
బిల్లును ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 స్థానంలో బాల్య వివాహాల(హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ–2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది