ఐఐఎం లక్నోలో 3 కొత్త ఏఐ కోర్సులు  | IIM Lucknow to offer 3 new AI courses, launched by Dharmendra Pradhan | Sakshi
Sakshi News home page

ఐఐఎం లక్నోలో 3 కొత్త ఏఐ కోర్సులు 

Feb 13 2026 4:57 AM | Updated on Feb 13 2026 4:57 AM

IIM Lucknow to offer 3 new AI courses, launched by Dharmendra Pradhan

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు చేరువచేయాలనే లక్ష్యంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(లక్నో) గురువారం మూడు ఏఐ కొత్త కోర్సులను అందుబాటులోకి తెచి్చందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) ఇన్‌ ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్, టెక్‌ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ సైన్స్‌ + టెక్‌ ఎంబీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చారని ఆయన వెల్లడించారు. గురువారం ఢిల్లీలో జరిగిన భారత్‌ బోధన్‌ ఏఐ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

 ‘‘నైతిక ఏఐలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా అవతరింపజేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మేనేజ్‌మెంట్‌ విద్యతోపాటు ఆవిష్కరణలు, రియల్‌ వరల్డ్‌ సోషియాటిక్‌ అప్లికేషన్లలో ఏఐ కోర్సులను విస్తృతంగా అందించాలని బిజినెస్‌ స్కూళ్లకు సూచిస్తున్నాం. ఏఐ ఆధారిత భవిష్యత్తుకు తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేయడంతోపాటు మానవీయ విలువలను పెంపొందిస్తూ జాతీయాభివృద్ధికి సాంకేతికత దోహదపడేలా చేయండి’’అని బిజినెస్‌ స్కూళ్లకు మంత్రి పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువ కారి్మకశక్తితో అలరారే భారత్‌లో దేశీయంగా ఏఐ మోడళ్లను తయారుచేసుకునే అద్భుత అవకాశం దాగి ఉంది. ఇది ప్రపంచ సమస్యలనూ తీర్చగలదు అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement