత్తులో ఒక మినీ టౌన్‌షిప్‌లా మారనుందని కంపెనీ చెప్పింది. ఇందులో నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మహిళా కార్మికులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చలి చంపుతున్నా వ్యాపారం భళా -
నేనే సీఎం... అలాగని రాసిచ్చారా?
కర్ణాటక: అసెంబ్లీలో చివరిరోజు శుక్రవారం సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత అశోక్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్ముందూ తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్ధు అనగా..అలాగని రాసిచ్చారా అంటూ అశోక్ కౌంటరిచ్చారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం అనే నిర్ణయం కాలేదని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీర్మానిస్తే మున్ముందు కూడా తానే కొనసాగుతానని, హైకమాండ్ తనకు అండగా ఉందని అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ .. ‘మేమంతా బ్రహ్మ వద్ద ఎక్కువ సేపు ఉండకుండా విడిచి వచ్చేశాం. సిద్ధరామయ్య మాత్రం బ్రహ్మ వద్ద కూర్చొని 2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలూ ముఖ్యమంత్రిగా ఖరారు చేసుకుని రాయించుకుని వచ్చారు. ప్రస్తుతం మాత్రం రెండున్నర సంవత్సరాలు రాసిచ్చార’ంటూ ఎద్దేవా చేశారు. ఇది మీకు ఎలా తెలిసిందని సిద్ధు ప్రశ్నించగా... ‘మీరు అధికార మారి్పడి గురించి ఢిల్లీ విమానం ఎక్కి వెళ్లిన నాటి నుంచి తీర్మానం అయ్యే వరకు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి నాకు ఫోన్ ద్వారా సమాచారం వస్తుండేది. మీకు రెండున్నరేళ్లనని గడువు రాశారు. దానితో సరిపెట్టుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య తమది హైకమాండ్ ఉన్న పార్టీ అని, తొలిసారి కాలావధికి ఐదేళ్లు అధికారాన్ని పూర్తి చేశానని, ప్రస్తుతం హైకమాండ్ తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇన్ని సమస్యల మధ్య కూడా మీరు సమరి్థంచుకోవటాన్ని మెచ్చుకోవాలని బీజేపీ సభ్యులు అరగ జ్ఞానేంద్ర, వి.సునీల్‌కుమార్ తదితరులు ఎద్దేవా చేశారు. బీజేపీలో యడియూరప్పను అధికారం నుంచి తొలగించింది ఎందుకని సిద్ధు ప్రశ్నించారు. అశోక్‌కు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పూర్తి చేసే విశ్వాసముందా అని సవాల్ చేశారు. అశోక్ ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారని, ఆ విషయంలో తమకు గ్యారెంటీ ఉందని, మీకు ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాననే విశ్వాసం ఉందా అని సునీల్‌కుమార్ ప్రశ్నించారు. ‘శాసనసభా పార్టీ సమావేశంలో నన్ను ఎంపిక చేశారు. అదే ప్రకారం ముఖ్యమంత్రి అయ్యా. హైకమాండ్ తీర్మానించినట్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రెండున్నరేళ్లు అంటూ మాలో ఎలాంటి తీర్మానమూ కాలేద’ని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. మంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ తమ పార్టీ విషయాలు బీజేపీ వారికి ఎందుకని ప్రశ్నించారు. సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అధికార మారి్పడి అంటూ తీర్మానం కాలేదు.. అనవసరమైన చర్చ ఎందుకన్నారు. -
‘అసెంబ్లీ తీరు ఇంత ఘోరమా?’ హరీష్‌రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలకు తిలోదకాలిచ్చేశారని, అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, చివరికి డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని కూడా గాలికి వదిలేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సరైన కారణాలు లేకుండా సభను తరచుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్స్‌కు విరుద్ధమని హరీష్ రావు వాపోయారు.సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనన్నారు.గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు కాబట్టి, ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని హరీష్‌రావు పేర్కొన్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించిందన్నారు. అయితే ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్.. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా? -
20 ఏళ్ల తరువాత హోంశాఖను త్యాగం చేసిన సీఎం నితీష్ కుమార్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి కొత్త సర్కార్ ఖరారైంది. మిత్రం పక్షం జేడీయూ నేత బిహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకరం చేశారు. నితీష్‌తోపాటు మొత్తం 27 గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రెండు దశాబ్దాల తర్వాత నితీష్ కీలకమైన హోంమంత్రి పదవిని బీజేపీకి త్యాగం చేయడం విశేషంగా నిలిచింది. దీంతో కూటమి ప్రభుత్వంలో బీజేపీ పట్టు సాధించి, డ్రైవింగ్ సీటు వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇప్పటివరకు నితీష్ కుమార్ వద్ద ఉన్న హోంమంత్రి పదవిని బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపికి చెందిన సామ్రాట్ చౌదరికి కేటాయించారు. రెండు దశాబ్దాల తర్వాత కీలకమంత్రి పదవిని నితీష్ తన డిప్యూటీకి అప్పగించడం చర్చకు దారితీసింది. కాగా నితీష్ కుమార్ డిప్యూటీలలో మరొకరు విజయ్ కుమార్ సిన్హాకు గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖతో పాటు భూమి మరియు రెవెన్యూ శాఖను అప్పగించారు. మంగళ్ పాండే ఆరోగ్యం, న్యాయ శాఖలకు నాయకత్వం వహిస్తారు, దిలీప్ జైస్వాల్ పరిశ్రమ మంత్రిగా నియమితు లయ్యారు.చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా! -
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్ పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో మెుకామా ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా నుండి పోటీ చేసి గెలిచింది. -
ఏడు రాష్ట్రాలు.. 8 ఉప ఎన్నికలు.. ఏ పార్టీలు గెలిచాయంటే?
ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 8 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు సాధించాయి. తెలంగాణ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ నగ్రోటలో బీజేపీ అభ్యర్థి దేవయాని రానా గెలుపొందారు. బడ్గాంలో పీడీపీ అభ్యర్ధి సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు.జార్ఖండ్‌లో ఘట్సిల ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం సాధించగా.. రాజస్థాన్‌లో అంట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ గెలుపొందారు. తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. పంజాబ్‌లో తరణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సందు గెలుపొందారు. మిజోరాంలో డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా గెలుపొందారు. ఒడిశాలో నౌపడ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా విజయం సాధించారు. -
బిహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు
-
Kerala: అసెంబ్లీకి ‘స్వర్ణ తాపడం’ వివాదం.. గందరగోళం మధ్య సభ వాయిదా
తిరువనంతపురం: శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని మరింత వేడెక్కించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. దీంతో సోమవారం శాసనసభలో హై డ్రామా నడిచింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.సభలో తొలుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శబరిమల స్వర్ణ తాపడం అంశాన్ని లేవనెత్తారు. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ దేవస్వం(దేవాదాయశాఖ) మంత్రి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వీఎన్ వాసవన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో షెడ్యూల్ చేసిన ప్రశ్నలను అడగాలని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.‘అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే స్వాహా చేశారు’ లాంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను ప్రతిపక్ష సభ్యులు తమ చేత పట్టుకుని, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న మంత్రులు, పాలకవర్గ సభ్యులు తమ సీట్ల నుండి లేచి నిలుచున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపక్ష సభ్యుల చర్యలను ఖండించారు. సభలో ఈ విధంగా అంతరాయం కలిగించడం సరైనది కాదన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోవడం సభను అగౌరవపరచడమేనన్నారు.సభ్యులు తమ చేతుల్లోని ప్లకార్డులను దించాలని ఆయన ఆదేశించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను వాయిదా వేశారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సభలో ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత వారంలో ప్రతిపక్షం ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. అయితే స్పీకర్ ఈ అంశం కేరళ హైకోర్టు పరిశీలనలో ఉందని పేర్కొంటూ, దానిని తోసిపుచ్చారు. కాగా రాబోయే రోజుల్లో శబరిమల స్వర్ణ తాపడం వివాదంపై తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు. -
Janatantram: అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు
-
తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరిన కామినేని
-
నేను చెప్పినవన్నీ అబద్ధాలే.. నిజం ఒప్పుకున్నా కామినేని
-
మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
-
జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు: చిరంజీవి
సాక్షి, అమరావతి: సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించినట్లు సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. అసలు వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్‌కు వివరించినట్టు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవండన్నాడట.. అంటూ బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ చానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినందుకు నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నా’’ అంటూ చిరంజీవి స్పందించారు. ఆ ప్రకటనలో చిరంజీవి ఇంకా ఏం చెప్పారంటే.. నన్ను చొరవ తీసుకోమన్నారు.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్.. ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం సీఎంతో మాట్లాడి చెబుతానన్నారు. నా చొరవతోనే టికెట్ ధరల పెంపు సాధ్యమైంది సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్‌కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయంతో మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డి్రస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకొనే విధానంలోనే మాట్లాడతా. నేను ఇండియాలో లేను. అందుకే ప్రకటన విడుదల చేస్తున్నాను. సీఎం ఆహ్వానం మేరకే ఇంటికి వెళ్లాను అప్పటి మంత్రి పేర్ని నాని ఓ రోజు ఫోన్ చేసి ‘ముఖ్యమంత్రి ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు. భోజనానికి (లంచ్‌కి) రావాలని చెప్పారు’ అంటూ అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. భోజనం చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి, మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను.కొన్ని రోజుల తర్వాత మంత్రి నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దీంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్.నారాయణమూర్తితో సహా కొంత మందిని తీసుకుని వెళ్లి సీఎం జగన్‌ను కలిశాం. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన
హైదరాబాద్ ఏపీ అసెంబ్లీలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆహ్వానం మేరకు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లామని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లడం కొరకే వెళ్లినట్లు తెలిపారు చిరంజీవి. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 25) అసెంబ్లీ వేదికగా మాట్లాడిన బాలకృష్ణ.. గత ప్రభుత్వం సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రధానంగా వైఎస్ జగన్‌కు కలిసేందుకు వెళ్లిన సమయంలో తనను సినీ పెద్దలు పట్టించుకోలేదన్నారు బాలకృష్ణ. దీనిపై స్పందించిన చిరంజీవి లేఖ రూపంలో వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో సమస్యల కొరకు వైఎస్ జగన్‌కు కలిసేందుకు వెళ్లాం. ఆయన ఆహ్వానం మేరకే వెళ్లాం. ‘మేము పదిమంది వస్తామంటే జగన్ కూడా ఓకే చెప్పారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్‌కు వివరించాం. అసమయం వస్తే అందరం కలిసి వస్తామని చెప్పాం. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు. కోవిడ్ వల్ల ఐదుగురు రావాలన్నారు. పదిమంది వస్తామన్నా సరేనన్నారు వైఎస్ జగన్. ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. బాలకృష్ణను కలవాలని జెమినీ కిరణ్‌కు చెప్పా. మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు. నారాయణమూర్తి సహా కొందరు జగన్‌ను కలిశాం. నా చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు అంగీకరించారు. దీనికి సమావేశంలో ఉన్నవారంతా సాక్షులే. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయి. సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడుతా. నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్ దిగివచ్చారన్నది అంతా అబద్ధం. ఈరోజు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టే వివరణ ఇస్తున్నా’ అని లేఖ ద్వారా వివరణ ఇచ్చే యత్నం చేశారు చిరంజీవి. -
కూటమిలో కుంపటి.. బోండా ఉమ Vs పవన్
-
పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని BRS డిమాండ్
-
సభకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్
అనంతపురం: ‘సంక్షేమ పథకాలు తీసుకునేవారు సీఎం చంద్రబాబు సభకు హాజరు కావాలి. అలా వస్తేనే పథకాలు కొనసాగుతాయి..’ ఇది అనంతపురం జిల్లాలోని గ్రామాల్లో వేసిన చాటింపు. బుధవారం అనంతలో ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ పేరిట ప్రభుత్వం భారీ సభ తలపెట్టింది. దీనికి చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడచూసినా కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు, పోలీసుల హడావుడే..! ఐదు కిలోమీటర్ల దూరం నుంచే బస్సులు, భారీ వాహనాల మళ్లింపు, నగరంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి.సభ ఏర్పాట్ల పేరిట ఇబ్బంది పెడుతుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. బెంగళూరుకు వెళ్లే రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అనంతపురం నుంచి వడియంపేట–బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్–నార్పల–ధర్మవరం–ఎన్ఎస్ గేట్ మీదుగా వాహనాలను మళ్లించడంతో 100–120 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. నార్పల నుంచి బత్తలపల్లికి వెళ్లే మార్గం సరిగా లేదు. వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కియా కంపెనీ ఉద్యోగులు అనంతపురం నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. చంద్రబాబు సభ పుణ్యమాని ఏకంగా 150 కిలోమీటర్ల దూరం చుట్టి వెళ్లాల్సి వస్తోంది. అనంతపురం శివారు కక్కలపల్లి టమాట మండీలకు నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మండీలకు సమీపాన జాతీయ రహదారి–44 పక్కనే సీఎం సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే వాహన రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ టమాట వాహనాలను ఆపి పంపుతున్నారు. కక్కలపల్లి మండీ సమీపంలోకి వెళ్లడానికి వీల్లేకుండా చేశారు. టమాట వాహనాలను తిప్పి పంపుతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇక నగర వీధులను ఫ్లెక్సీలతో నింపేశారు. సామాన్యులు రోడ్డుపై తిరగలేని పరిస్థితి కల్పించారు. దీనినితోడు నగరంలోనూ వాహన సంచారంపై పోలీసులు ఆంక్షలు విధించడం విమర్శలకు తావిస్తోంది. సభకు రాకుంటే పథకాల కోత! ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు సభలకు స్పందన లేకపోవడంతో జన సమీకరణకు సరికొత్త డ్రామాలకు తెరలేపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో చాటింపు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలి. దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారు. చంద్రబాబు సభలో పాల్గొన్నవారికే పథకాలు వస్తాయి’’ అంటూ దండోరా వేయడం విమర్శలకు తావిచ్చింది. పాఠశాలలకు సెలవు.. ఉపాధ్యాయుల ఆగ్రహం అనంతపురంలో సూపర్‌సిక్స్ సభ నేపథ్యంలో బుధవారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు సభకు పాఠశాలల బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. నేటి సెలవుకు బదులుగా రెండో శనివారం (ఈనెల 13న) అన్ని యాజమాన్యాల పాఠశాలలు పని చేయాల్సి ఉంటుందని డీఈఓలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
బెంగాల్ అసెంబ్లీలో రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసనసభ రణరంగాన్ని తలపించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ సభ్యుల మధ్య గురువారం తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ దాడులను ఖండిస్తూ తీర్మానం ఆమోదించాలని పట్టుబట్టారు. తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. బీజేపీ తీరుపై విరచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ ప్రజలపై కక్షగట్టారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బెంగాలీతోపాటు ఇతర భాషలను వారు వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ అవినీతి పార్టీ, దొంగల పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. ఓట్ల దొంగతనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలపై సీఐఎస్ఎఫ్ జవాన్లను ఉసిగొల్పిందని అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని నామరూపాల్లేకుండా చేయాలని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వారిని హెచ్చరిస్తూ మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సభలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉండని రోజు వస్తుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని తేల్చిచెప్పారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి కూలదోస్తారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై జరుగుతున్న అరాచకాలపై అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ సభ్యులకు భయమెందుకని ప్రశ్నించారు. దాంతో సభలో అలజడి మొదలైంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకున్నారు. ఓట్ల దొంగ బీజేపీ అంటూ తృణమూల్ కాంగ్రెస్, ఉద్యోగాల దొంగ తృణమూల్ కాంగ్రెస్ అంటూ బీజేపీ సభ్యులు నినదించారు. నీళ్ల సీసాలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సభలో సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. বাংলাকে চেনে না #mamatabanerjee #tmcnews #westbengalassembly #assemblynews #bjpnews #tmcvsbjp pic.twitter.com/89YF5SqK04— The Wall (@TheWallTweets) September 4, 2025బీజేపీ సభ్యుల సస్పెన్షన్ సభలో పరిస్థితి అదుపు తప్పడంతో బీజేపీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్‌ను సభ నుంచి రోజంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ బీమన్ బెనర్జీ ప్రకటించారు. మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. తమ పార్టీ చీఫ్ విప్ సస్పెన్షన్ పట్ల బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జైశ్రీరామ్ అని నినదిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. బయటకు వెళ్లేందుకు నిరాకరించిన శంకర్ ఘోష్‌ను మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. బీజేపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, బెంగాలీ వలస కార్మికుల హక్కులు, భద్రతపై జరుగుతున్న కీలకమైన చర్చను అడ్డుకొనేందుకు ప్రయతి్నస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మిహీర్ గోస్వామి, బంకీం ఘోష్, అశోక్ దిండాను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, విపక్ష సభ్యుల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ మందలించారు. పద్ధతి మార్చుకోకపోతే మమ్మిల్ని కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు గూండాల మాదిరిగా వ్యవహరించారని తప్పుపట్టారు.VIDEO | Kolkata: West Bengal BJP Chief Whip Sankar Ghosh fainted and was rushed to hospital, while he was being marshalled out of Assembly after he refused to leave following suspension from House.West Bengal Assembly LoP Suvendu Adhikari (@SuvenduWB) says, “These marshals and… pic.twitter.com/8EiXjUPcgo— Press Trust of India (@PTI_News) September 4, 2025 -
Bihar: నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్‌లో తేదీల వెల్లడి?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది చూచాయిగా వెల్లడయ్యింది. అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉండగా, నవంబర్‌లో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కింద నవీకరించిన ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాత, అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.దసరా తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 15- 20 మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 22 గడువుకు ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ బీహార్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్.. సీఎం నితీష్ కుమార్‌ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 243 మంది సభ్యులున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో, ఎన్డీఏలో 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ)-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీ 77లో మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-ఇద్దరు, సీపీఐ-ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. -
హుషారుగా చిందేస్తూ కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి
పండుగ పూట అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిబ్బంది అంతా హుషారుగా వేడుకల్లో మునిగిపోయారు. కొందరు హుషారుగా చిందులేస్తుండగా.. మరికొందరి విజిల్స్, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈలోపు ఊహించని రీతిలో విషాదం అలుముకుంది. కేరళ శాసనసభలో ఓనం సంబరాల సందర్భంగా సోమవారం విషాదం నెలకొంది. డ్యాన్స్ గ్రూప్‌లో హుషారుగా చిందులేస్తూ ఓ సిబ్బంది.. అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఆసుపత్రికి తరలించినా, చేరిన కొద్దిసేపటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన్ని డిప్యూటీ లైబ్రేరియన్ వి. జునైస్ (46)గా పోలీసులు నిర్ధారించారు.వయనాడ్‌కు చెందిన జునైస్ గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్ దగ్గర పీఏగా పని చేశాడు. 2011 నుంచి కేరళ శాసనసభలో సిబ్బందిగా పని చేస్తూ వచ్చాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. క్రీడలంటే ఇష్టమున్న జునైస్.. ఫిట్నెస్ కూడా ఉంది. అయితే ఈ మధ్యే ఛాతీ నొప్పికి చికిత్స తీసుకున్నట్టు బంధువులు తెలిపారు. సోమవారం జరిగిన ఓనం ఈవెంట్స్‌లో టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్లో జునైస్ బృందం మొదటి బహుమతి గెలుచుకుంది. అయితే.. కాసేపటికే అలా డ్యాన్స్ వేస్తూ ఆయన కన్నమూయడం గమనార్హం. సిబ్బంది మృతితో శాసనసభలో జరిగాల్సిన ఓనం వేడుకలు తక్షణమే నిలిపివేశారు.A 45-year-old man collapsed and died while dancing on stage during the Onam celebrations organised by the Kerala legislative assembly.The deceased was identified as Junais, an assistant librarian who earlier worked as the personal assistant of former MLA PV Anwar.He was… pic.twitter.com/dky9R6XPRP— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2025 -
30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభతో పాటు మండలి సమావేశాలు సైతం జరగనుండగా, ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్వించిన విచారణ నివేదికపై సభలో చర్చించే అవకాశం ఉంది.కాగా అదేరోజు రాష్ట్ర మంత్రివర్గం కూడా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో ఎదురవుతున్న ఆటంకాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక దృష్టి ఒకవైపు సెపె్టంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు.బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో ప్రయత్నంగా ఆర్డినెన్స్‌లను రూపొందించి పంపగా వాటిని సైతం గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయడంతో ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, యూరియా కొరత తదితరాలపై.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్వించిన విచారణ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తున్న నేపథ్యంలో.. దీనిపై సైతం మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ గృహాల నిర్మాణం, ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలను కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. -
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. -
ఇక అసెంబ్లీ పదవులు!
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, ఐఏఎస్‌ల బదిలీలు, జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అసెంబ్లీ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ల నియామకంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ విప్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశముందని, ఒకవేళ మండలిలో అదే సామాజిక వర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఉందని సీఎం భావించిన పక్షంలో బీసీ నేతకు కేటాయించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇక మొన్నటివరకు విప్‌గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మంత్రిగా, మరో విప్ రాంచంద్రు నాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు పదవులను కూడా భర్తీ చేసే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సమీకరణలను బట్టి విప్ల సంఖ్యను 4 నుంచి 5 లేదా 6కు పెంచే అవకాశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం. చీఫ్ విప్ ఎవరికి?ప్రస్తుతం అసెంబ్లీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎస్టీ వర్గాలకు చెందిన రాంచంద్రునాయక్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు బీసీలు.. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య, మున్నూరుకాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్‌లు విప్‌లుగా ఉన్నారు. మరో రెండు విప్ పదవులు (అడ్లూరి, రాంచంద్రు నాయక్) ఇటీవల ఖాళీ అయ్యాయి. ఇప్పటివరకు చీఫ్ విప్‌ను నియమించకపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది. ఇలావుండగా ఇప్పటివరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్ పోస్టులను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ ఆ వర్గం నేతలకు చాన్స్ దక్కలేదు.ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డికి కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానిపక్షంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి నియామకం ద్వారా అటు సామాజిక సమీకరణలను పాటించడంతో పాటు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శకు కొంతవరకు చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కాకపోతే మాత్రం ప్రస్తుతం విప్‌లుగా ఉన్న ఇద్దరు బీసీ నేతల్లో ఒకరికి పదోన్నతి లభించవచ్చని, బీర్ల అయిలయ్య లేదంటే ఆది శ్రీనివాస్‌లను చీఫ్ విప్‌లుగా నియమిస్తారని, తద్వారా మంత్రి పదవుల్లో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్న వాదనకు తెరపడినట్టవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విప్ల భర్తీకీ సమీకరణాలుఅసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సీఎం రేవంత్ అంచనా వేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, మాల సామాజిక వర్గం నుంచి మేడిపల్లి సత్యం శ్రీగణేష్, ఎస్టీ కోటాలో మురళీ నాయక్, వెడ్మ బొజ్జుల పేర్లను పరిశీలిస్తున్నారని, సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల సమీకరణల్లో ఒక్కో వర్గానికి ఒకరిని నియమిస్తారని తెలుస్తోంది. మరోవైపు విప్‌గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం కల్పించే విషయాన్ని కూడా సీఎం రేవంత్ సీరియస్‌గా పరిశీలిస్తున్నారని, ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ పదవుల పందేరం అధికారికంగా ఉండే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన మండలి, శాసనసభలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో స్పీకర్, మండలి చైర్మన్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలి ఆవరణ, శాసనసభ ఆవరణలో జాతీయ పతాకాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాం, అద్దంకి దయాకర్, అమీర్ అలీ ఖాన్, అంజిరెడ్డి , దయనంద్, తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, వాణీదేవి సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజాగా గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్(By-election schedule)ను ప్రకటించింది. జూన్ 19 (గురువారం)న ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 23 (సోమవారం)న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.గుజరాత్లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఒక్కొక్క అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్లో, సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్భాయ్ పంజాభాయ్ సోలంకి మృతితో కాడి స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. సిట్టింగ్ సభ్యుడు భయానీ భూపేంద్రభాయ్ గండుభాయ్ రాజీనామా కారణంగా రాష్ట్రంలోని విశావదర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.కేరళలో, పి వి అన్వర్ రాజీనామా చేయడంతో నీలంబర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ సభ్యుడు గురుప్రీత్ బస్సీ గోగి మృతి కారణంగా పంజాబ్‌లోని లూథియానా స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాగా భారత కూటమి మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) (ఆప్)తో భాగస్వామ్యం లేకుండా విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేయనున్నామని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ గతంలో ప్రకటించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ మే 26న ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. వీటి పరిశీలన జూన్ 3న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 5గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘ఆపరేషన్ సింధూర్’ గర్వకారణం: ప్రధాని మోదీ -
వక్ఫ్ చట్టంపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం
-
Waqf (Amendment) Bill: నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ.. ఎన్సీ ఎమ్మెల్యేల రభస
జమ్మూ: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025(Waqf (Amendment) Bill)పై చర్చ రసాభాసకు దారితీసింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ సోమవారం రెండుసార్లు సభను వాయిదా వేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ, సభలో గందరగోళం సృష్టించారు. అయితే ఈ అంశం న్యాయస్థానం విచారణలో ఉందని స్పీకర్ సమాధానమిచ్చారు.12 రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఎన్సీ శాసనసభ్యులు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై చర్చ జరపాలని కోరుతూ లేచి నిలుచున్నారు. గతంలో జీఎస్టీ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పుడు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly)లో చర్చ జరిగిందని, ఇప్పుడు ముస్లిం మెజారిటీ ఉన్న జమ్ము కశ్మీర్లో వక్ఫ్ బిల్లుపై చర్చ ఎందుకు జరగకూడదని వారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన స్పీకర్ ఈ అంశం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం విచారణలో ఉన్నందున చర్చకు అభ్యంతరం తెలిపారు.ఈ నేపధ్యంలో ఎన్సీ ఎమ్మెల్యేలు సభలోని వెల్‌లోకి వచ్చి, నిరసనలు వ్యక్తం చేస్తూ, కాగితాలను చించి, నల్లటి బ్యాడ్జ్‌లను గాలిలో ఊపారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు కూడా ఎన్సీ ఎమ్మెల్యేలు బీజేపీ వ్యతిరేక నినాదాలు కొనసాగించారు. తరువాత వారు పోడియంవైపు వచ్చేందుకు ప్రయత్నించగా వారినిమార్షల్స్ అడ్డుకున్నారు.ఇదే సమయంలో బీజేపీ శాసనసభ్యులు దేశ విద్రోహుల ఎజెండా ఇక్కడ నడవదంటూ నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న ఎన్సీ ఎమ్మెల్యేలను శాంతించేందుకు స్పీకర్ ప్రయత్నిస్తూ, వారిని తిరిగి వారి సీట్లలో కూర్చోమని కోరారు. ఇంతలో.. తాము వక్ఫ్ బిల్లుపై మాత్రమే చర్చను కోరుకుంటున్నామని, ఇది మా మతంపై జరుగుతున్న దాడి అని ఎన్సీ ఎమ్మెల్యే నజీర్ గురేజీ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, విపక్ష శాసనసభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తుండటంతో, స్పీకర్ సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి -
‘ఒకరు సహాయ మంత్రి.. ఇంకొకరు నిస్సహాయ మంత్రి’.. అసెంబ్లీలో కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. పురావస్తు శాఖ చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉంది. మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది వేగంగా జరిగింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రాష్ట్రం పేరు ఎక్కడా వినపడలేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం.తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్రానికి ఎన్నోసార్లు కేంద్రం అన్యాయమే చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. 2014 నుంచి కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ట్యాక్స్ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ.. రాష్ట్రానికి వచ్చేది తక్కువ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దానిపై భట్టి విక్రమార్క ఒక్క మాట అనలేదు. 8 ప్లస్ 8 16కావాలి...కానీ తెలంగాణలో గుండు సున్నా అయింది. భారత జాతిని సాధుతున్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. పురావస్తు శాఖలో చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు...ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయమంత్రి. హైదరాబాద్ మెట్రో, అదిలాబాద్ వెనుకబడిన ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప.. రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగొద్దు. దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు వేములవాడ, కొండగట్ట, ధర్మపురి, భద్రాచలం ఆలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహాకుంభ మేళాకు కేంద్రం 2100 వంద కోట్లు ఇచ్చింది.వన్ ట్రిలియన్ ఎకానమీ 2030 వరకు ఎలా సాధిస్తారో చెప్పాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొటేషన్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. గత బడ్జెట్లో ఇండ్ల లెక్కలు 6లక్షలు అన్నారు.. ఈ సారి 5లక్షలు అంటున్నారు. కేంద్రంతో సఖ్యత అంటున్నారు..మరి ఏం సాధించారో చెప్పాలి. మా ప్రభుత్వం పోగానే ల్యాండ్ క్యూజర్లు కొన్నారని విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు సీఎం,మంత్రులు వినియోగిస్తున్నారని’ అన్నారు. -
తొలి సంతకం నేనే చేస్తా.. అవయవదానానికి ముందుకొచ్చిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలన్న కేటీఆర్.. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్‌కు కేటీఆర్ సూచించారు. అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో కేటీఆర్ ప్రకటించారు. అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు.ఎంతో ఉపయోగకరం.. అభినందనలు: హరీష్రావుఅవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు...ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే. బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపాం. దేశంలో అత్యధిక అవయవదానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం.తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది. ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వచ్చేది. బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవమార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవమార్పిడిలు చేశాం. 20 లక్షల ఖర్చయ్యేవి నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో చేశాం. సంవత్సరం పాటు మందులు కూడా ఇచ్చాం. కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది’’ అని హరీష్‌రావు వివరించారు. -
అసెంబ్లీలో మరోసారి రచ్చ రచ్చ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్, ఎంఐఎం నిరసనకు దిగాయి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదని ఆందోళన చేపట్టాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై నిరసన చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరసనను విరమించుకోవాలి సభకు సహకరించాలి. అసెంబ్లీ నిబంధనలను ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు తెలుసుకోవాలని శ్రీధర్‌బాబు అన్నారు.మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో కేసు నడుస్తుండగా సీఎం రేవంత్ సభలో మాట్లాడారని.. అది రూల్స్‌కు వ్యతిరేకమన్నారు. కోర్టులో కేసు నడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తీర్పు ఇచ్చారు. తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందా? రేవంత్ ఇస్తారా?. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి ప్రివిలేజ్ కిందికి వస్తది. సీఎం వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేశాం. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. మాకు అవకాశం ఇవ్వనందున సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సూచనల కోసం మైక్ ఇవ్వాలని సీఎం సూక్తులు చెప్పారు. సూచనలు చెప్తాం.. అంటే మైక్ ఇవ్వడం లేదు. బెట్టింగ్ యాప్‌ను గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ పదిహేను నెలల్లో బ్యాటింగ్ యాప్స్‌ను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 50 శాతం సీసీటీవీలు పనిచేయడం లేదు. పోలీస్ వాహనాలకు డీజీల్ కోసం ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి, కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం
-
నువ్వు కూర్చో.. పార్టీ మీ ఆయనది
పట్నా: బిహార్ శాసన మండలిలో మంగళవారం సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీదేవి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్సీలు పచ్చ రంగు బ్యాడ్జీలు ధరించి సభలోకి రావడం, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సీఎం నితీశ్ కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీల బ్యాడ్జీలను మీడియాకు చూపుతూ ఆయన..ఇలాంటివి ఆర్జేడీలోనే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.ఆ పార్టీ నేత, మాజీ సీఎం రబ్డీదేవి జోక్యం చేసుకునేందుకు యత్నించగా నితీశ్ బిహారీ యాసలో..‘నువ్వు కూర్చో..నీకేమీ తెలియదు. ఆర్జేడీ నీదికాదు, నీ భర్తది. ఈ విషయంలో నీ జోక్యం వద్దు’అంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ‘ఈమెకు ఏమీ తెలియదు. కష్టాల్లో చిక్కుకు న్నప్పుడు భర్త(లాలూ)ఈమెను సీఎంను చేశాడు’అని పేర్కొన్నారు. 1997లో సీఎంగా ఉన్న లాలు ప్రసాద్ దాణా కుంభకోణంలో ఇరుక్కుని, సీఎం కుర్చీపై భార్య రబ్డీని కూర్చోబెట్టడం తెల్సిందే.ఇటీవలి కాలంలో రబ్డీదేవి, నితీశ్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గంజాయి మత్తులో సభకు వచ్చిన సీఎం నితీశ్, నాతోపాటు మహిళలను సైతం అవమానిస్తూ మాట్లాడారు’అంటూ రబ్డీదేవి ఆరో పించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన నితీశ్ జాతీయ గీతాలాపనను పట్టించుకోకుండా పక్కనున్న వారి తో సరదాగా మాట్లాడుతూ కన్పించడంతో ‘మానసికంగా అనర్హుడు’ అంటూ రబ్డీదేవి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. -
Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను కూడా సీఎం రేఖ గుప్తానే పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేఖా గుప్తా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) కంటే ఈ బడ్జెట్ 31.5 శాతం అధికం. ఈ బడ్జెట్లో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏఏ వరాలను అందించిందంటే..ఆరోగ్య బీమాఢిల్లీ ప్రజలకు ఇకపై రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందుతుందని ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కోసం బడ్జెట్లో రూ.5,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతీనెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు.ఢిల్లీ బడ్జెట్లోని కీలక ప్రకటనలుమూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత బడ్జెట్లో మూలధన వ్యయం రూ. 15 వేల కోట్లుగా ఉండగా, ఈ బడ్జెట్లో దానిని రూ. 28 వేల కోట్లకు పెంచారు.త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ యోజన అమలు.ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జన ఆరోగ్య యోజనకు అదనంగా మరో రూ. ఐదు లక్షలు జత చేస్తుంది. అంటే రూ. 10 లక్షల కవర్ అందుతుంది. ఈ పథకానికి ₹2144 కోట్లు కేటాయించారు.మహిళా సమృద్ధి యోజనకు రూ.5,100 కోట్లు కేటాయింపు.ప్రసూతి వందన పథకానికి రూ.210 కోట్లు. నీరు, విద్యుత్, రోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు.ఢిల్లీ రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఎన్సీఆర్తో అనుసంధానం కోసం రూ.1,000 కోట్లు ఖర్చు.మహిళల భద్రత కోసం అదనంగా 50 వేల సీసీటీవీల ఏర్పాటు.జేజే కాలనీ అభివృద్ధికి రూ.696 కోట్లు కేటాయింపు.ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి రూ.20 కోట్లు కేటాయింపు.100 చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు. ఇందుకోసం రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు.ఢిల్లీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో పాటు గిడ్డంగి విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.సింగిల్ విండో వ్యవస్థ అమలు.పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి.వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ.ఇది కూడా చదవండి: Bihar: ఆగని పోస్టర్ వార్.. సీఎం నితీష్ టార్గెట్ -
బడ్జెట్ పై 'సభ'భగలు
⇒ ఆర్థిక మాంద్యం కాదు.. మీ బుద్ధి మాంద్యం: మాజీ మంత్రి హరీశ్‌రావు ⇒ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం⇒ అంతా తనకే తెలుసనుకునే సీఎం ⇒అజ్ఞానంతో ఆదాయం దిగజారింది⇒పాలన చేతకాక నెగెటివ్ రిజల్ట్.. బడ్జెట్ అంకెలు, లెక్కలన్నీ ఉత్తవే ⇒ఆరు గ్యారంటీలకు దిక్కులేదు గానీ.. అందాల పోటీలా? ⇒అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికే వస్తుందిసాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇది పాలకుల బుద్ధి మాంద్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇచ్చిన హామీలను అమలు చేసే దిక్కులేదు, వాటికి సరిపడా ఆదాయం లేదని ప్రభుత్వమే చెప్తోంది. ఆదాయం ఎందుకు లేదంటే ఆర్థిక మాంద్యం అంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉంటుంది? ఇది ఆర్థిక మాంద్యం కాదు..పాలకుల బుద్ధిమాంద్యం. అంతా తనకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం దిగజారింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం మాటెత్తుకున్నారు..’’అని పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శుక్రవారం ఆయన బీఆర్ఎస్ పక్షాన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు హరీశ్‌రావు మాటల్లోనే... ఇది దిగజారుడు రాజకీయం రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో భూములను తెగనమ్మి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని భూములమ్మితేనే గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.50 వేల కోట్లు లక్ష్యంగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇది దిగజారుడు రాజకీయం కాదా? పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రైజింగ్ తెలంగాణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు నిర్వహిస్తారట. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల విధ్వంసం.. రాష్ట్రంలో వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద, మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన తిండి లేక హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా హయాంలో గురుకులాల సంఖ్యను 289 నుంచి 1,020కి పెంచి బలోపేతం చేస్తే.. ఇప్పుడు వాటి లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చారు. దీనితో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అన్ని వర్గాలను మోసం చేశారు గతేడాది రూ.2,91,159 కోట్లుగా గొప్పగా చెప్పుకున్న బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ కాదని నేను అప్పుడే చెప్పాను. రివైజ్డ్ బడ్జెట్ అంకెల్లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపటం ద్వారా అదే నిజమని తేలింది. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు పేదల రక్తమాంసాలు పిండి ఎల్ఆర్ఎస్ వసూలుకు సిద్ధమయ్యారు. ఫార్మాసిటీకి మేం భూములు సేకరిస్తుంటే తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ పేరుతో అదనంగా మరో 14 వేల ఎకరాలు లాక్కుంటున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. సభకు క్షమాపణ చెప్పండి.. గత బడ్జెజ్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి ఈ 16 నెలల్లో నాలుగు ఇళ్లు కూడా నిర్మించలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష అదనంగా ఇస్తామని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తలేదు. ఇది దళిత, గిరిజనులను మోసం చేయడం కాదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ కేలండర్ అమలుచేస్తామని చెప్పి జాబ్‌లెస్ కేలండర్‌గా మార్చారు. దాని సంగతేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తే అశోక్‌నగర్‌లో వారి వీపులు పగలగొడుతున్నారు. తుదిదశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులని బడ్జెట్లో ప్రస్తావించారు కదా.. ఆ ప్రాజెక్టుల పేర్లేమిటో చెప్పండి.లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న మొదటి సంవత్సరంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఎన్నికల ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ప్రకటనలు చేసి.. ఇప్పుడు మేమిచ్చి న నోటిఫికేషన్‌కు 5 వేల పోస్టులు మాత్రమే పెంచి దగా డీఎస్సీ చేశారు. ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు.. కేసీఆర్ ముల్కీ రూల్స్ నుంచి 610 జీవో కోసం పోరాడి స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసి.. తొమ్మిదిన్నరేళ్లలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చారు. మా హయాంలో ఇచ్చి న నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు పంచటం తప్ప కొత్త ఉ ద్యోగాల కల్పన ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 57 వేల ఉద్యోగాల్లో 50 వేలు మా హయాంలోనివే. ఈ ప్రభుత్వం ఆరు వేలు కూడా భర్తీ చేయలేదు. రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమ దుకాణం) అంటుంటే.. రేవంత్ మాత్రం నఫ్రత్ కా మాకాన్ (విద్వేషాల ఇల్లు) అంటున్నారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాటిని వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారా? ‘‘ఐదేళ్లలో వడ్డీ లేని రుణాల కింద రూ.లక్ష కోట్లు అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉంటే ఆ ఉత్తర్వులు సభ ముందుంచాలి. లేని పక్షంలో సభను తప్పుదోవ పట్టించినందుకు సభకు క్షమాపణ చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామంటున్నారు. వాటిని వడ్డీ లేని రుణాలుగా పరిగణిస్తారా చెప్పాలి?’’ పాలనా వైఫల్యాలతో దెబ్బతిన్న పురోగతి‘‘జీఎస్టీ వృద్ధిరేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం తగ్గడం, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల.. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గింది. కేసీఆర్ హయాంలో దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా, దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గాయి. ఫార్మా సిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రద్దు, హైæడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ, మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా, ఆర్ఆర్ టాక్స్‌లు, సంక్షేమ పథకాల అమలు సరిగా లేక గ్రామాలకు ద్రవ్య ప్రవాహం తగ్గడం, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం.. ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వృద్ధి రేటు మందగించింది. పరిస్థితి ఇలా ఉంటే, బడ్జెట్లో మాత్రం ఘనమైన అంకెలు చూపి ప్రజలను మోసం చేస్తున్నారు.ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది?: భట్టి విక్రమార్క⇒ బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ ⇒ ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే... మీరు చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం ⇒ పదేళ్లు ఎంతో అవమానించారు.. మౌనంగా భరించాం ⇒ అన్నీ అనుభవించే ఇక్కడకొచ్చాం.. మీరెన్ని మాట్లాడినా బాధపడంసాక్షి, హైదరాబాద్: ‘‘గత పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏం సాధించారు? నాగార్జునసాగర్ నిర్మించారా? ఎస్సారెస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు వంటివేమైనా నిర్మించారా? హైటెక్ సిటీ కట్టారా? ఏం చేశారయ్యా అంటే కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం ఏమైందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇక మీరు చెప్పడానికేముంది? సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసి, వ్యవస్థలను నాశనం చేసిన మీరు.. వాస్తవిక బడ్జెట్‌ను పెట్టిన మమ్మల్ని విమర్శిస్తారా?’’ అని బీఆర్ఎస్పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు శుక్రవారం రాత్రి శాసనసభలో, శాసన మండలిలో భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు చేసిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. భట్టి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చూపినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016–17లో రూ.8వేల కోట్లు, 2018–19లో రూ.40 వేల కోట్లు, 2021–22లో రూ.48 వేల కోట్లు, 2022–23లో రూ.52 వేల కోట్లకుపైగా, 2023–24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు.మేం మీలాగా బడ్జెట్‌ను ప్రతీసారి 20 శాతానికిపైగా పెంచుకుంటూ పోలేదు. అలా పెంచితే ఈసారి బడ్జెట్ రూ.4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది. మేం అలా చేయకుండా.. వాస్తవాల మీద బడ్జెట్ పెట్టాం. మీరు ఆదాయం ఉన్నా, లేకున్నా పెంచుతూ పోయారు. ఔటర్ రింగ్‌రోడ్డును రూ.7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేశాం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అమ్మకాల ద్వారా రోజుకు కోటిన్నర ఆదాయం వచ్చేది. 30 వేల టన్నులు అమ్మేవారు. ఆరేడు నెలలుగా సీరియస్‌గా దృష్టి పెట్టాం. ఇసుక మాఫియాను కట్టడి చేశాం. రోజుకు 70 వేల టన్నులు అమ్ముతున్నాం. ఆదాయం రోజుకు రూ.3 కోట్లకు పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయాం. పదేళ్లలో రూ.6 వేల కోట్ల ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మాఫియాలను కట్టడి చేస్తాం. ఆదాయం పెంచుతాం. అవమానాలను పదేళ్లు మౌనంగా భరించాం రైతు రుణమాఫీ కింద పదేళ్లలో మీరు రూ.28,053 కోట్లు ఇస్తే.. మేం నాలుగు నెలల్లోనే రూ.20,617 కోట్లు ఇచ్చాం. మీరు జాప్యం చేయడంతో రైతు రుణమాఫీ కంటే వడ్డీల కింద రూ.13 వేల కోట్లు జమ చేసుకున్నారు. నిర్బంధం, స్వేచ్ఛ, నిరంకుశత్వం గురించి మీరా మాట్లాడేది? ఏ ఒక్కరోజైనా సభను ప్రజాస్వామికంగా నడిపారా? నేను పదేళ్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, సీఎల్పీ నేతగా అక్కడ కూర్చుని ఉంటే ఎంత అవమానించారో తెలియదా?తలవంచుకుని భరిస్తూ, మీకు సహకరించామే తప్ప అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడలేదు. సభాపతి, సభా నాయకుడు, ప్రభుత్వం గురించి తూలనాడలేదు. మేం పడిన అనుమానాలు ఈ సభలో ఎవరూ పడి ఉండరు. అయినా సభ ఔన్నత్యాన్ని కాపాడాం. అన్నీ చూసే ఇక్కడికి వచ్చాం.. మీరెన్ని మాట్లాడినా, రన్నింగ్ కామెంట్రీలు చేసినా బాధపడేది లేదు. అవన్నీ చూసి చూసి, అనుభవించి ఇక్కడకు వచ్చాం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలందరికీ లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు బరాబర్ ఇస్తాం. రాష్ట్రంలోని మహిళలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేట్టు చేయాలన్నదే మా ప్రభుత్వం. సీఎం ఆలోచన. మేం ఉద్యోగాలు రాని పిల్లలకు రాజీవ్ యువ వికాసంతో రూ.6 వేల కోట్లు ఇవ్వబోతున్నాం. బ్రాహ్మణ పరిషత్‌కు రూ.50 కోట్లు ఉండే.. ఇంకో 50 కోట్లు కలిపి ఇచ్చాం. వైశ్యులు కార్పొరేషన్ కావాలని అడిగితే మీరు ఇవ్వలేదు. మేం రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25 కోట్లు ఇచ్చాం..’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్నీ ఉత్త మాటలే.. పదేళ్లలో కృష్ణానది, గోదావరి నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లందించారా? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. పదేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ.1,81,877 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు చేయలేదు. దళితబంధు గురించి బడ్జెట్లో రూ.17,700 కోట్లు పెట్టి ఒక్క రూపా యి అయినా విడుదల చేశారా? అమాయకులైన గిరిజనులను ఆడవాళ్లని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టించారు. మేం సబ్‌ప్లాన్ నిధులను తు.చ. తప్పకుండా ఖర్చు చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు.మీ అప్పులే కడుతున్నాం స్వామీ.. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. ఈ ఏడాది రూ.1,58,041 కోట్ల అప్పులు తెచ్చి .. రూ.1,53,359 కోట్ల మేర గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కింద చెల్లించాం. మీరు చేసిన అప్పులు తీర్చలేక, తప్పులు సరిదిద్దలేక, నిద్రలేక చస్తున్నాం. మీ అప్పులే కడుతున్నాం స్వామీ. తెచ్చి న అప్పుల్లో కట్టిన అప్పులు పోను ఈ సంవత్సరానికి మా ప్రభుత్వం అవసరాల కోసం వాడుకున్నది రూ.4,682 కోట్లు మాత్రమే. మీలాగా నాలుగు గోడల మధ్య బంధించుకుని ఎవరికీ ఏమీ చెప్పకుండా, ఎవరినీ కలవకుండా మూసేసి పాలన చేయదల్చుకోలేదు. మా ప్రభుత్వం 24/7 తలుపులు తెరిచి ఉంటాయి. -
‘మహాలక్ష్మి పథకం లేదు కానీ.. అందాలు పోటీలకు మాత్రం సిద్ధం’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రతీ విషయంలోనూ పారియిందంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయింది. శాసన సభ చరిత్రలో చీకటి రోజు. ప్రభుత్వం తలుపు లు తెచిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి... కేవలం 20 శాతం కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు హరీష్.ప్రభుత్వం 20 శాతం కమిషన్ అడుగుతుందని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్మ చేశారు. ఉద్యోగుల విషయంలో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారు. 2 లక్షల ఉద్యోగలా గురించి ప్రశ్నిస్తే సభను వాయిదా వేసి పారిపోయారు. ఎల్ఆర్ఎస్ అంశంలో భట్టి విక్రమార్క దాట వేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తే డబ్బులు చెల్లించాల్సిదేని భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. బీఆర్ఎస్ అప్పులపై లెక్కలు చూపించాలంటే పారిపోయారు. కాంట్రాక్టర్లు అంటే పెద్ద పీట .. ఉద్యోగులు అంటే చిన్నచూపు. మహాలక్ష్మి పథకం అమలు లేదు కానీ.. అందాల పోటీలు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయింది. సభలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పారిపోయింది’ హరీష్ విమర్శనాస్త్రాలు సంధించారు. -
కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర గందరగోళం
-
బడ్జెట్ పై వాడి వేడి చర్చ
-
‘భూమికి మూడు ఫీట్లు లేరుగాని.. అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు’
సాక్షి,సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆరే మరోసారి సీఎం అవుతారు. భూమికి మూడు ఫీట్లు లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.గ్రామ సింహాలు కూడా సింహాల్లా మాట్లాడుతున్నాయి. కేసీఆరే లేకపోతే తెలంగాణనే లేదనేది అక్షర సత్యం. మూడు పాత్రల్లో విజయవంతం అయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ పార్టీ.బీఆర్ఎస్ అధికారంలో రావాలని కోరుకునేది ప్రజల కోసమే. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకునే పనికాకుండా పర్సంటేజీలు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. -
తెలంగాణ బడ్జెట్ వేళ.. ఎండిన వరి కంకులతో BRS నిరసన
-
జగన్ పై వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో చంద్రబాబు నీచపు బుద్ది
-
బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి చురకలు
-
జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను పునఃసమీక్షించాలి: హరీష్ రావు
-
బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
అసెంబ్లీలో స్టార్ హీరోయిన్‌పై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ యాక్టర్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (madhuri dixit) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫొటోలు దొరకలేదా? షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన నటులంతా ఆ కోవకే చెందుతారంటూ తన నోటికి పనిచెప్పారు. ప్రస్తుతం సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్.. రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డ్‌ల ఫంక్షన్‌పై బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారం జుల్లీ (Congress MLA Tikaram Jully) అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఐఫా (IIFA Awards 2025) ఉత్సవాల్ని నిర్వహించింది. ఐఫా పేరిట దేనికి ఎంతెంత? ఖర్చు పెట్టారో లెక్కలు బయటకు తీయాలి. మీరు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా లేదు. ఐఫాను ప్రమోట్ చేస్తునట్లుంది.ఐఫా వల్ల రాష్ట్రానికి ఏ ఒరిగింది? ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్ట్ ప్రాంతాల్ని సందర్శించారా? సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరు? నాకు తెలిసి షారుఖ్‌ఖాన్ మినహా మిగిలిన వాళ్లందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్లే. ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లేదే? అని వ్యాఖ్యానించారు.దీంతో ఎమ్మెల్యే టికారం జుల్లీ వ్యాఖ్యల్ని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ప్రతి స్పందనగా.. అవును మాధిరి దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్. నాటి దిల్, బేటా సినిమాలకు మాత్రమే ఆమె స్టార్. ఆమె ఎరా ఎప్పుడో ముగిసింది’అని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు.కొద్ది రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత షామా మొహమ్మద్ (shama mohamed) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. షామా తన ట్వీట్లో రోహిత్ శర్మ (rohit sharma) ఫిట్‌గా లేడు! బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే’ అని రాసుకొచ్చింది. ఆమె చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.భారతీయులు రోహిత్ శర్మకు మద్దతు పలుకుతూ షామాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు తట్టుకోలేక దెబ్బకు దిగొచ్చారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును విజయపథం వైపు నడిపించారంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. -
ఇదే మా సవాల్.. మీ సవాల్‌కు మేము కూడా సిద్ధమే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై ఎవరైనా చర్చకు వస్తారేమో రండి.. అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులకు పొన్నం సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ల మధ్య ఇదే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చర్చకు రావాలంటూ పొప్నం సవాల్ చేశారు.పొన్నం ప్రభాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.దీనికి కౌంటర్ గా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర బీజేపీ లేఖ విడుదల చేయాలి. మూసీకి నిధులు ఇవ్వాలి, మూసీకి నిధులు ఇవ్వాలి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకూ రైల్వే లైన్ ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చేలాగ రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేయాలి’ అని పొన్నం స్పందించారు. -
జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై హరీష్ రావు కామెంట్స్
-
జగదీష్‌రెడ్డి సస్పెన్షన్.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్‌రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘జగదీష్‌రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్‌పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్‌రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్👉వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ వాకౌట్ -
AP Budget 2025: చంద్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా? -
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
సీఎం గారు నిద్ర లేవండి.. మనం అసెంబ్లీలో ఉన్నాం
ఢిల్లీ : ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రేఖా గుప్తాను టార్గెట్ చేసింది. మొన్నటికి మొన్న సీఎం క్యాంప్ ఆఫీసులో రేఖాగుప్తా బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాల్ని తీసేయించారని ఆరోపణలు గుప్పించింది. ఆప్ నేత అతిషీ మర్లేనా ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆప్ మరోసారి సీఎం రేఖా గుప్తాను ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో 1౩ సెకన్ల వీడియోను షేర్ చేస్తూ ఇక్కడ నిద్ర పోతున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. తమకు సేవ చేయాలని ఢిల్లీ ప్రజలు రేఖాగుప్తాను అసెంబ్లీకి పంపించారు. కానీ అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో సీఎం గారు నిద్రపోతున్నారు’అని సెటైర్లు వేసింది. అంతేకాదు, సీఎం గారు అంబేద్కర్,భగత్ సింగ్‌ను అవమానించడంలో మీరు కొంత సమయం తీసుకున్నట్లయితే, దయచేసి అసెంబ్లీ చర్చపై కూడా కొంచెం దృష్టి పెట్టండి’అని వ్యాఖ్యానించింది. ఇక ఆప్ షేర్ చేసిన వీడియోలో సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాల్ని చూడొచ్చు.CM मोहतरमा के दो रूप‼️1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना 2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025అయితే, ఆప్ షేర్ చేసిన వీడియోపై రేఖా గుప్తా అభిమానులు, బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. మా సీఎం అసెంబ్లీ చర్చను కళ్లుమూసుకుని శ్రద్దగా వింటున్నారని, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ఆప్ కావాలనే టార్గెట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. -
మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
సాక్షి, అమరావతి : మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నా.. చేయలేమని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వేరే రాష్ట్రాలనుంచి మిర్చి వస్తుంది కాబట్టి..మిర్చి విషయంలో మార్కెట్లో జోక్యం చేసుకోలేమని తేల్చేశారు. అదే సమయంలో ఇ-క్రాప్ ఆధారంగా రైతులవారీగా సబ్సిడీ ఆలోచన చేస్తామన్నారు. అదికూడా ఆలోచనలోనే ఉందన్నారు. అయితే, మరి అదే ఇ-క్రాప్ ఆధారంగా మార్కెట్లో జోక్యం ఎందుకు చేసుకోలేకపోతున్నారని, రైతుకు మంచి ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
సాక్షి,కాకినాడ: ‘ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అన్నా.. వైఎస్ జగన్ అన్నా భయమే.’ వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సభా మర్యాదలు చూస్తే చిత్రంగా ఉంది. సభా మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టుంది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను పదవి లోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు.మాజీ గవర్నర్ నరసింహన్ చంద్రబాబును చూసి బిత్తరపోయారు. హరిచందన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏవిధంగా కించపరిచారో అందరికి తెలుసు. వీళ్లా సభలో వైఎస్సార్సీపీ గవర్నర్‌కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు. నిరనసగా వాకౌట్ చేసి వెళ్లి పోవడం చాలా కాలం నుంచి నడుస్తోంది. చాల పార్టీలు చేస్తున్నాయి. ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలుసుకోండి. గ్రూప్-2 అభ్యర్ధులైతే..తాము తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆబద్దాలు చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు అని తేలింది. ఒక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లి దానిని నిజమని నమ్మిస్తారు. ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లు కూటమీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడానికి సిగ్గులేదా?. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నారు.వీసీలను రాత్రికి రాత్రి బెదిరించి రాజీనామాలను చేయించారు. దీనిపై విచారణ జరిపించండి. తొమ్మిది నెలల కాలంలో మీ అసలు రంగు బయట పడింది. ప్రతిపక్ష హోదా మీద పార్లమెంటు చట్టం ఏం చెప్పిందో తెలుసుకోండి.వైఎస్సార్సీపీ అంటే మీకు భయం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మీ పాలనను ఎండగడతారని భయం. 151 సీట్లు వచ్చినా..11 సీట్లు వచ్చినా టీడీపీ వైఎస్ జగన్ చూసి భయపడుతోంది. ఆ ఒకే ఒక్కడు 49% ఓటు బ్యాంక్ పొందారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే అని అన్నారు. -
సాక్షి టీవీ సహా 4 ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
-
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి.. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున పోరాటం ఆపం
-
రేపు అసెంబ్లీకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
-
బీసీలు తగ్గిందెక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా, బీసీల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలనే చిత్తశుద్ధితో కులగణన సర్వే జరిపామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నివేదికకు ఎలాంటి ప్రామాణికత లేదని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కేవలం ఎంసీఆర్హెఆర్డీ వెబ్సైట్లో తప్ప మరెక్కడా అందుబాటులో లేకుండా చేశారని పేర్కొన్నారు.వాళ్లు చేశారని చెపుతున్న సర్వేలో కూడా బీసీల జనాభా 1,85,61,856 మంది అంటే 51 శాతం మాత్రమే కాగా, తాజా కులగణన సర్వేలో బీసీల సంఖ్య 56.33 శాతమని తేలిందని, అలాంటప్పుడు తగ్గింది ఎక్కడో చెప్పాలని సీఎం అన్నారు. ఇక ఓసీలు 71,18,858 మంది అంటే 21 శాతం కాగా, ఇప్పుడు తాము శాస్త్రీయంగా చేసిన సర్వేలో 15.7 శాతంగా తేలిందని తెలిపారు. అలాగే అప్పుడు ఎస్సీలు 18 శాతం కాగా ఎస్టీలు 10 శాతమని చెప్పారు. ముస్లిం కేటగిరీనే చూపించలేదన్నారు. శాసనసభలో మంగళవారం సమగ్ర కుల గణనపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష పారీ్టలు దానిపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. బీసీల జనాభాను తగ్గిస్తే నాకు లాభమేంటి? ‘బీసీల జనాభాను తగ్గిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? దీనిపై అనవసరంగా అపోహాలు సృష్టించవద్దు. ఎక్కడిదో పోగేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు సర్వే చేసి మంత్రివర్గానికి, శాసనసభకు నివేదికను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? కులగణనలో పాల్గొనని వారికి సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వొద్దు. తమ లెక్కలు బయటపడతాయనే కేసీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ వంటి వారు తమ వివరాలు ఇవ్వలేదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు తీశారు.2011 తర్వాత 14 ఏళ్లుగా జనాభా లెక్కలు లేవు. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి నెలకొంది. రాహుల్‌గాంధీ పార్లమెంటులో డిమాండ్ చేసినా స్పందన లేదు. అబద్ధాల సంఘం (బీఆర్ఎస్ను ఉద్దేశించి) ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 2014 డాక్యుమెంటును మీరెందుకు బహిర్గతం చేయలేదు? ఒక కుటుంబం కోసం చేసిన సర్వే అది. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశాం. ఇవే అధికారిక లెక్కలు. వీటికి కట్టుబడి ఉంటాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అది సాధ్యమయ్యే అవకాశం ప్రస్తుతానికి లేదు.రాజ్యాంగ సవరణ జరిగే వరకు పార్టీ తరఫున 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తాం. ఇందుకు మా పీసీసీ అధ్యక్షుడిని కూడా ఒప్పించా. మీరు సిద్ధమా? బీజేపీ, బీఆర్ఎస్ తేల్చుకోవాలి..’అని సీఎం సవాల్ విసిరారు. ‘కుల గణన సర్వే నివేదికను సభ ముందుంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, సర్వే నివేదిక మొత్తం నాలుగు పుటలుగా ఉంది. ఇందులో మూడు పుటలు కులగణన, ఇతర వివరాలు కాగా నాలుగో భాగంలో ప్రజల వ్యక్తిగత వివరాలున్నాయి. వీటిని బయటపెట్టడం చట్ట రీత్యా నేరం. కాబట్టి మిగతా మూడు పుటలను సభ ముందు ఉంచడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. -
రిజర్వేషన్లు లేకుండా ఎందుకీ నివేదిక?
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా ప్రత్యేక సమావేశాలు పెడితే 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తారని అందరూ అనుకున్నారని, తీరా ప్రయోజనం లేని నివేదిక పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు. కులగణనపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రేవంత్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వొద్దని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చారని, 57 రకాల వివరాలను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తాం? అని మాట్లాడారని కేటీఆర్ తెలిపారు.2014లో తాము ప్రభుత్వ అధికారులతోనే సర్వే చేయించామని, ఇది ముమ్మాటికీ అధికారిక పత్రమేనన్నారు. దాన్ని ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్లో పెట్టామని చెప్పారు. తమ హయాంలో నిర్వహించిన సర్వేలో 1.03 కోట్ల కుటుంబాలు, 3.68 కోట్ల జనాభా పాల్గొన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1,85,61,856గా ఉందని, బీసీలు 51 శాతం ఉన్నారని, ముస్లిం బీసీలు 10 శాతం కలుపుకుంటే 61 శాతమని పేర్కొన్నారు. 51 శాతం ఉన్న బీసీల సంఖ్య 46 శాతానికి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీనే ఈ సర్వే తప్పుల తడకగా ఉందని దాన్ని తగలబెట్టండని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే సభలోనూ చెప్పారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, బలహీన వర్గాలకు చేసిన ద్రోహానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించారు. షెడ్యూల్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణను స్వాగతిస్తూనే, బీసీలకు చేసిన ద్రోహానికి వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, చింతా ప్రభాకర్, సీహెచ్.మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు బీసీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ డౌన్‌డౌన్ అంటూ నినదిస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై చర్చపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతుకోసిన ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ప్రభుత్వం వర్గీరణ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని తెలిపారు. సభ వాయిదాపై అభ్యంతరం: మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభాపతి చాంబర్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కోవా లక్ష్మి, కౌశిక్‌రెడ్డి, చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటి? కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. నేడు పాలకపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు’ అని పేర్కొన్నారు.వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ‘అసెంబ్లీలో ఓవైపు సమగ్ర కుటుంబ సర్వే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఎంసీహెచ్ఆర్డీ వెబ్సైట్ నుంచి సర్వే నివేదికను అధికారులు మాయం చేశారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వెల్డన్ తెలంగాణ సీఎంఓ.. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్’ అని ఎద్దేవా చేశారు. -
స్వతంత్ర భారత్‌లో ఇదే తొలి కులగణన
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన, బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్దేశించిన తొలి సమగ్ర కుల గణన, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలోనే జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రిమండలి కులగణన సర్వే ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటే, సరిగ్గా సంవత్సరానికే దీనిపై నివేదిక శాసనసభ ముందుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగు పరిచేందుకు, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం కోసం ఈ సర్వేను చేపట్టినట్లు పేర్కొన్నారు.దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల జనాభా లెక్క తేలిందని తెలిపారు. ఇది భవిష్యత్‌కు మోడల్‌గా మారుతుందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ నివేదికే ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశా రు. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ నివేదికపై మంగళవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం ప్రకటన చేశారు. ఇదే కచ్చితమైన, శాస్త్రీయమైన సర్వే.. ‘దేశంలో 1931లో జరిగిన కులగణన తర్వాత మళ్లీ ఏ రాష్ట్రంలోనూ కులగణన జరగలేదు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలే ఉండేవి. దీంతో వెనుకబడిన, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై హామీ ఇచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఈ సర్వే చేపట్టాం.గతంలో బిహార్ వంటి రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క వంటి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం. సర్వేకు శ్రీకారం చుట్టాం. దీనిపై అధ్యయనం చేయించాం. మేమెంతో మాకంత ఇవ్వమన్న ఆయా వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా రూ.160 కోట్లు వెచ్చించి సర్వే చేశాం. ఇదే కచ్చితమైన, శాస్త్రీయమైన సర్వే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలతో సర్వే షెడ్యూల్ ‘వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, సర్వే షెడ్యూల్, ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాల ఆధారంగా సర్వే షెడ్యూల్ రూపొందించాం. సర్వే ఫామ్‌లో 57 ప్రశ్నలు ఉండగా, అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 విభాగాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక్కొక్కటి 150 కుటుంబాలతో కూడిన 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పా టు చేశాం. ప్రతి బ్లాక్‌కి ఒక ఎన్యూమరేటర్‌ను, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ని నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు..’ అని సీఎం తెలిపారు.క్షేత్ర స్థాయిలో సర్వే.. ‘రాష్ట్రంలో 2024 నవంబర్ 6న సర్వే ప్రారంభమై 2024 డిసెంబర్ 25తో పూర్తయింది. హౌస్–లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457 కాగా 1,12,15,134 కుటుంబాల సర్వే జరిగింది. అంటే సర్వే కవరేజ్ 96.9 శాతం. వివిధ కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323. ఇవి జీహెచ్ఎంసీ, ఇతర నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయగా, సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీల్లో 61,84,319 మందిని (17.43 శాతం), ఎస్టీల్లో 37,05,929 మందిని (10.45 శాతం) ముస్లిం మైనారిటీ మినహా బీసీల్లో 1,64,09,179 మందిని (46.25 శాతం), ముస్లిం మైనారిటీ బీసీలు 35,76,588 (10.08 శాతం) మందిని, ముస్లిం మైనారిటీల్లో మొత్తం 44,57,012 (12.56 శాతం) మందిని సర్వే చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 (2.48 శాతం) మంది కాగా ఓసీలు 56,01,539 మంది (15.79 శాతం), ముస్లిం మైనారిటీ మినహా ఓసీలు 47,21,115 (13.31శాతం) మంది ఉన్నారు. మొత్తం 3.70 కోట్ల జనాభాగా తేలింది..’ అని రేవంత్ చెప్పారు. -
59 కులాలు 3 గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభాకు రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది నవంబర్ 11నుంచి 82 రోజుల పాటు వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.సోమవారం (Monday) 199 పేజీలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పింపంచింది. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ఒక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011 జనగణన (Census) ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ కింద ఉన్న 59 కులాలను వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా మూడు గ్రూపులుగా కమిషన్ వర్గీకరించింది. గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చింది.మూడింటికి ఓకే.. ఒక సిఫారసుకు నో» ఎస్సీ వర్గీకరణ అమలుకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సిఫారసులు చేసింది. ఇందులో మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, ఒక సిఫారసును తిరస్కరించింది.» ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను కమిషన్ గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది.» ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. » మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963%ఉన్న వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది.» ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్–1 సర్వీ సుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్ కేటగిరీగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ వ్యక్తులకు సంబంధించి రెండో తరానికి రిజర్వేషన్ల ప్రయోజనం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అయితే ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.» ఇక ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు వన్‌మెన్ కమిషన్ ప్రాధాన్యత నమూనాను రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసిన అలాగే భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. -
‘సర్వే రిపోర్ట్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలే తగలబెట్టమన్నారు’
సాక్షి,హైదరాబాద్ : ‘సర్వే రిపోర్ట్‌ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ‘42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అధికారులకు గుర్తు చేశాం. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారు. ఆ డాక్యుమెంట్ అందుకే వెబ్‌సైట్స్‌లో పెట్టాం. సమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు. 51శాతం. ముస్లింలు 10 శాతం వాళ్లను కలిపితే మొత్తం 61 శాతం. కాంగ్రెస్ సర్వే రిపోర్ట్‌ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు.. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని అన్నారు. -
కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ: Revanth Reddy
-
రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీ మాతో కలిసి రావాలి: సీఎం రేవంత్
Telangana Assembly Updatesఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్..ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిఎస్సీలలో 59 కులాలు ఉన్నాయివీరికి 15 శాతం రిజర్వేషన్ ను కమిషన్ కేటాయించిందిఎస్సీల్లో అత్యంత వెనకబడిన కులాలకు 1% , మాదిగ , దిగ ఉప కులాలకు 9%, మాల ,మాల ఉప కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించింది.క్రిమిలేయర్ విధానాన్ని కేబినెట్ తిరస్కరించింది.ఎస్సీ వర్గీకరణ కమీషన్ సూచన మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తాంవైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసారు\మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.నా రాజకీయ జీవితంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ ద్వారా జీవితం పరిపూర్ణం అయింది.కులగణన ,ఎస్సీ వర్గీకరణ తో దేశం లోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవబోతుంది.42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరంరిజర్వేషన్లు అమలు కోసం మాతో కలిసి బిజెపి రావాలి.పిసిసి ఆమోదం తీసుకొని పార్టీపరంగా రిజర్వేషన్లను అమలు చేస్తాం.ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటనతెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. కమిషన్ సిఫారసు సారాంశాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను కమిషన్ గుర్తించింది. దాని ప్రకారం 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని సూచించింది.కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రానికి కోరుతూ తీర్మానం జరిపాం. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం. మిగితా రాష్ట్రాల కంటే ముందే ఎస్సీవర్గీకరణ అమలు చేస్తాం. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎస్సీ కులాలను గ్రూప్1,2,3గా వర్గీకరించాలని సిఫారసు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్‌ను 3 గ్రూపులకు పెంచుతూ సిఫారసు. గ్రూప్-1లో 15 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్ సిఫారసు. గ్రూప్-2లో 18 ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్ సిఫారసు. గ్రూప్-3లో 26 ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ సిఫారసు చేసినట్లు వ్యాఖ్యానించారు.అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే దేశానికి దిక్సూచి వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy) అన్నారు. కులగణనపై (telangana census survey) తెలంగాణ అసెంబ్లీ (telangana assembly) లో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల వివరాలు అడిగినందుకే బీఆర్ఎస్ నేతలు కులగణన సర్వేలో పాల్గొనలేదని అన్నారు. ‘అపోహల సంఘం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను తప్పుదోవ పట్టిస్తుంది. ఓ ఫేక్ డేటాను సర్క్యూలేట్ చేసి జనాభా ఎక్కువ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.గత ప్రభుత్వం సర్వే రికార్డులో 33వ పేజీలో జనాభా పై క్లారిటీ ఉంది చెక్ చేసుకోండి. 2014 సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం ఉంటే..ఇప్పుడు 56 శాతం ఉన్నారు. అదే ఓసీలు 2014 సర్వే ప్రకారం 21 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం ఉన్నారు. బీసీ జనాభా పెరిగింది కానీ..తగ్గింది అని ఎలా చెప్తారు.సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అధికారికమో కాదో హరీష్ రావు, కేటీఆర్ చెప్పాలి. అధికారం అని చెప్తే..దానిపైనే చర్చ చేద్దాం. కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు ,పద్మారావు ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ లాంటి వారు సర్వేలో పాల్గొనలేదు. భూమి వివరాలు అడిగినందుకే వీరంతా సమాచారం ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. సర్వేలో పాల్గొనండిజనాభా లెక్కించడం బీజేపీకి ఇష్టం లేదు. 2021లో జరగాల్సిన జనగణనను బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ను గత ప్రభుత్వం అధికారిక రిపోర్ట్‌గా ప్రకటించలేదు. 2011 జనాభా లెక్కలు మినహా.. ఏ అధికారిక లెక్కలు లేవు. అపోహలు సృష్టించే డాక్యుమెంట్స్ తెచ్చి సభ్యులు సభను తప్పుదోవ పట్టించుకోకండి. ఇప్పటికైనా సర్వేలో పాల్గొనని వారు వివరాలు ఇవ్వండి.1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదుఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు. అందుకే కులగణన చేశాం. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా కులగణన కొంత ఆలస్యం అయింది.వివిధ రాష్ట్రాలలో సర్వేలు చేసి..పకడ్బందీగా కులగణన చేశాం.లక్షకు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు. 76 వేల మంది ఉద్యోగులు డేటా ఎంట్రీ చేశారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎస్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే 56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి. కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎస్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే 56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి. కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు. -
ఆరేళ్ల తర్వాత తొలి బడ్జెట్
జమ్ము: కొంగొత్త ఆశలతో ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో తొలి అసెంబ్లీ సమావేశాలకు సమయాత్తమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 3నుండి ప్రారంభమై 21 రోజుల పాటు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 21న ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకశ్మీర్ కేబినెట్ మార్చి మొదటి వారం నుంచి సెషన్‌ను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు సిన్హా ఆమోదం తెలిపారని, మార్చి మొదటి వారంలో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.లెఫ్టినెంట్ గవర్నర్ మార్చి 3 నుంచి తొలి రాష్టబడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్ రహీమ్ రాథర్తో సంప్రదింపులు జరిపారు. ఇరువురి చర్చల అనంతరం అసెంబ్లీ కార్యదర్శి తెలియజేస్తారని, సమావేశాల ప్రారంభ తేదీ,వ్యవధిని చర్చిస్తారని సమాచారం. కాగా, జమ్మూ కశ్మీర్లో శాసనసభ లేకపోవడంతో మునుపటి ఐదు బడ్జెట్లను పార్లమెంటు ప్రవేశపెట్టింది. అయితే పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పతనం తర్వాత అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని 2019-2020 బడ్జెట్‌ను ఆమోదించింది. -
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
ఏంటా రహస్యం?.. అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే -
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్‌బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్‌కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్‌కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్‌ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: హరీశ్ రావు
-
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
-
రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశాన్ని ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో పయనించేలా మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించనుంది. దేశానికి మార్గం చూపిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం ఈ నెల 21న సభ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.అయితే సభను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఈ నెల 30న సోమవారం ప్రత్యేక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభించనున్నట్టు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశం ఒక్కరోజుకే పరిమితం చేయనున్నారు. మన్మోహన్‌ను కొనియాడుతూ తీర్మానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. ఈ క్రమంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆధునిక భారత దేశ ఆర్థిక సంస్కర్తగా పేరుగాంచిన మన్మోహన్‌కు ‘భారతరత్న’ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేత కేసీఆర్మాజీ ప్రధాని మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్లో కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు కూడా. ఈ నేపథ్యంలో మన్మోహన్ కృషిని కొనియాడుతూ, నివాళి అర్పించే అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేను తొక్కుకుంటూ వచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను నల్లమల నుంచి వచ్చా. క్రూరమృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చా. తొక్కుకుంటూ వచ్చా. ఇక్కడున్నోళ్లను తొక్కితే అక్కడ తేలిన్రు. నేను అయ్య పేరుమీదనో, మామ పేరుమీదనో వచి్చనోడిని కాదు. స్వశక్తిని నమ్ముకొని పైకొచ్చినవాడ్ని. అమెరికాలోనో, గుంటూరులోనో చదువుకున్న చావు తెలివితేటలు వాళ్లకుంటే ఉండొచ్చు. నాకు సామాన్యుడి తెలివితేటలు ఉన్నాయి. నా వ్యక్తిగత కోపతాపాలు చూపవద్దని ఇంతకాలం ఓపికతో ఉన్నా.ఈ ఆర్థిక విధ్వంసకారులను నియంత్రించే శక్తి, క్రూరమృగాలను కూడా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉంది’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు రేవంత్ మాటల్లోనే... ‘‘తెలంగాణపై కమిట్మెంట్ ఉన్నోళ్లు కూడా కొందరు అటువైపు ఉన్నారు. వారికి చెప్తున్నా.. దొంగలకు సద్దులు మోసేవాళ్ల సావాసం మంచిది కాదు. వాళ్లు ఇదే నగరంలో పుట్టినవారు. హైదరాబాద్ కూడా Éఢిల్లీలా కాలుష్యం కోరల్లో చిక్కుకోవాలా? నల్లగొండకు ఫ్లోరైడ్ నుంచి మోక్షం వద్దా? బావాబామ్మర్దులిద్దరూ రండి. నల్లగొండకో, రంగారెడ్డికో, భువనగిరికో, మునుగోడుకో, ఎల్బీనగర్కో, సూర్యాపేటకో పోదాం. మూసీ పునరుజ్జీవం చేయాలా? వద్దా? ప్రజలను అడుగుదాం. నేను, రాజగోపాల్‌రెడ్డి గన్‌మన్ లేకుండా వస్తాం. మీరూ రండి. జనం మధ్యనే తేల్చుకుందాం. వాళ్లలా ఇస్తే ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు భరోసాకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే రైతుబంధు కేవలం పెట్టుబడి సహాయ పథకం మాత్రమే. ఆ రూపంలో రూ.72,816 కోట్లు ఇస్తే.. అందులో రూ.22,606 కోట్లు సాగులోనే లేని రాళ్లురప్పలకు, గుట్టలకు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమల స్థలాలకు ఆయాచితంగా చెల్లించారు. గిరిజనులకు అందించిన పోడు భూములకు బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలు రూపొందించి రైతుబంధు పొందారు. ఇప్పుడు మేం కూడా అలా చెల్లించాలంటూ బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం కదా. ఇక వారి నేత ఆయన చేసిన అద్భుతాలపై ప్రశి్నస్తారన్న భయంతో సభకే రావడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు ఆయన. ఉపాధ్యక్షుడు.. అదే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పారు. ఇక వారు చేసిన రుణమాఫీ వడ్డీలకే మాత్రమే సరిపోయింది. అదికూడా ఔటర్ రింగురోడ్డును తెగనమ్మి రూ.7,500 కోట్లు తెచ్చి రుణమాఫీకి వాడేశారు. మేం కేవలం 27 రోజుల్లో రూ.17,869.21 కోట్లు రుణమాఫీ చేశాం. సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికోసం నవంబర్‌లో రూ.2,747 కోట్లు విడుదల చేశాం. మొత్తం 25,35,963 మందికి రూ.20,616 కోట్లు మాఫీ చేసి వారి రుణం తీర్చుకున్నాం. స్విస్ బ్యాంకు కూడా అప్పులిస్తారు.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేం. రూ.8 వేల కోట్లు కావాలి. మా దగ్గర నల్లధనం లేదు అని నాటి సీఎం అన్నారు. నల్లధనం ప్రభుత్వం వద్ద లేదేమోగానీ వారి వద్ద ఎందుకుండదు? అంతా అక్కడికే కదా చేరింది. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే సామర్థ్యం వాళ్లది.ఆయన కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా..గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.7,11,807 కోట్లు. మేం అధికారంలోకి వచ్చాక రూ. 1,27,208 కోట్లు అప్పు చేశామంటున్నారు. రెండూ కలిపితే దాదాపు 8.39 లక్షల కోట్లు కావాలి. రెండు రోజుల క్రితం తీసుకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు మొత్తం రూ.7,22,788 కోట్లే. 58 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లే. గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిల భారం లేకపోతే.. మేం అద్భుతాలు సృష్టించి ఉండేవాళ్లం. గత పదేళ్లలో కనీసం హాస్టళ్లకు భవనాలు కూడా కట్టలేకపోయారు. దీనిపై ముక్కు నేలకు రాసి దళిత, గిరిజన, మైనారిటీ పిల్లలకు క్షమాపణ చెప్పాలి. ముఖం చాటేస్తున్న ఆయన సభకు వస్తే అడిగి, కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నా.అన్నీ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా? నా ప్రాంతం కాకున్నా కొడంగల్‌లో ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడే మళ్లీ గెలిచి సీఎం అయ్యా. ఆ వెనకబడ్డ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నా, పరిశ్రమలు తేవాలని నిర్ణయించా. ఓ 50 వేల మందికి ఉద్యోగాలు రావటంతోపాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనుకున్నా. దీన్ని సహించలేని కొందరు డబ్బు, మద్యం పంచి అధికారులపై దాడులు చేయించారు. మూసీ వద్దంటారు, మెట్రో పొడిగిస్తామంటే వద్దంటారు, ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, పరిశ్రమలు వద్దంటారు.. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించడం ఎలా సాధ్యం. తెలంగాణ పురోగతిని అడ్డుకునే వాళ్లను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.


