breaking news
dharmendra pradhan
-
ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక పదవి?
న్యూఢిల్లీ: జెన్ జీ పోరాటంతో కేంద్ర మంత్రి పదవి కోల్పోయిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీలో కీలక పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ఊహాగానాలు వెలుడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త టీమ్‌పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది.బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నేతలు సతీష్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీలకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు కూడా పెద్ద బాధ్యత దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అది బీజేపీ సంస్థాగత వ్యవస్థలో కావొచ్చు లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కావొచ్చని సమాచారం. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ పేరు కూడా కీలక పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆ జాబితాపైనే ప్రధాన దృష్టి!నితిన్ నబిన్ కొత్త టీమ్‌లో అత్యంత కీలకమైన మార్పులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల విషయంలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీకి ఏడుగురు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వీరిలో అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాధామోహన్ దాస్ అగర్వాల్, బీఎల్ సంతోష్ ఉన్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా ఉన్న బీఎల్ సంతోష్ మాత్రం కొనసాగడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పదవిని సాధారణంగా ఆర్ఎస్ఎస్కు చెందిన నేతకే కేటాయిస్తారు. అయితే ఆయనకు కొత్త డిప్యూటీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్ అగర్వాల్‌లకు విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.వారిద్దరికి కీలక బాధ్యతలు?ఇదే విభాగంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, సతీష్ పూనియాలను తీసుకురావచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువత, అనుభవజ్ఞుల కలయికతో టీమ్‌ను ఏర్పాటు చేయాలన్న నితిన్ నబిన్ ఆలోచనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ పేర్లపై బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఉత్తరాది నుంచి భాటియా పేరు!ఉత్తర భారతదేశం నుంచి హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ భాటియా (Sanjay Bhatia) పేరు కూడా బీజేపీ కొత్త టీమ్‌లో కీలక బాధ్యత కోసం వినిపిస్తోంది. ఆయనకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఏదైనా ముఖ్యమైన పదవి దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.చదవండి: ఇలా అయితే నేనే నిరసనకు దిగుతా.. బాబా రామ్దేవ్మొత్తంగా చూస్తే, నితిన్ నబిన్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, పదవులపై ఊహాగానాలే తప్ప, తుది నిర్ణయాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
‘జెన్‌జీ’ని తప్పుదోవ పట్టించారు.. రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్
సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్‌జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను బాధితుడినయ్యానని వ్యాఖ్యానించారు.సంబల్పూర్లో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం ముదిరిన తీరును చూస్తే కొంతమంది వ్యక్తులు జెన్‌జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకోవాలని చూశారు.అందుకే యువత ఆకాంక్షలను గుర్తించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో నా వ్యక్తిగత గౌరవానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మోదీ నా ప్రతిపాదనకు అంగీకరించి, ఆ తర్వాత స్వయంగా ఆయనే పిల్లలతో మాట్లాడారు అని పేర్కొన్నారు.జులై 25న సమర్పించిన తన రాజీనామా లేఖలోని అంశాలను ఆయన గుర్తుచేశారు. ఈ ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా ఉండటానికి, దేశ ఐక్యతను కాపాడటానికి, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకే తాను మంత్రి పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దర్యాప్తును సిబిఐకి అప్పగించి, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి జూన్ 21న తిరిగి నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్‌లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్‌కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి.. ఇన్ని రాష్ట్రాల్లో నిరసనలు
కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల విద్యామంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అంశం ఒక్క పరీక్షకే లేదా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నో పరీక్షలతో ఈ విషయం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి.లక్నోలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనల్లో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేశారని, ఇలాంటి ఆరోపణలు వచ్చిన రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు అదే విధంగా బాధ్యత వహించి, వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు అంటున్నారు.పంజాబ్‌లో రెండుసార్లు నిర్వహించిన ప్రభుత్వ నియామకాల అంశంపై కూడా రాజకీయ వేడి పెరిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలి దళ్ పార్టీలు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నిలదీస్తున్నాయి.పంజాబ్‌లో వరుసగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, హైటెక్ పద్ధతిలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ జరగలేదని, సమయానికి నకలు మాఫియాను బయటపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఫార్మసీ విభాగం, వ్యవసాయ శాఖకు చెందిన రెండు కేసుల చుట్టూనే ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసుల వల్ల పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.ఫార్మసీ ఆఫీసర్ పరీక్ష: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 454 ఫార్మసీ ఆఫీసర్ల నియామకానికి ఇటీవల బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో సుమారు 7,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసుల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఫరీద్కోట్, ఫిరోజ్‌పూర్, కోట్ కపూరా పరీక్ష కేంద్రాలపై దాడులు చేశాయి.ఈ ఘటనలో 28 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులు తలపాగా, సాక్స్, లోదుస్తుల్లో చిన్న బటన్లు, వైర్లెస్ బ్లూటూత్ పరికరాలు దాచుకుని వచ్చారు. ఫిరోజ్‌పూర్‌లోని ఒక పరీక్ష కేంద్రం నుంచి పెన్ కెమెరాతో ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా బయటకు పంపారు. అక్కడ హరియాణా, రాజస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కంట్రోల్ రూమ్ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చెబుతున్నారు.ఈ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి 3.5 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం. దీన్ని నేరుగా ప్రశ్నపత్రం లీక్, వ్యవస్థ వైఫల్యంగా పేర్కొంటూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి, విద్యామంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఇది పరీక్షకు ముందు జరిగిన ప్రశ్నపత్రం లీక్ కాదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత రియల్ టైమ్‌లో జరిగిన హైటెక్ లీక్ అని, దాన్ని సమయానికి గుర్తించి అడ్డుకున్నామని పంజాబ్ పోలీసులు, అధికారులు చెబుతున్నారు.వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షలో వివాదంవ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని ప్రతిపక్షం, ముఖ్యంగా శిరోమణి అకాలి దళ్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం సెట్లు లీక్ అయ్యాయని, తర్వాత విషయాన్ని దాచిపెట్టేందుకు అసాధారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షపై పారదర్శక విచారణ జరిపి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పట్టభద్రులు, యువ అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఇవేగాక, పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లోనూ విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా?
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యాశాఖ మంత్రి పదవికి సంబంధించిన జీతభత్యాలు, అధికారిక సౌకర్యాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించగా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి కేబినెట్ హోదా కలిగిన మంత్రి. అదే సమయంలో లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉంటారు. అందువల్ల పార్లమెంట్ సభ్యులకు వర్తించే వేతనం, భత్యాలతో పాటు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా లభించే అధికారిక సౌకర్యాలు కూడా పొందుతారు.జీత భత్యాలు ఇవే..ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా నెలకు రూ.1 లక్ష ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా నియోజకవర్గ భత్యం రూ.70,000, కార్యాలయ వ్యయాల కోసం రూ.60,000 అందుతాయి. పార్లమెంట్ లేదా దాని కమిటీల సమావేశాలకు హాజరయ్యే ప్రతి రోజుకు రూ.2,000 రోజువారీ భత్యం చెల్లిస్తారు. ఇవి పార్లమెంట్ సభ్యులకు వర్తించే నిబంధనల ప్రకారం అందే ప్రయోజనాలు.కేబినెట్ మంత్రిగా లభించేవి..కేబినెట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రికి న్యూఢిల్లీలోని లుటియెన్స్ జోన్లో ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తారు. ఈ నివాసానికి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంటి నిర్వహణ, అధికారిక అవసరాల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.అలాగే అధికారిక వినియోగం కోసం ప్రభుత్వ వాహనం, డ్రైవర్, ఇంధన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భద్రతా సంస్థల ముప్పు అంచనాల ఆధారంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్ వాహనాలు వంటి భద్రతా ఏర్పాట్లు కూడా కల్పిస్తారు.ప్రభుత్వ విధుల నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా అధికారిక విమాన ప్రయాణాలు, ఫస్ట్ ఏసీ రైలు ప్రయాణాలకు అర్హత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద మంత్రి, ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు లభిస్తాయి.మంత్రి కార్యాలయ నిర్వహణ కోసం వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. అధికారిక నివాసం, కార్యాలయంలో టెలిఫోన్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది.అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా వేరే జీతం ఉండదు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో ఉండటం వల్ల కేంద్ర మంత్రులందరికీ వర్తించే వేతనం, పార్లమెంట్ సభ్యుల భత్యాలు, అధికారిక సౌకర్యాలనే పొందుతారు. -
TDPని అడ్డంగా ఇరికించిన కేశినేని కూతురు.. CJPకి మద్దతుగా..
-
రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ ఎంట్రీ పార్లమెంట్లో!
-
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. కారు దిగగానే!
సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్ వెల్కమ్ దక్కింది ఆయనకు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి. #WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament. BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI— ANI (@ANI) July 27, 2026 -
CJPకి మద్దతుగా ఎన్ డిఏ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూతురు సెటైర్లు
-
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్‌తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
రాజీనామా వెనుక..మోదీ మ్యాజిక్.. BJP అసలు వ్యూహం అదేనా..
-
ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు
భారతదేశ విద్యా వ్యవస్థను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వివాదాలు, కుదుపులకు లోనైంది. ఎన్డీఏ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనా కాలంలో నలుగురు వేర్వేరు మంత్రులు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ, వారిలో ముగ్గురు కనీసం మూడేళ్లు కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఐదేళ్ల పూర్తి కాలం పని చేసినప్పటికీ, చివరికి ‘నీట్’ పరీక్షల లీకేజీలు, చెలరేగిన దేశవ్యాప్త నిరసనల సెగతో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు విద్యాశాఖను చుట్టుముట్టిన సంచలన వివాదాలివే..మారిన పేర్లు.. రద్దయిన ఎఫ్‌వైయూపీ2014 మే 26 నుంచి 2016 జూలై 5 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ) బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ హయాంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. ఆమె పదవీకాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) రద్దు చేయడం ఒకటి. దీనివల్ల విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇదే సమయంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ముసాయిదా రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో పాటు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రేంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ఆమె ప్రారంభించారు.జేఎన్‌యూ వివాదాలు, రోహిత్ వేముల ఆత్మహత్యస్మృతి ఇరానీ పదవీకాలం అనేక రాజకీయ తుఫాన్లకు కేంద్రబిందువుగా మారింది. జేఎన్‌యూలో చెలరేగిన భారీ నిరసనలు, నాటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అలాగే 2016 జనవరిలో చోటుచేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభుత్వంపై తీవ్ర నైతిక ఒత్తిడి తెచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2016 జూలైలో ఆమెను విద్యాశాఖ నుంచి తప్పించి జౌళి శాఖకు బదిలీ చేశారు.ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి.. ఎన్టీఏ ఏర్పాటుస్మృతి ఇరానీ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ జవదేకర్ 2016 జూలై 5 నుంచి 2019 మే 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)యాక్ట్-2017’ ద్వారా ఐఐఎం సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి లభించింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ)ను ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో నీట్ పేపర్ లీక్ అంశంలో ఇదే ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.నో డిటెన్షన్ పాలసీ రద్దు.. సీబీఎస్ఈ పేపర్ లీక్జవదేకర్ హయాంలో విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి, ఐదు, ఎనిమిది తరగతుల్లో పిల్లలను ఫెయిల్ చేయకుండా పై తరగతులకు పంపే ‘నో డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేశారు. అయితే 2018లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల పేపర్ లీక్ కావడంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్ర విమర్శలపాలైంది. అంతేకాకుండా, జియో ఇన్స్టిట్యూట్కు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా కట్టబెట్టడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది.నిశాంక్ హయాంలో జాప్యమైన కీలక నియామకాలు2019లో ప్రకాష్ జవదేకర్ స్థానంలో డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో 2020 జూలైలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ఆమోదం పొందడం ఒక మైలురాయిగా నిలిచినా, దాని రూపకల్పనలో సింహభాగం అంతకుముందే పూర్తయింది. అయితే ఆయన కాలంలో జెఎన్యూ, బీహెచ్‌యూ, ఢిల్లీ వర్సిటీ వంటి ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలకు నెలల తరబడి వైస్‌చాన్సలర్ల నియామకాలు జరగలేదు. అలాగే ఐదు ఐఐటీ సంస్థలకు పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించడంలో తీవ్ర జాప్యం జరిగింది. అనారోగ్య కారణాలరీత్యా ఆయన 2021 జూలైలో పదవికి రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ రాక.. జాతీయ స్థాయిలో సంక్షోభాలురమేష్ పోఖ్రియాల్ నిష్క్రమణ తర్వాత విద్యాశాఖ పగ్గాలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘకాలం పదవిలో కొనసాగినప్పటికీ, ఆయన కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు వంటి అంశాలపై మేధావులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయంటూ బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.‘నీట్’ తుఫాన్.. పదవిని కోల్పోయిన మంత్రిధర్మేంద్ర ప్రధాన్ హయాంలో ‘నీట్-యూజీ’ ప్రవేశ పరీక్షలో తలెత్తిన పేపర్ లీక్ కుంభకోణం, గ్రేస్ మార్కుల వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులను రోడ్డెక్కేలా చేశాయి. సుప్రీంకోర్టు జోక్యం, సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఎన్టీఏ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. పరీక్షల మాఫియా అంతుచూస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, దేశవ్యాప్తంగా చెలరేగిన తీవ్ర నిరసనలు, ఆందోళనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ చివరకు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే.. -
లోకేశ్.. మీ సంగతేంటి!?
సాక్షి, అమరావతి: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ యువత ఆయన్ను ప్రశ్నిస్తోంది. విద్యా శాఖలో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, వివిధ ఉత్తర్వుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పతకాలు సాధించిన వారిని కాదని, కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెట్టారని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, భారీ కుంభకోణం జరిగిందని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేశ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.లోకేశ్ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతమవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్లు ఏపీలోనూ కదంతొక్కుతాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. లోకేశ్‌ను కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తారేమోనని చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
లోకేశ్.. మీరు రాజీనామా చేయరా?
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ అయిందని తేలిన వెంటనే మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిందితులను కటకటాలపాలు చేసింది. లీక్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని జెన్ జీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం దిగొచ్చింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధాన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. నీట్ పేపర్ లీకేజీని తలదన్నే రీతిలో రాష్ట్రంలో సాగిన డీఎస్సీ–2025 కుంభకోణం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది.డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన గోల్‌మాల్‌పై ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, బాబు ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించక పోవడంపై ఏపీ జెన్ జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీట్ తరహాలోనే డీఎస్సీ స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం నిష్పక్షపాత విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీస్తోంది. సీబీఐ వంటి థర్డ్ పార్టీ దర్యాప్తు సంస్థలతో విచారణ చేస్తే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని నినదిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, నష్టానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏపీ జెన్ జీ పట్టుపడుతోంది. లీక్‌ను కప్పిపుచ్చే యత్నం 16 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహించింది. ప్రశ్నపత్రం రూపకల్పన నుంచే డీఎస్సీ స్కామ్‌కు బీజం వేసినట్టు జరిగిన తతంగం స్పష్టం చేస్తోంది. ప్రశ్నపత్రం రూపకల్పన, ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ డీఎస్సీ సోషల్ స్టడీస్ పరీక్షల్లో కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచాడు. టీజీటీ పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. ప్రశ్నపత్రాలు సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడని తెలిస్తే డీఎస్సీ పేపర్ లీక్ బట్టబయలు అవుతుందని ప్రభుత్వమే లీక్‌ను కప్పిపుచ్చే ప్రయత్నానికి పూనుకుంది.నీట్ పేపర్ ఎన్టీఏ ప్యానెల్ సభ్యుల నుంచి లీక్ అయినట్టే ఏపీ డీఎస్సీ ప్రశ్నపత్రం తయారైన దగ్గరే లీక్ అయిందని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు స్వతంత్ర విచారణ చేపట్టలేదని, లీకైన పేపర్ ఎంత మందికి చేరిందో ఎందుకు గుర్తించలేదని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నవీన్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు 1ః1 ప్రాతిపదికన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రకటించాక కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మంది ప్రతిభావంతులకు వెన్నుపోటు పొడిచారు. నియామక ఉత్తర్వుల జారీలోను అర్హులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపింది. ఇలా నష్టపోయిన అభ్యర్థులు పక్కా ఆధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. డీఎస్సీ–2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీచేసిన జీవో నెం.23 బేరసారాల సాక్ష్యాలు బయటపడ్డా గప్‌చుప్ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెగా స్కామ్ ఏపీలో చోటు చేసుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే స్కామ్ పాలసీలో భాగంగా జీవో 4.. 47 ప్రభుత్వం తెచ్చింది. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టులను కట్టబెట్టే దగాకోరు విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలతో సత్తా చాటిన వారిని కాదని చంద్రబాబు బంధువు ఎంపీ భరత్, టీడీపీ ఎమ్మెల్యే కూన రవి వంటి వారు చైర్మన్లుగా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ పోస్టులు ఇచ్చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఆడియో, వీడియో సాక్ష్యాలు బయటపడ్డాయి. జిల్లా, కాలేజ్, విశ్వవిద్యాలయం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా, కేవలం పోటీల్లో పాల్గొన్నారనే సరి్టఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంతా స్కామ్‌గా మారినట్లు కళ్లెదుటే సాక్ష్యాలు, నష్టపోయిన అభ్యర్థులు కనిపిస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.స్పోర్ట్స్ కోటా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టినట్టే నీట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను నిందితులు అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వాట్సప్ గ్రూప్‌లు, డిజిటల్ ఆధారాలతోనే సీబీఐ నిందితులను పసిగట్టి జైలుపాలు చేసింది. ఇదే రీతిలో టీచర్ పోస్టుల అమ్మకానికి బేరసారాలాడిన వ్యక్తుల ఫోన్ నెంబర్, ఆడియో రికార్డింగ్‌తో సహా పక్కా ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై నిష్పపక్షపాత విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం బయట పడుతుందని జీవో 4.. 46 రద్దు చేసి అక్రమాలను ప్రభుత్వమే కప్పి పెట్టేందుకు పూనుకుందని యువత విమర్శిస్తున్నారు. జీవితాలతో చెలగాటంవైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించింది. ఏపీలో మాత్రం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కల అయిన డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుకుంది. డీఎస్సీ స్కామ్ గురించి ప్రజల్లో చర్చకు వచి్చనప్పుడల్లా డైవర్షన్ రాజకీయం చేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థుల సందేహాలు, ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక అవాస్తవాలతో అసలు విషయాన్ని దాటవేస్తోంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి హామీతో గద్దెనెక్కి స్కామ్‌ల డీఎస్సీతో చంద్రబాబు సర్కారు తమ భవిష్యత్‌తో చెలగాటం ఆడిందని నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. -
ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి తల్లి భావోద్వేగభరిత కామెంట్స్
నాగ్‌పూర్: నీట్ పేపర్ లీక్‌లపై దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జులై 25న) రాజీనామా చేశారు. అయితే, దాంతో ఏమి సాధిస్తారని నీలమ్ చతుర్వేది అనే మహిళ ప్రశ్నించారు. ఆమె కూతురి పేరు ఆకాంక్ష చతుర్వేది. ఆమె 18 ఏళ్ల నీట్ అభ్యర్థి. ఈ ఏడాది నీట్ పరీక్ష రద్దు అయిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, మే 20న నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నీలమ్ చతుర్వేది మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకునే ఏ చర్యా తన కూతురిని తిరిగి తీసుకురాలేదని, అయినా ఆమెకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. పేపర్ లీక్ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామని, కానీ రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని అన్నారు."ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మేము సంతృప్తి చెందలేదు. విద్యార్థుల నిరసనకు మా మద్దతు కొనసాగుతుంది. పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలి" అని ఆమె డిమాండ్ చేశారు.తండ్రికి రెండు సార్లు గుండెపోటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష.. నీట్ పరీక్షకు ప్రిపరేషన్ కోసం కుటుంబంతో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. పరీక్ష సన్నద్ధత కోసం ఓ కోచింగ్ సంస్థలో చేరింది. మే 3న నీట్ పరీక్ష రాసిన ఆకాంక్ష, పరీక్ష బాగా జరిగిందని చెప్పిందని ఆమె తల్లి గుర్తుచేశారు. అయితే పరీక్ష రద్దు అయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు."ఆకాంక్ష తండ్రికి ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు పక్షవాతం కూడా వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? నా కుమార్తె బతికి ఉంటే అన్నీ చూసుకునేది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష తన చేతిరాతతో రాసిన ఆత్మహత్య లేఖలో తాను ఎదుర్కొన్న తీవ్ర మానసిక భారాన్ని వివరించింది."అమ్మా, నాన్నా... మీ కుమార్తె బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ మరోసారి నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉండేది. ఇప్పుడు మళ్లీ అంతే బాగా రాస్తాననే నమ్మకం లేదు. అమ్మా, నాన్నా... నన్ను క్షమించండి. నేను అన్నీ నాశనం చేశాను" అని ఆమె లేఖలో రాసింది.కుటుంబ సభ్యుల మాటల్లో, కుమార్తె చదువు కోసం ఆమె తండ్రి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది భూమిలో వ్యవసాయం చేస్తూనే, నాగ్‌పూర్‌లో వంటమనిషిగా పని చేసి కుటుంబ ఖర్చులు, కోచింగ్ ఫీజులు భరించారు.ఆకాంక్ష మామ జగదీశ్ ప్రసాద్ చతుర్వేది మాట్లాడుతూ.. పరీక్ష రాసి ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా కనిపించిందన్నారు. మొదట 650కు పైగా మార్కులు వస్తాయని ధైర్యంగా చెప్పిన ఆమె, పేపర్ లీక్ విషయం తెలిసిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, తినడం తగ్గించి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసిందని తెలిపారు. "ఇలా జరుగుతుందని మేమెప్పుడూ ఊహించలేదు" అని ఆయన అన్నారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భారీ నిరసనలు, జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన మరుసటి రోజే, ఆదివారం నాడు ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాను ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖను సమర్పించినట్లు ప్రధాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.జంతర్‌మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థి సంఘం (సీజేపీ) ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రులు జగత్ ప్రకాష్ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిరసనకారుల ప్రధాన డిమాండ్లపై ఇరువర్గాల మధ్య సానుకూల అంగీకారం కుదరడంతో ఈ ఆందోళనను విరమించినట్లు ప్రకటించారు. ప్రధాన్ రాజీనామా అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఈ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. కర్ణాటకలోని బీజాపూర్‌లో 1962 నవంబర్ 27న జన్మించిన ప్రహ్లాద్ జోషి, హుబ్బళ్ళిలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో అనుభవం గడించిన ఆయన, కర్ణాటకలో కీలక బీజేపీ నేతగా ఎదిగారు. 2004 నుంచి ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రితో పాటు, 2024 ఎన్నికల తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి కీలక పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇది కూడా చదవండి: పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ -
ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!
అహిల్యానగర్: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. హింస ద్వారా ఎటువంటి సమస్యలూ పరిష్కారం కావని, చర్చలు, శాంతియుత నిరసనలే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ప్రాధాన్యత కావాలని, సమస్యలను హింస ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.ప్రజలు తమ డిమాండ్లను కోరే హక్కు కలిగి ఉన్నప్పటికీ, హింస ఏ పరిస్థితుల్లోనూ సరైనది కాదని అన్నా హజారే పేర్కొన్నారు. తాము కూడా గతంలో రాజీనామాలను డిమాండ్ చేశామని, అయితే ఆ సమస్యలను ఎప్పుడూ హింస ద్వారా పరిష్కరించుకోలేదని గుర్తుచేశారు. తన జీవితంలో తాను 22 సార్లు నిరాహార దీక్షలు చేశానని, ఎక్కడా హింసకు తావు ఇవ్వలేదని, అందుకే పది చట్టాలను తీసుకురాగలిగామని ఆయన తెలిపారు. శాంతియుత మార్గాలు, చర్చల ద్వారానే వ్యవస్థలో నిజమైన మార్పు సాధ్యపడుతుందని ఆయన ఉద్ఘాటించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల నేపథ్యంలో, విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, నిరసనకారుల మధ్య జరిగిన చర్చల అనంతరం కేంద్రం వారి డిమాండ్లను అంగీకరించడంతో ఈ ఆందోళన విరమించారు. ఏ పరిస్థితుల్లోనూ హింసను ప్రోత్సహించకూడదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శాంతియుత పద్ధతులను అనుసరించాలని అన్నా హజారే పునరుద్ఘాటించారు. -
ఏపీ లో కూడా కాక్రోచ్ ఉద్యమం జరిగితే లోకేష్ రాజీనామా తప్పదు..!?
-
'నో చెప్పలేం'.. రాజకీయ ఎంట్రీపై కాక్రోచ్ జనతా పార్టీ బిగ్ హింట్!
ఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్-యూజీ పేపర్ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం..ఓ జాతీయ మీడియా సంస్థ ..‘సీజేపీ ప్రతినిధుల్ని మరి మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?’..అని అడగ్గా.. భారత్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి దేనినైనా పూర్తిగా కొట్టిపారేయలేం’ అంటూ సీజేపీ నాయకత్వం తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే బలమైన హింట్ ఇచ్చింది.ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిన వెంటనే జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ ఉద్యమ భవిష్యత్తు గురించి, అలాగే తమ బృందం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా అనే అంశాలపై మాట్లాడారు.ఇప్పుడు నా మనసులో ఉన్న ఏకైక ఆలోచన ఇంటికి వెళ్లి నిద్రపోవడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం,నా కుటుంబాన్ని కలవడం మాత్రమే. గత కొన్ని నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటూ గత రెండు నెలల్లో జరిగిన పరిణామాల గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. ఇదంతా మా అందరికీ ఒక పెద్ద అనుభూతిని కలిగించే విషయం. ఇది గర్వపడాల్సిన సమయం. ఊరట పొందే సమయం ఇది. ఆ తర్వాత, పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం’ అని రంకా చెప్పారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేస్తున్నారా అని అడిగినప్పుడు ‘భారత్‌లో దేనికీ నో అని చెప్పకూడదనేదే నా అభిప్రాయం అని ఆయన బదులిచ్చారు. అయితే, రాజకీయాలు సీజేపీ బృందం తక్షణ లక్ష్యం కాదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ప్రస్తుతం మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చ లేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నా సరే వారు యువత కోసం పనిచేసేలా వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అదే మా ప్రస్తుత అజెండా’ అని దాస్ చెప్పారు. -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్‌గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్‌దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్‌కోచ్‌గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్‌ను ట్రోల్స్‌కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్‌తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్‌కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
గుర్తుంచుకోండి.. బొద్దింకతో పెట్టుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. రాజీనామా వార్త తెలియగానే జంతర్‌మంతర్ వద్ద ఆందోళనచేస్తున్న నిరసనకారులు ఒక్కసారిగా ఆనందడోలికల్లో మునిగారు. జాతీయజెండాలు చేతబూని కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఉద్యమంలో ప్రభుత్వంపై గెలిచామన్న ఆనందంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘విద్యార్థి శక్తి విజయం సాధించింది‘అంటూ హర్షధ్వానాలు చేశారు. నీట్ లీకేజీతో మనస్తాపంతో ఆత్మహత్యచేసుకున్న పరీక్షార్థులకు నివాళిగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సంబరాలు కొనసాగించారు. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం హోరెత్తిపోయింది. ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా ఆనందం శనివారం తొలుత జంతర్‌మంతర్‌లో నిరసన కార్యక్రమంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఉన్న సమయంలోనే మంత్రి పదవికి ధర్మేంద్ర రాజీనామాచేసిన విషయం ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది. ఈ ఘటన వివరాలను దీప్కే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసి తెలిపారు. 3 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో దీప్కే ఫోన్ మాట్లాడటం పూర్తయ్యేలోపే అక్కడి విద్యార్థులకు విషయం తెల్సి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత దీప్కే మైక్‌తీసుకుని ‘మన విద్యార్థి శక్తి వరి్ధల్లాలి. మనం సాధించాం’అని బిగ్గరగా అరుస్తూ చర్చలు ఫలవంతమయ్యాయని ప్రకటించారు.దీంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. చేతులు పైకెత్తి విజయోత్సాహం వ్యక్తం చేశారు. వేదికపై ప్రదర్శించిన పోస్టర్లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థుల పేర్లను దీప్కే చదివి వినిపించారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ, వారి త్యాగాలను ఉద్యమం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. షారుఖ్‌ఖాన్ హిట్ సినిమా ఛక్‌దే ఇండియాలోని దేశభక్తి పాటలను అక్కడ ప్లే చేశారు. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు. సీజేఐ సూర్యకాంత్‌కు థాంక్యూ.. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దిప్కే ప్రసంగించారు. ‘‘ధర్మేంద్ర రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయం. గుర్తుంచుకోండి బొద్దింకలతో పెట్టుకోవద్దు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అంత సులభం కాదు. కానీ విద్యార్థుల ఐక్యతతో ఇది సాధ్యమైంది. ప్రపంచం వంగుతుంది. కానీ దానిని వంచే సామర్థ్యం, నాయకత్వం మనకుండాలి. మీరు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ఎవరినైనా రాజీనామా చేయించవచ్చు అని ఈ ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల ఐక్యత ముందు ప్రభుత్వం తలవంచింది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరే గనక మమ్మల్ని బొద్దింకలు అని పిలవకపోయి ఉంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేవాడినే కాదు. మీరే గనక మమ్మల్ని కాక్రోచెస్ అని పిలవకపోయి ఉంటే దేశ యువత వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టేదేకాదు. మీరేగనక కాక్రోచ్ అని పిలవకపోయి ఉంటే ఈరోజు ధర్మేంద్ర మంత్రిగా రాజీనామా చేసేవాడేకాదు. ఇవన్నీ సుసాధ్యంకావడానికి పరోక్షంగా మీ కాక్రోచ్ వ్యాఖ్యలే కారణం. అందుకే మీకు కృతజ్ఞతలు’’ అని దీప్కే అన్నారు. వాంగ్చుక్కు థాంక్యూ చెప్పని దీప్కే! తాము ఘన విజయం సాధించామని నిరసన వేదికపై నుంచి ప్రకటించిన సందర్భంగా దీప్కే చేసిన ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరును ప్రస్తావించలేదు. కనీసం థాంక్యూ చెప్పలేదు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షతోనే తొలుత నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం తర్వాత ఉద్యమంగా ఉధృతరూపం దాల్చింది. అలాంటి వాంగ్చుక్ను దీప్కే తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో ఉద్యమనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే కొత్త చర్చ మొదలైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే వాంగ్‌చుక్ పేరును దీప్కే ప్రస్తావించలేదనే వాదనా విని్పస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా దీప్కే ప్రసంగంలోని మాటలు ఉండటం గమనార్హం. ‘మన డిమాండ్లు నెరవేరడంతో నన్ను హీరోను చేసేయకండి. కేవలం ఒక్క వ్యక్తిని హీరోను చేస్తూ పోవడంతోనే ఇప్పుడు భారత్ ఇలా అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి తప్పును మీరు చేయొద్దు’’ అని దీప్కే అన్నారు.ఇప్పుడే సూర్యోదయమైంది ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను దీప్కే చెప్పారు. ‘‘మోదీజీ. ప్రజాస్వామ్యానికి ఇప్పుడే సూర్యోదయం అయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే తొలి వికెట్ పడింది. మా ఉద్యమ ప్రయాణం మరెంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని అందరూ మాతో చెప్పేవారు. కానీ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని మేము నిరూపించాం’అని దీప్కే అన్నారు. -
ఆందోళనల విరమణ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో ఉద్యమించిన యువత ఆరంభించిన ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) శనివారం ప్రకటించింది. నీట్ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తోపాటు ఆత్మహత్యలకు పాల్పడిన పరీక్షార్థుల కుటుంబాలకు తలో రూ.1 కోటి నష్టపరిహారం, జూన్ 20నాటి ఛలో సంసద్ ర్యాలీలో పోలీసులతో ప్రతిఘటించిన ఉద్యమకారులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తేసేందుకు మోదీ సర్కార్ సమ్మతి తెలపడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంతో జరిపిన నాలుగో దఫా చర్చలు ఫలవంతమయ్యాక సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మంత్రులతో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి శనివారం ఢిల్లీలోని ‘కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో అశుతోష్ మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన ఆర్థిక సాయంతోపాటు ఢిల్లీ, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఉద్యమకారులపై నమోదైన కేసులను నాలుగు రోజుల్లోపు ఎత్తేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనలకు నేటితో ముగింపు పలుకుతున్నాం. జంతర్‌మంతర్ సహా అన్ని నిరసనవేదికల నుంచి కార్యకర్తలంతా ఇళ్లకు బయల్దేరండి’’అని అశుతోష్ కోరారు. హామీల అమలు, విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకునే చర్యలపై సమీక్ష కోసం సీజేపీ, ప్రభుత్వ ప్రతినిధులు నాలుగు వారాల తర్వాత మళ్లీ భేటీ అవుతారని అశుతోష్ వెల్లడించారు. తర్వాత జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఉద్యమం ముగిశాక కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడవద్దు అని సీజేపీ ప్రతినిధులు కోరారు. మంత్రి రాజీనామా, బాధితులకు నష్టపరిహారం, కేసుల ఉపసంహరణతోపాటు పరీక్షల నిర్వహణ, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు వాళ్లు సూచించిన ఐదు పాయింట్ల చార్టర్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది’’అని నడ్డా తెలిపారు. -
'కాక్రోచ్' గెలిచింది
న్యూఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరూపించింది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపు మళ్లించి అనుకున్నది సాధించింది. సీజేపీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. గత పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల కలత చెందానని ఆయన చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్థితిని దేశ విద్రోహ శక్తులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వొద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువతకు ప్రధాన్ లేఖ రాశారు. ఢిల్లీలో పరిణామాలు శనివారం చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్రం, సీజేపీ చర్చలు సఫలం మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. సీజేపీ లేవనెత్తిన మరో రెండు కీలక డిమాండ్ల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, నిరసనకారులపై కేసులు కొట్టివేయాలని సీజేపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలియజేసింది. మొత్తానికి మూడు కీలకమైన డిమాండ్లు నెరవేరడంతో కాక్రోచ్ జనతా పారీ్టలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో.. 49 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వైదొలగాలని ఆ పార్టీ నేత సౌరవ్ దాస్ కోరారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నడ్డా వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే, ఎంత ఇస్తారన్నది ఆయన పేర్కొనలేదు. శనివారం జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు జంతర్‌మంతర్ వద్ద సంబరాల హోరు కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంగతి తెలియడంతో జంతర్‌మంతర్ వద్ద శనివారం పండుగ వాతావరణం నెలకొంది. నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబూని, కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘చక్ దే ఇండియా’వంటి పాటలు వినిపిస్తుండగా, వారు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. చాలామంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలను, పోస్టర్లను ప్రదర్శించారు. మంత్రి రాజీనామాను తమ పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్‌మంతర్ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనుకున్నది చేసి చూపించామని చెప్పారు. భయపడకపోతే గెలవవచ్చనడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే నిదర్శనమని స్పష్టంచేశారు. సోనమ్ వాంగ్‌చుక్ సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం అని తేల్చిచెప్పారు. సీజేపీకి, దేశంలోని జెన్ జెడ్‌కి అభినందనలు తెలియజేశారు. అవినీతికి ప్రతీక ప్రధాన్ ప్రధాని మోదీ మొండితనం ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ‘విక్టరీ ఆఫ్ ట్రూత్’గా అభివర్ణించారు. ‘‘యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. లాఠీలు, పెల్లెట్ గన్లతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. ప్రభుత్వాన్ని ఎవరూ తమ సొంత జాగీరులా నడపలేమని బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి హెచ్చరిక జారీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని అని మండిపడ్డారు. ఆయన వెళ్లిపోవడం మంచిదేనని చెప్పారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన అకృత్యాలకు గాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప విజయం, దేశ ప్రజలందరికీ అభినందనలు’’అని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
ధర్మేంద్ర ప్రధాన్ (మాజీ మంత్రి) రాయని డైరీ
రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్‌లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్, దిగిపో...’’ అని సచివాలయం భవనం బీటలు వారేలా నేను నినాదాలిస్తున్నాను. ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ కర్టెన్ను కాస్త తొలగించి, కిటికీ అద్దంలోంచి కిందికి చూస్తూ ఏదో అడుగుతున్నారు. పక్కనున్నవారు ఆయన చెవిలో ఏదో చెబుతున్నారు. మరుక్షణం సీఎం కర్టెన్ మూసేశారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్ మొదలు పెట్టారు. నా ముఖం చిట్లిపోయింది. నా ఎముకలు సున్నం అయ్యాయి. నా వెంట ఉన్న విద్యార్థులకూ గాయాలయ్యాయి. అంతా రక్తం వోడుతున్నాం. అయినా మేము అక్కడి నుంచి కదల్లేదు. ‘‘ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి పట్నాయక్ తక్షణం రాజీనామా చేయాలి’’ అని విద్యార్థులందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నినాదాలు ఇస్తూనే ఉన్నాం. పోలీసులు మాపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంత జరుగుతున్నా పట్నాయక్ రాజీనామా చేయలేదు. ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని మాత్రం అన్నారు. నాడు నేను ఏ స్థానంలో నిలబడి పోరాడానో... నేడు అదే స్థానంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిలబడ్డారు. నాడు నేను ఏ అధికార పీఠాన్ని ప్రశ్నించానో... నేడు అదే పీఠంపై కూర్చొని ఉన్న నన్ను విద్యార్థులు ప్రశ్నించారు. కాలం ఎంత విచిత్రమైనది! నాలోని పాత విద్యార్థి నాయకుడు, నేటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఓడించాడు. నేను రాజీనామా చేశాను. జంతర్ మంతర్‌లో విద్యార్థుల ఆందోళన మొదలైనప్పటి నుంచీ– 36 రోజులుగా–నాడు పట్నాయక్ మాతో అనిన మాటే, నేనూ విద్యార్థులతో అంటూ వచ్చాను... ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని! కానీ, విద్యార్థులు వినలేదు. వినకపోవటంలో ఎప్పుడూ న్యాయమే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చి, వాటికి సమాధానాలు రాయమని ప్రభుత్వం విద్యార్థులను అడుగు తున్నప్పుడు, ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వమూ సరైన సమాధానాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం చెప్పింది. కానీ వారికి ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. జీరో మార్కులు వేశారు. గవర్నమెంట్ ఫెయిల్ అనేశారు! ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే...’’ అని పంతం పట్టారు. మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయటం తప్ప మరేమీ జరగదు. విద్యాశాఖ ప్రధాని కిందకు వెళుతుంది. లేదంటే, ఇంకో మంత్రికి అదనపు శాఖ అవుతుంది. కొత్త మంత్రిని తీసుకున్నా,ఆ మంత్రికి విద్యాశాఖ అర్థం కావటానికి సమయం పడుతుంది. అంతవరకూ విద్యాశాఖలో ఒక్క నిర్ణయమూ జరగదు. ఒక్క తీర్మానమూ కదలదు. ఒక్క అమలూ కుదరదు. విద్యార్థులకు ఏం న్యాయం జరిగినట్లు?! అయినప్పటికీ నేను రాజీనామా చేశాను. ఇది ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు చేసిన రాజీనామా కాదు. విద్యార్థుల డిమాండ్‌కు తలవొగ్గి చేసిన రాజీనామా కూడా కాదు. రాజీనామా చేయకపోతే, వారిని ఉసిగొల్పు తున్న చేతుల్లోనే వారి భవిష్యత్తును ఉంచి నట్లౌతుందన్న ఆందోళనతో చేసిన రాజీనామా!ఇదేమీ త్యాగం కాదు, ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు నమ్మకం కలిగించటం. ఇదేమీ ఓటమి కాదు, విద్యార్థుల ఆవేదనను గౌరవించటం. చేతిలోని పెన్నును పక్కన పెట్టి, కుర్చీలోంచి నేను లేస్తున్నప్పుడు నాలో తెలియని ప్రశాంతత! ఇప్పుడిక నేను మంత్రిని కాకపోవచ్చు... కానీ, మళ్లీ నా పాత రోజుల్లోకి వెళ్లి, విద్యార్థుల పక్షాన నిలబడ్డానన్న తృప్తిని మిగుల్చుకున్న ఒక విద్యార్థి నాయకుడిని! -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్‌లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
‘నీట్’ అయిపోయింది.. సీజేపీ నెక్ట్స్ ఏం చేస్తుందంటే?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిరసనలకు తలొగ్గడం చాలా అరుదు. సాధారణంగా ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయి, నిరసనలను కాలక్రమంలో చల్లారేలా చూస్తాయి. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేఐ) ఆందోళనల విషయంలో మాత్రం ఆ పరిస్థితి మారింది.నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వారాల తరబడి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఇతర యువత నిరసనలు కొనసాగించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడగానే అక్కడ సంబరాలు జరిగాయి.నీట్ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, జూలై 20న జరిగిన పోలీసు చర్యపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిమాండ్ చేశారు.ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే..?సీజేపీ ఇకపై నీట్, పరీక్షల సంస్కరణలకే పరిమితమవుతుందా? లేక ఉద్యోగాలు, నియామకాలు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్త ఉద్యమంగా చేస్తుందా? ఈ నిర్ణయమే సీజేపీ చరిత్రను నిర్ణయించనుంది.సీజేపీ.. కేవలం నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పుట్టిందని భావించడం సరికాదు. నీట్ వివాదానికి ముందే, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశ యువతలో తీవ్ర చర్చకు దారి తీసింది. నిరుద్యోగ యువతను "కాక్రోచ్లు" అని అన్నారనే అభిప్రాయం సామాజిక మాధ్యమాల్లో విస్తరించింది. అనంతరం ఆయన నకిలీ డిగ్రీలతో ఉద్యోగాల్లోకి వచ్చే వారినే ఉద్దేశించి మాట్లాడినట్లు వివరణ ఇచ్చినా, అప్పటికే ఆ పదాన్ని యువత తమ ఉద్యమానికి ప్రతీకగా మార్చుకుంది. అలా "కాక్రోచ్" అనే పదం అవమానం నుంచి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది.సామాజిక మాధ్యమాల నుంచే పుట్టిన ఉద్యమంగతంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగేవి. కానీ, సీజేపీ పూర్తిగా డిజిటల్ వేదికలపై రూపుదిద్దుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లు, ప్రత్యక్ష ప్రసారాల్లో ఉద్యమం వ్యాప్తి చెందింది. వీటి ద్వారానే వేలాది మంది యువత ఒక్కటయ్యారు. మీమ్స్ ఉద్యమానికి ఊపునిచ్చాయి. ఆ తర్వాత నీట్ ప్రశ్నపత్రం లీక్ ఈ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది.ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద కేవలం వైద్య విద్యార్థులే కాదు... యూపీఎస్సీ అభ్యర్థులు, ఎస్ఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, ఇంజినీరింగ్ పట్టభద్రులు, నిరుద్యోగులు అందరూ ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఎందుకంటే పరీక్ష రద్దు కావడం అంటే వారికి మరో ఏడాది కోచింగ్ ఖర్చు, మరో ఏడాది ఉద్యోగం లేకపోవడం, కుటుంబంపై మరింత భారం పడటమే.తదుపరి అజెండా ఉద్యోగాలేనా?భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. అయితే స్థిరమైన ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ప్రభుత్వ నియామకాల్లో... ఖాళీలు భర్తీ కాకపోవడం, కోర్టు కేసులు, ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల ఆలస్యం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయి. యువతకు నిరుద్యోగం అనేది నిత్యజీవిత సమస్య.సీజేపీ ముందున్న కీలక అంశాలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ప్రధాన డిమాండ్ నెరవేరింది. ఇప్పుడు సీజేపీ ముందు పలు మార్గాలు ఉన్నాయి. పరీక్షల సంస్కరణలు, పారదర్శకత కోసం ఉద్యమాన్ని కొనసాగించడం. ఉద్యోగాలు, నియామకాలు, ప్రభుత్వ ఖాళీల భర్తీ వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకోవడం. లేదా భవిష్యత్తులో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారాలా అనే విషయంపై ఆలోచించడం.చరిత్ర ఏమి చెబుతోంది?భారత రాజకీయాల్లో ఇలాంటి ఉద్యమాలు భిన్న ఫలితాలు ఇచ్చాయి. జేపీ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత ఒక వర్గం రాజకీయాల్లోకి ప్రవేశించింది. రైతుల ఉద్యమం ఒకే చట్ట లక్ష్యంతో విజయాన్ని సాధించింది. అయితే విద్యార్థి ఉద్యమాలు మాత్రం ప్రధాన సమస్య పరిష్కారమైన తర్వాత బలహీనపడిన సందర్భాలు ఎక్కువ.శనివారం జరిగిన పరిణామం మరో విషయాన్ని కూడా నిరూపించింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల మద్దతు లేకుండానే డిజిటల్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఒక తరం యువతను ఏకం చేయవచ్చని సీజేపీ చూపించింది. ఈ ఉద్యమం ఇంటర్నెట్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చినా దాని డిమాండ్లు మాత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనవి.. అవే జవాబుదారీతనం, సమాన అవకాశాలు, న్యాయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సీజేపీ ఉద్యమానికి ముగింపు కాకపోవచ్చు. ఉద్యోగాలు, నియామక సంస్కరణలు, యువత భవిష్యత్తు వంటి పెద్ద అంశాలపై కొత్త దశకు ఇది ఆరంభం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు. అలాగే, ప్రధానమంత్రి సలహా మేరకు.. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతగా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు.మరోవైపు, ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కర్ణాటక నుంచి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కేంద్ర ప్రభుత్వంలో ఆయన బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ధారవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా దేశానికి స్వచ్ఛమైన, స్థిరమైన ఇంధనం కోసం ఆయన దృష్టి సారించారు. 2030 నాటికి పునరుత్పాదక, శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించడం, 2070 నాటికి నికర కార్బన్ ఉద్గారాలను సున్నాకు చేర్చే లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కృషి చేస్తున్నారు. ఈ లక్ష్యాలు భారత ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రతకు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.పునరుత్పాదక ఇంధన రంగంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రహ్లాద్ జోషి పలు కీలక కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు.కాగా, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే రోజున తాత్కాలికంగా కొత్త మంత్రిని నియమించడం గమనార్హం. -
BJPని దించే సమయం ఇదే.. రెచ్చిపోయిన రాహుల్ గాంధీ
-
ఇది ఆరంభం మాత్రమే... రాజీనామా పై రఘవీరా రెడ్డి రియాక్షన్
-
వాంగ్చుక్కు కనీసం థ్యాంక్స్ చెప్పని అభిజీత్ దీప్కే..
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వేదికపై.. తాము విజయం సాధించామని ప్రకటించారు. అయితే, 26 రోజుల నిరాహార దీక్షతో ఈ నిరసనను దేశవ్యాప్త ఉద్యమంగా మార్చిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పేరును తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు.శనివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికపై దీప్కే మాట్లాడుతూ.. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకు నన్ను హీరోగా చూడొద్దు. ఆ తప్పు చేయకండి. ఒక వ్యక్తిని హీరోగా మార్చడం వల్లే ఈ దేశం నష్టపోయింది. ప్రభుత్వానికి తలవంచకపోతే ఎవరినైనా రాజీనామా చేయించగలమని ఈ విజయం నిరూపించింది. ఇది ప్రజాస్వామ్యం" అని పేర్కొన్నారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన సోనం వాంగ్‌చుక్ గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఉద్యమానికి బలం ఇచ్చిన వాంగ్చుక్అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి జూన్ 6న భారత్‌కు వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రారంభించారు. తొలి రోజుల్లో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు. సౌరభ్ దాస్, ఆశుతోష్ రంకా, ఉద్యోగం కోల్పోయిన విజయతా దహియా వంటి కొద్దిమంది సహచరులు మాత్రమే ఆయనతో ఉన్నారు. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ యువతకు మద్దతు ప్రకటించారు.ప్రారంభంలో నిరసనకు పెద్దగా స్పందన లేకపోవడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, జూన్ 28న వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగి, నిరసనకు భారీగా మద్దతు రావడం ప్రారంభమైంది. జంతర్ మంతర్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఆసుపత్రికి తరలింపు.. ఉద్యమానికి మరింత ఊపుపరిస్థితి విషమించడంతో జూలై 18న ప్రభుత్వం వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. అనంతరం ఆయనను గురుగ్రామ్‌లోని మెదంతా ఆసుపత్రికి మార్చారు. ఆసుపత్రిలోనే ఆయన నిరాహార దీక్ష కొనసాగించడంతో, అది ఉద్యమానికి కేంద్ర బిందువైంది. లక్షలాది మంది తమ వాట్సాప్ డీపీగా "ఐ సపోర్ట్ సోమ్" అనే సందేశంతో వాంగ్‌చుక్ ఫొటోను పెట్టుకున్నారు.ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా, పంపిన సందేశాలు నిరసనకారులకు స్ఫూర్తినిచ్చాయి. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి భారీగా హాజరుకావాలని కూడా వాంగ్‌చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్గొనకపోతే "దెయ్యంలా తిరిగి వస్తాను" అంటూ భావోద్వేగ వ్యాఖ్య కూడా చేశారు.పోలీసుల చర్యలతో మరింత ఉద్ధృతంజూలై 20న వేలాది మంది పార్లమెంట్ వైపు కదిలారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలప్రయోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, వేలల్లో ప్రజలు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. దీంతో ఉద్యమం అత్యున్నత స్థాయికి చేరింది.నిరాహార దీక్ష విరమణపై విమర్శలుజూలై 22న కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీల నేపథ్యంలో వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఆయన తన వైఖరిని సడలించారని విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేయగా, వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవాలని, విమర్శకులు మానవీయ కోణంలో ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఉద్యమం సీజేపీని దాటి..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. "ఇది ఇప్పుడు సీజేపీకి మాత్రమే సంబంధించిన ఉద్యమం కాదు. దేశవ్యాప్తంగా ప్రజలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ ఉద్యమం సీజేపీ కంటే చాలా పెద్దదిగా మారింది. వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్ష విరమించడం మాకు సంతోషమే. ఆయన ఆరోగ్యం గురించి మేము చాలా ఆందోళన చెందాం. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చింది ఆయనే" అని పేర్కొన్నారు.విజయ ప్రసంగంలో మౌనంఉద్యమం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థను దాటి ప్రజల ఉద్యమంగా మారినప్పటికీ.. ఉద్యమానికి బలం, విశ్వసనీయత, పోరాట స్ఫూర్తి అందించిన సోనం వాంగ్‌చుక్ పేరును విజయ ప్రసంగంలో అభిజీత్ దీప్కే ప్రస్తావించకపోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన 26 రోజుల నిరాహార దీక్షే యువత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
CJP విజయంపై రాహుల్-ప్రియాంక ఫస్ట్ రియాక్షన్..!
-
ప్రియమైన బొద్దింకలారా కంగ్రాట్స్.. CJPకి ప్రకాష్ రాజ్ విషెస్
-
LIVE: నారా లోకేశ్ రాజీనామా..!?
-
ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మన విద్యా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చాలా పెద్ద అడుగని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఆయన ఎక్స్‌లో వీడియో రూపంలో మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులందరికీ అభినందనలు. మీ అందరిని చూస్తుంటే గర్వంగా ఉంది. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తును కాపాడేందుకు ధైర్యంగా నిలిచిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. విద్యార్థులను, భారత భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులు, కార్మికులు, పేదలు, ఈ ప్రభుత్వం అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటమే నిజమైన ధైర్యం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించే సమయం వచ్చింది. భయపడొద్దు’’ అని పేర్కొన్నారు. धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है। शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।2 मांगें… pic.twitter.com/Uc2cEOCVKA— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 -
2018 తర్వాత, ఇలా రిజైన్ చేసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు? 2018 ఎమ్జే అక్బర్మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. -
నీట్ బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
-
GEN- Z కేంద్రంకు మా సత్తా ఏంటో చూపించాం..!
-
GEN-Z సంబరాలు ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి..
-
రాజీనామా డిమాండపై భిన్నాభిప్రాయాలు.. బీజేపీకి ఉన్న సమస్య ఏంటి? మాట జారడమే ముంచేసిందా
-
కొడుకు అభిజిత్ దీప్కే విజయంపై తల్లి ఎమోషనల్ వీడియో
-
‘కాక్రోచ్’ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తెలుసా?
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల కారణంగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ ల్యాబ్స్’ (Cockroach Labs) అనే పేరు కూడా ట్రెండ్‌గా మారింది. పార్టీ పేరుకు, అమెరికాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, పేరులోని "కాక్రోచ్" పదం ఒకటే కావడంతో నెటిజన్లు మీమ్స్, పోస్టులతో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కూడా "మా కంపెనీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు" అనే భావనతో సోషల్ మీడియాలో స్పందించడంతో మరింత చర్చ మొదలైంది.ఏమిటీ కాక్రోచ్ ల్యాబ్స్?కాక్రోచ్ ల్యాబ్స్ అనేది అమెరికాకు చెందిన క్లౌడ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థ. ఆధునిక క్లౌడ్ అప్లికేషన్ల కోసం అత్యంత వేగంగా, సురక్షితంగా పనిచేసే ‘కాక్రోచ్డీబీ’ (CockroachDB) అనే డిస్ట్రిబ్యూటెడ్ SQL డేటాబేస్‌ను అభివృద్ధి చేసింది. సిస్టమ్‌లో ఏదైనా సర్వర్ పనిచేయకపోయినా, డేటా కోల్పోకుండా సేవలు కొనసాగించేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా బతికి బయటపడే కాక్రోచ్ (బొద్దింక) పేరును కంపెనీ బ్రాండ్‌గా ఎంచుకున్నారు.ఈ సంస్థను 2015లో ముగ్గురు మాజీ గూగుల్ ఇంజినీర్లు స్పెన్సర్ కిమ్బాల్, పీటర్ మ్యాటిస్, బెన్ డార్నెల్ స్థాపించారు. గూగుల్‌లో భారీ స్థాయి డేటా సిస్టమ్‌లపై పనిచేసిన అనుభవంతో, క్లౌడ్ యుగానికి సరిపోయే కొత్త తరహా డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కంపెనీని ప్రారంభించారు. సంస్థ సహవ్యవస్థాపకుడు స్పెన్సర్ కిమ్బాల్ (Spencer Kimball) ప్రస్తుతం కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. గూగుల్‌లో పనిచేసే ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓపెన్‌సోర్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ GIMP అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.కాక్రోచ్ ల్యాబ్స్ ప్రధాన ఉత్పత్తి ‘కాక్రోచ్డీబీ’. ఈ డేటాబేస్‌ను ముఖ్యంగా బ్యాంకింగ్, ఫిన్‌టెక్ సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు, టెలికాం సంస్థలు, SaaS కంపెనీలు, AI, క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్లు వంటి భారీ స్థాయి సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వర్లలో ఒకేసారి డేటాను నిర్వహించడం, సిస్టమ్ డౌన్‌టైమ్‌ను తగ్గించడం, ఆటోమేటిక్ రికవరీ, హై అవైలబిలిటీ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకత. ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి ప్రధాన క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇది అందుబాటులో ఉంది.కాక్రోచ్ ల్యాబ్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. కాబట్టి దీనికి అధికారిక మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదు. అయితే 2021లో సిరీస్ ఎఫ్ ఫండింగ్ సమయంలో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43,000 కోట్లకు పైగా)గా అంచనా వేశారు. ఇది ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీగానే కొనసాగుతోంది.భారత్‌లో కూడా కార్యకలాపాలు2022లో కాక్రోచ్ ల్యాబ్స్ భారతదేశంలోని బెంగళూరులో తన అనుబంధ సంస్థను నమోదు చేసింది. ప్రస్తుతం భారత్‌లో కూడా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ బృందాలను విస్తరిస్తోంది. ప్రపంచంలోని అనేక పెద్ద సంస్థలు కాక్రోచ్డీబీని ఉపయోగిస్తున్నాయి. వీటిలో నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్, బోస్, ఈక్విఫాక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. అధిక ట్రాఫిక్‌ను నిర్వహించే అప్లికేషన్ల కోసం ఈ డేటాబేస్కు మంచి డిమాండ్ ఉంది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్ చుక్ రియాక్షన్
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అభిజిత్ ఫస్ట్ రియాక్షన్
-
ఇది రా GEN-Z పవర్.. అనుకున్నది సాధించిన CJP.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
CJP సంబరాలు.. మా యుద్ధం ఇంకా పూర్తికాలేదు..!
-
సీజేపీ ప్రభంజనం ఇలా మొదలైంది.. ఇది ఇక ఆగదు
వ్యంగ్యంగా పుట్టింది... విప్లవంగా మారింది. ఒక పోస్టుతో మొదలైన ఉద్యమం లక్షలాది యువత గొంతుకగా నిలిచింది. జంతర్ మంతర్ నుంచి దేశమంతా ప్రతిఘటన జ్వాలలు రగిలించి, అధికారాన్ని ప్రశ్నించే యువశక్తికి ప్రతీకగా ఎదిగింది. కాక్రోచ్ జనతా పార్టీ... యువత ఆగ్రహాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన విప్లవ చరిత్రగా నిలిచింది.‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్య సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ వ్యాఖ్య వల్లే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకొచ్చింది. సుప్రీంకోర్టులో మే 15న సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ జరిపిన విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావం ఏ మాత్రమూ తగ్గలేదు. అప్పట్లో తన వ్యాఖ్యల గురించి సూర్యకాంత్ మాట్లాడుతూ... మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసిందని తెలిపారు. తాను నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చలేదని, నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియా వంటి వాటిలోకి వచ్చిన వారిని తప్పుబట్టానని చెప్పారు. ఓ పనికిమాలిన కేసులో విచారణ జరుపుతున్న సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని ఆయన తెలిపారు. వృత్తిలో... ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అటువంటివారే సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని తెలిపారు తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని సూర్యకాంత్ పలుసార్లు తెలిపినప్పటికీ ఆయన కామెంట్లను యువత సీరియస్‌గా తీసుకుంది.‘‘బొద్దింకలు’’ కామెంట్లతో కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకే విచిత్రంగా జరిగింది. ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. ఇది వ్యంగ్య (సటైరికల్) ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమానికి ప్రతీకగా మారింది. దీని ఆవిర్భావం, పరిణామం, ప్రభావం ఇలా ఉన్నాయి. 2026లో వరుసగా వెలుగులోకి వచ్చిన నీట్ ప్రశ్నపత్రం లీకులు, పరీక్షల నిర్వహణపై ఆరోపణలు, నిరుద్యోగ యువతలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో కొందరు యువ కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల సృష్టికర్తలు కలిసి ఒక వ్యంగ్య రాజకీయ వేదికను ప్రారంభించారు.ప్రజలు రాజకీయ పార్టీలపై నమ్మకం కోల్పోయారని, అవినీతి వ్యవస్థను ఎద్దేవా చేయాలనే ఉద్దేశంతో "కాక్రోచ్ జనతా పార్టీ" అనే పేరు పెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత అణచివేత జరిగినా ఉద్యమం ఆగదనే సంకేతంగా కాక్రోచ్ అనే పేరును పెట్టారు.సీజేపీని ఎవరు ప్రారంభించారు? సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే. ఆయన 30 ఏళ్ల రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో చదువుతున్న సమయంలోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2026 మే 16న ఆయన ఎక్స్‌లో కేవలం ఆరు పదాలతో ఒక పోస్టు చేశారు. "What if all cockroaches come together?" ("బొద్దింకలంతా ఒక్కటైతే?") ఆ పోస్టు కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. అదే సీజేపీ ఉద్యమానికి బీజం వేసింది.ఆ తర్వాత ఏం జరిగింది?ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్ ఎస్ ఆ పోస్టును చూసి, మరో స్నేహితుడితో కలిసి కృత్రిమ మేధ సాయంతో "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో ఒక వ్యంగ్య వెబ్సైట్ రూపొందించారు. అది లక్షలాది మంది యువతకు ఒక వేదికగా మారింది.ఎక్స్ ఖాతాలో ఎంతమంది చేరారు?ప్రారంభ రోజుల్లోనే సీజేపీ ఎక్స్ ఖాతాకు మిలియన్ల మందికి పైగా చేరారు. అనంతరం ప్రభుత్వ చర్యలతో ఆ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మరింత భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల్లోనే 22 మిలియన్ మంది అనుచరులు చేరారు. ఆ తర్వాత అది 25 మిలియన్లకు పెరిగింది.ఉద్యమంలో ప్రముఖంగా కనిపించిన వ్యక్తులు..అభిజీత్ దిప్కే – వ్యవస్థాపకుడు, జాతీయ కన్వీనర్.సోనం వాంగ్‌చుక్ – ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు.మేఘనాథ్ ఎస్ – ఉద్యమాన్ని ఆన్లైన్లో వ్యాపించడంలో కీలక పాత్ర పోషించిన యూట్యూబర్.నకుల్ ధుల్ – నిరసనలకు సంబంధించిన వీడియోలతో వైరల్ అయిన కంటెంట్ సృష్టికర్త.ఆయేషా ఖాన్ – ఉద్యమానికి మద్దతుగా ప్రచారం చేసిన యువ కార్యకర్త.మొదట సామాజిక మాధ్యమాల్లో చిన్న ప్రచారంగా మొదలైన సీజేపీ ఉద్యమం కొన్ని రోజుల్లోనే వేలాది మంది విద్యార్థులను ఆకర్షించింది. నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యార్థుల ఆత్మహత్యల సమస్యను సీజేపీ ఎత్తిచూపింది. దీనికి పరిష్కారం కోసం విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన ప్రారంభించారు.వారి ప్రధాన డిమాండ్లుసీజేపీ తాజాగా డిమాండ్ల జాబితా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి (పూర్తైంది)ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి – పెండింగ్నిరసనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపైనా చర్యలు తీసుకోకూడదు – పెండింగ్ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి – పెండింగ్.ఉద్యమంలో కీలక పరిణామాలుజంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు చేరారు."చలో పార్లమెంట్" పిలుపుతో భారీ ర్యాలీ చేపట్టారు.ఢిల్లీ పోలీసులు పలుమార్లు నిరసనకారులను అడ్డుకున్నారు.లాఠీచార్జ్, వాటర్ కానన్ల ప్రయోగం జరిగింది.వందలాది మంది అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.కొన్ని సమయాల్లో మెట్రో స్టేషన్లు మూసివేశారు.కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ప్రముఖుల మద్దతు దక్కిందిఉద్యమానికి ప్రముఖుల మద్దతు పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారుసామాజిక కార్యకర్త అన్నా హజారే మౌన ఆందోళన నిర్వహించారు.పలువురు ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.దేశ విదేశాల్లోని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.అంతర్జాతీయంగానూ స్పందన వచ్చిందిపాక్లోనూ ఇలా..భారత్‌లో జరుగుతున్న ఈ నిరసనలు పాకిస్థాన్ సహా పలు దేశాల్లో చర్చనీయాంశమయ్యాయి.పాకిస్థాన్‌కు చెందిన కొందరు పాత్రికేయులు, కంటెంట్ సృష్టికర్తలు భారత విద్యార్థుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూ వీడియోలు విడుదల చేశారు."భారత్‌లో యువత ఇలా పోరాడుతోంది... మన దేశంలో ఎందుకు జరగడం లేదు?" అనే చర్చ పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.సీజేపీ ఏం సాధించింది? నీట్ ప్రశ్నపత్రం లీకుల అంశం జాతీయ చర్చగా మారింది.పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విస్తృత చర్చ జరిగింది.ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాయి.దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్యత పెరిగింది.విదేశీ మాధ్యమాలు కూడా ఈ ఉద్యమాన్ని ప్రస్తావించాయి.ఉద్యమం కోరిన అన్ని డిమాండ్లు నెరవేరాయిముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారుపరీక్షా సంస్కరణలు వంటి డిమాండ్లు నెరవేరుతున్నాయివిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చివరకు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ తొలి ప్రధాన డిమాండ్ నెరవేరింది. విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాజీనామాను తమ పోరాటానికి తొలి విజయంగా సీజేపీ ప్రకటించింది. మిగిలిన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది.సీజేపీ ఎందుకు ప్రత్యేకం?సాధారణ రాజకీయ పార్టీలా కాకుండా, వ్యంగ్యాన్ని ఆయుధంగా తీసుకుని యువతను పెద్ద ఎత్తున ఒక వేదికపైకి తీసుకురావడం సీజేపీ ప్రత్యేకత. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తూ, నిరసనలను సృజనాత్మకంగా నిర్వహించడం వల్ల ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి ఉద్యమాలకు సాధారణంగానే అంతు అనేది ఉండదు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు?
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై సీజేపీ, విద్యార్థులు గత 23 రోజులుగా చేపట్టిన ఉద్యమం విజయం సాధించింది. వీరి ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా యువతలో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురైన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపధ్యంలోఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో విద్యాశాఖను ఎవరు చేపట్టబోతున్నారు, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై చర్చ తీవ్రమైంది.కొత్త విద్యామంత్రి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం రాలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ లోపుగా ప్రధానమంత్రి సాధారణంగా ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రికి ఆ శాఖను అదనపు బాధ్యత (Additional Charge) కింద అప్పగిస్తారు. విద్యాశాఖ బాధ్యతలను ఏదైనా సీనియర్ క్యాబినెట్ మంత్రికి అదనపు బాధ్యతగా అప్పగించవచ్చు లేదా ఆదివారం సాయంత్రం నాటికి కొత్త నియామకం ఉత్తర్వులు రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాజీనామా అనంతరం ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని మరో అంచనా. సినియర్ క్యాబినెట్ మంత్రులకు అదనపు బాధ్యతలను మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, లేదా భూపేందర్ యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి సమర్థవంతమైన పాలనా అనుభవం ఉన్న సీనియర్లకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తరువాత విద్యాశాఖ మంత్రి పదవిని స్వయంగా ప్రధానమంత్రే స్వీకరిస్తారా? లేక సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ, లేదా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కి అప్పగిస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఫడ్నవీస్‌కు పిలుపుమరోవైపు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఢిల్లీ పెద్దలనుంచి పిలుపు రావడం మరింత ప్రధాన్యతను సంతరించుకుంది. ఫడ్నవీస్‌తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే మేధావి, విద్యావంతుడైన ఫడ్నవీస్ విద్యా శాఖమంత్రిగా అర్హుడని శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, విద్యాశాఖలో కీలక సంస్కరణల నేపథ్యంలో ప్రత్యా మ్నాయంగా, విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న సహాయ మంత్రుల్లో (జయ్ చౌదరి లేదా సుకాంత్ మజుందార్) ఒకరికి స్వతంత్ర హోదా (Independent Charge) ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంచనా. విద్యాశాఖను తాత్కాలికంగా ఎవరికి అప్పగిస్తారు? లేదా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా సస్పెన్స్ తప్పదు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వాంగ్‌చుక్ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీ: ఇది ప్రజాస్వామ్య విజయం అని ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలన్నారు. ఇకపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీజేపీ,జెన్‌జీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విజయానికి సంకేతంగా 'వి' గుర్తును చూపుతున్న దృశ్యాన్ని ఆయన పంచుకున్నారు.నీట్ లీకేజ్‌లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.అయితే, ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం(జులై, 18) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిన ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఆయన దీక్ష విరమించారు. ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. -
కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం గెలిచింది సీజేపీ నేతలు అన్నారు. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాజీనామాకు తమ ఉద్యమమే కారణమని చెప్పుకున్నారు. "మేము ఇది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు" అని దీప్కే వ్యాఖ్యానించారు. "ఈ రాజీనామా ఒక రుజువు.. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వం ముందు తలవంచకపోతే, ఎవరి రాజీనామాను అయినా మనం సాధించగలం" అని ఆయన అన్నారు.కేంద్ర మంత్రి రాజీనామాతో NEET-UG వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. తదుపరి విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది, అలాగే పరీక్షా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణలపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో ఆసక్తి నెలకొంది.#WATCH | Delhi: Moment when Union Education Minister Dharmendra Pradhan resigned from his post; visuals from the protest at Jantar Mantar pic.twitter.com/6YNf9LN3bN— ANI (@ANI) July 25, 2026 -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం...జంతర్-మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను...నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.pic.twitter.com/VSArqS98OJ— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026 -
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్‌పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్‌పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
చర్చల్లో బిగ్ ట్విస్ట్.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మూడో విడత చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. రాజీనామాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చర్చలను కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని శనివారం తేల్చిచెప్పింది.సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమకు చర్చలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు.Dharmendra Pradhan’s resignation is NON-NEGOTIABLE.If it’s a no from the government, there’s no point of further discussion.— Ashutosh Ranka (@AshutoshRanka) July 25, 2026‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చర్చలు’నీట్ సహా పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు సీజేపీ చేసిన ఈ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో సీజేపీ తన ప్రధాన డిమాండ్‌పై మరింత కఠిన వైఖరి ప్రదర్శించింది.రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలతఇప్పటికే జరిగిన చర్చల్లో సీజేపీ చేసిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదన్న డిమాండ్పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్న డిమాండ్ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇందుకోసం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇచ్చాకే చర్చలను ముందుకు తీసుకెళ్తామని సీజేపీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.రాజీనామాకు నో?మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల అభిప్రాయం. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సంస్కరణలు చేపట్టడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న సీజేపీప్రధాన్ రాజీనామాపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. చర్చల ఫలితం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం కేంద్రం–సీజేపీ మధ్య ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మూడో విడత చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్‌ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్‌ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్‌పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్‌పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్‌తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్‌చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్‌చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్‌చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్‌గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్‌చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
ఒక్కరి రాజీనామాతో ఆగదా?: సీజేపీ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది. కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.‘ఇక డిమాండ్లు మారొచ్చు’సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది. ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్‌కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు. అంతకు ముందు దీప్కే కూడా..విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నీట్ వివాదం.. బాధ్యతపై పోరునీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే తర్వాత జరిగేది ఇదే..
-
రాజీనామా కుదరదు!
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. పదవికి రాజీనామా చేయడం చాలా సులభమైన పనే అయినప్పటికీ.. అలా చేస్తే ప్రజలు అప్పగించిన బాధ్యత నుంచి పారి పోవడమే అవుతుందని శుక్రవారం పేర్కొన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆయన రాజీనామా చేయబోరని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’’అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ సమావేశమైన రోజే ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో నామమాత్రపు చర్యలు చేపట్టడానికి బదులుగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్టీఏకు సంబంధించిన లోపాలపై సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని సరిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభం కానుంది. పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దోషులపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దాకా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. -
ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందే.. రాజీ ప్రసక్తే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తేల్చిచెప్పింది. ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ నెల 20న నిరసన సందర్భంగా విద్యార్థులపై క్రూరంగా దాడి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణ చెప్పాలని స్పష్టంచేసింది. పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఢిల్లీలో రెండో విడత చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, సీజేపీ తరఫున పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా పాల్గొన్నారు. తాజా పరిణామాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులకు అందజేశారు. ప్రస్తుతం సీజేపీ పోరాటం మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాజీనామా చేసే దాకా విడిచిపెట్టబోమని ఆ పార్టీ పదేపదే చెబుతోంది. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రధాన్ రాజీనామా చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకారం! కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ మూడు డిమాండ్లలో రెండింటికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. గడువులోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తమఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపబోమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉద్వాసన పలుకుతారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సీజేపీ డిమాండ్లలో రెండింటికి తాము అంగీకరించినట్లు కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు మరోసారి చర్చలు: నడ్డా సీజేపీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వారితో శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నాటి భేటీ అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లతోపాటు పరీక్షల కోసం ఐదు సంస్కరణలు సూచించారని వెల్లడించారు. అంతర్గతంగా చర్చించి.. తీసుకున్న నిర్ణయాలను శనివారం మధ్యాహ్నం జరిగే మూడో విడత భేటీలో వారికి తెలియజేస్తామని పేర్కొన్నారు. సీజేపీ ప్రధాన డిమాండ్లు → దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. → పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు తదితర పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున ఆర్థిక పరిహారం చెల్లించాలి. → న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే బేషరతుగా కొట్టివేయాలి. -
రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్‌మంతర్‌లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
విజయవాడలో అడ్వకేట్స్ ఆందోళన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
-
CJP నిరసనలపై ఉక్కుపాదం NSA చట్టం అమల్లోకి
-
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్‌లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.కేంద్రం ప్రయత్నాలుమరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తంఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్ మంతర్ నుంచి కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.కేబినెట్ భేటీఅటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. పేపర్ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాంగ్‌చుక్ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపుప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నీట్ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. -
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ వ్యవహారంలో చర్చలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రధానమైన మూడు డిమాండ్లను నెరవేర్చేవరకు చర్చలు జరిపే సమస్యే లేదని తేల్చి చెప్పారు. సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యపై సభలో తాను స్పందించాలనుకున్నప్పుడు తన మైక్ లాగేసుకున్నారని విమర్శించారు. అలాగే విద్యార్థుల డిమాండ్స్ ప్రకారం నీట్ పేపర్ లీక్‌కు బాధ్యుడు, అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, విద్యార్థులపై దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను తొలగించే వరకు చర్చలుండవంటూ ప్రతిపక్షం వైఖరిని స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాదోపవాదాల మధ్య సోమవారానికి లోక్‌సభ వాయిదా పడింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం #WATCH | Delhi: "...the students have three demands: 1) Corrupt Education Minister has to go, 2) Action against those who attacked students and beat them up, 3) PM should apologise to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any… pic.twitter.com/3KrKv60CIL— ANI (@ANI) July 24, 2026 -
ధర్మేంద్ర రాజీనామా నుంచి PM మోదీ రాజీనామా వరకు వెళ్లిందంటే.. నెక్స్ట్ జరగబోయేది అదే..
-
జంతర్ మంతర్‌కు మీరే రావాలి.. సర్కారుకు CJP హెచ్చరిక
-
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్‌తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA— ANI (@ANI) July 24, 2026మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు. -
వినీత్ జోషి బదిలీ.. అంతటి సమర్థుడ్ని ఎలా తప్పించారు?!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్‌ను నియమించింది. వినీత్ జోషికి మాత్రం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బదిలీపై ఇప్పుడు చర్చ మొదలైంది.విద్యా వ్యవస్థలో కీలక ముఖం.. 1992 బ్యాచ్‌కు చెందిన మణిపూర్ క్యాడర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషి.. కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్ జనరల్‌గా వినీత్ జోషి పనిచేశారు. నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను నిర్వహించే సంస్థ ప్రారంభ దశలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.CBSE ఛైర్మన్‌గా మరో కీలక బాధ్యతను చేపట్టిన ఆయన.. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాలు, విద్యా ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో పనిచేశారు. అంతకుముందు మణిపూర్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత పరిపాలనా అనుభవం ఉన్న వినీత్ జోషి.. విద్యా రంగంలో కీలక సంస్థలకు నాయకత్వం వహించిన అధికారిగా గుర్తింపు పొందారు.అనుభవజ్ఞుడి స్థానంలో మరో సీనియర్వినీత్ జోషి స్థానంలో నియమితులైన నరేశ్ పాల్ గంగ్వార్ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఆయన.. కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన గంగ్వార్.. అంతకుముందు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.పరీక్షల నిర్వహణ, విద్యా రంగంలో ప్రత్యేక అనుభవం ఉన్న వినీత్ జోషి స్థానంలో.. పరిపాలనా అనుభవం ఉన్న మరో సీనియర్ అధికారిని కేంద్రం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ వివాదం వేళ మార్పునీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే వినీత్ జోషి రూపంలో తొలి వికెట్ పడిందా?అనే చర్చ జోరుందుకుంది. బాధ్యతను అధికారులపైకి మళ్లించే చర్యగా కొందరు ఈ ‘ట్రాన్స్ఫర్’ను విమర్శిస్తున్నాయి. అయితే వినీత్ జోషితో పాటు మరికొందరి మార్పు జరగడంతో పరిపాలనా మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే.. కేంద్ర వర్గాల నుంచి దానికి కూడా సరైన సమాధానం ఇంకా రాలేదు.ఎందుకిలా?వినీత్ జోషి సుదీర్ఘ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి. అయితే పరీక్షల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఆయన బదిలీ కావడం చర్చకు కారణమైంది. నీట్ వివాదానికి అసలు బాధ్యత ఎక్కడ ఉంది? వ్యవస్థలో లోపాలా? అధికారుల నిర్లక్ష్యమా? లేదంటే విధానపరమైన సమస్యలా? అన్నది భవిష్యత్తు పరిణామాలు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నీట్ వివాదం మధ్య జరిగిన ఈ ఉన్నత స్థాయి అధికార మార్పు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసే అవకాశం లేకపోలేదు. -
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్‌మంతర్‌కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు కోహ్లి, శుబ్‌మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026 -
మోదీ వీడియో.. వాంగ్‌చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్‌చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్‌చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్‌చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్‌స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్‌చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్‌చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
జవాబుదారీతనం పెంచేలా లేదు
న్యూఢిల్లీ: పేపర్ లీక్ కేసుల్లో విచారణ పట్ల ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ ప్రకటన పరీక్షల్లో జవాబుదారీతనం పెంచేలా లేదని పేర్కొంది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘హాయ్.. నా పేరు ఏమీ లేదు’అనే శీర్షికతో ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోను షేర్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్‌మంతర్‌ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తేలి్చచెప్పారు. పేపర్ లీక్ కేసులపై మోదీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసలైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని ఆక్షేపించారు. ప్రశ్నపత్రం లీక్ అయిన శిక్ష విధిస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతోందన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలని చెప్పారు. గాయం అయిన తర్వాత మందు పూయడం కంటే అసలు ఆ గాయం జరగకుండా నివారించడమే తెలివైన పని అని సూచించారు. వ్యవస్థను నడిపే వారికి జవాబుదారీతనం, సామర్థ్యం లేకపోవడం వల్లే ఇలాంటి గాయాలు పునరావృతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవచ్చని చెప్పారు. పేపర్ లీక్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని మోదీ వైపు ఎక్కువగా మళ్లుతోందని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారుల సంఖ్య పెరుగుతోందని రాంకా పేర్కొన్నారు. -
నేడు దేశవ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, మంత్రి ధర్మేంద్ర రాజీనామా విషయాల్లో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ సీజేపీ శుక్రవారం దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరపాలని ప్రజలను కోరింది. ‘ప్రతి జిల్లాలో ఒక రోజంతా ఒక్కటే డిమాండ్’పేరిట నిరసన ప్రదర్శనలు జరగాలని సీజేపీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వ వ్యతిరేక నినదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రభుత్వం ఆ పరిసరాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలను మొహరించారు. పలు చోట్ల బ్యారీకేడ్లను పెట్టడంతో కన్నాట్ ప్లేస్ చుట్టూతా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీక్షాస్థలి వైపునకు రాకుండా కొత్త వాళ్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఉద్యమంతోసంబంధంలేని ‘బయటి వ్యక్తులు’, గూండాలను బీజేపీ ఇక్కడికి తరలిస్తోందని సీజేపీ ఆరోపించింది. పోలీస్ యూనిఫాం లేని కొందరు పోలీస్ బ్యాటన్లు పట్టుకుని విద్యార్థులను బెదిరిస్తున్న వీడియోను సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్‌మీడియాలో విడుదలచేశారు. సమీప కన్నాట్ ప్లేస్‌లోని దుకాణదారులు గురువారం సాయంంత్రం ఆరున్నరకల్లా షాప్‌లు మూసేశారి న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రతికూల వాతావరణంలోనూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు తమ సాయం ఎప్పుడూ ఉంటుందని జంతర్‌మంతర్ వద్ద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు చెలరేగే ఆస్కారముందని, ముందుజాగ్రత్తగా 16 ఢిల్లీ మెట్రోస్టేషన్లను గంటల తరబడి అధికారులు మూసేశారు. 14 గంటల తర్వాత సాయంత్రం రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లను మాత్రం తెరిచారు. అయితే శుక్రవారం అన్ని మెట్రో స్టేషన్లనూ మూసేస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ గురువారం జంతర్‌మంతర్ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా స్తంభింపజేసింది. జూలై 17వ తేదీ నుంచి ఇలా ఇంటర్నెట్ను నిలిపేయడం ఇది ఐదోసారి. వాళ్ల పోస్పోర్ట్లు రద్దు! రణరంగంగా మారిన జూలై 20నాటి పార్లమెంట్ ర్యాలీ ఉదంతంలో పాల్గొన్న నిరసనకారుల పాస్‌పోర్ట్‌లు రద్దయ్యే ప్రమాదముందని ఢిల్లీ పోలీస్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు ఛలో సంసద్ ర్యాలీలో క్రియాశీలంగా పాల్గొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని, పోలీసులపై దాడులుచేసిన వారిని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, భద్రతా బలగాల బాడీకామ్లు, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా గుర్తించి వారి పాస్‌పోర్ట్‌లను రద్దుచేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
అవే డిమాండ్లు.. అదే ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో అవే నినాదాలు, ప్రభుత్వ వైఖరి పదేపదే పునరావృతమవుతున్నాయి. ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై ప్రభుత్వం జవాబుదారీ వహించాలని విపక్షపార్టీల ఎంపీలు పార్లమెంట్లో గురువారమూ నినదించారు. ఎలాంటి షరతులు లేకుండా చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే చర్చలకు సుముఖత వ్యక్తంచేస్తామని విపక్ష ఎంపీలు భీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో నాలుగో రోజూ ప్రతిష్టంభన రాజ్యమేలింది. విపక్షాల ఆందోళనల నడుమ ఇరుసభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి అదే తంతు... ఉభయసభల్లోనూ గురువారం సైతం నీట్ లీకేజీ, విద్యార్థులను కర్కశంగా పోలీసులు చితకబాదడంపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ఆరంభమైన వెంటనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎంత కాలమైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ వివాదం తర్వాత తీసుకున్న చర్యలు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తీసుకున్న చర్యలపై చర్చకు అనుమతించాలని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘మేము నిన్న విజ్ఞప్తి చేశాము. ఈ రోజు మీ ద్వారా సభకు మళ్ళీ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఇతర ప్రతిపక్ష సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడాం. మమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీ సూచనలు పంచుకోవాలని వారిని ఆహ్వానించాం. దయచేసి చర్చను ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించాలని మేము ప్రతిపక్షాన్ని చేతులు జోడించి అభ్యరి్థస్తున్నాం. అలాకాకుండా షరతులు విధిస్తూ, సాకులు చెబుతూ ఉండే విపక్షం చర్చను తప్పించుకోవాలలని చూస్తోందని అందరూ అర్థం చేసుకుంటారు. లీకేజీ అంశాన్ని రాజకీయం చేయొద్దు’’అని కోరారు. రాజీనామా తర్వాతే చర్చ: ఖర్గే రిజిజు ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌పై 267వ నిబంధన కింద చర్చ కోరామని, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నారు. ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేసిన తర్వాతే చర్చలో పాల్గొంటామని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ అదే అంశంపై సమాధానం ఇవ్వడం సరికాదన్నారు. స్పీకర్‌ను విడిగా కలిసిన రాహుల్, అమిత్ షా లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాం«దీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, సౌగత రాయ్ తదితరులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సభా నిబంధనల ప్రకారం చర్చకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉభయసభలు గురువారానికి వాయిదాపడ్డాక హోం మంత్రి అమిత్ షా సైతం స్పీకర్ బిర్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రెండు భేటీల్లో చర్చించిన వివరాలు వెల్లడికాలేదు.పోటాపోటీగా నిరసనలుపార్లమెంట్ ఆవరణలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం ఆందోళన కొనసాగించింది. ప్రధాని నివాసం వద్ద రాహుల్‌గాంధీ తదితర నేతలు నిరసనకు దిగడాన్ని తప్పుబడుతూ ఎన్డీఏ ఎంపీలూ పోటీగా నిరసన చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘యువతను రెచ్చగొట్టొద్దు. రాహుల్ గాంధీ హోష్‌లోకి రండి’అని ఎన్డీఏ ఎంపీ నినదించారు. ‘ఇండియా’కూటమి ఎంపీలు ‘ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలి‘, ‘ప్రాణాలు కాపాడండి.. నీట్‌ను రద్దు చేయండి’, ‘బుద్ధి తెచ్చుకోండి’, ‘వందేమాతరం’అని రాసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాం«దీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ప్లకార్డు లాక్కునే యత్నం నిరసనల సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ ప్రశాంత్ పడోలే చేతిలో ఉన్న ప్లకార్డును ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అధికారపక్ష సభ్యులు తమ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కోట్ల ఆస్తులు.. లక్షల ఆదాయం.. ధర్మేంద్ర ప్రధాన్ నెట్‌వర్త్!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆస్తులు, ఆదాయం, పెట్టుబడులపై కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2024 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం మొత్తం ప్రకటించిన ఆస్తుల విలువ రూ.6.92 కోట్లు కాగా, అప్పులు రూ.2.30 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు. ఆయన భార్య మృదులా ఠాకూర్ మాత్రం అదే ఏడాది రూ.49.92 లక్షల ఆదాయం పొందారు. చేతిలో నగదు విషయానికి వస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద రూ.35 వేలు, ఆయన భార్య వద్ద రూ.40 వేలు ఉన్నాయి. ఇద్దరు పిల్లల వద్ద కలిపి మరో రూ.17 వేలు నగదు ఉండటంతో కుటుంబం మొత్తం చేతిలో ఉన్న నగదు రూ.92 వేలుగా నమోదైంది.పెట్టుబడుల విషయానికి వస్తే.. బ్యాంక్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆర్థిక పెట్టుబడులు కలిపి కుటుంబం వద్ద సుమారు రూ.2.47 కోట్లు ఉన్నట్లు సమాచారం. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షలు, బీమా పాలసీల్లో రూ.67.72 లక్షలు పెట్టుబడిగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల నుంచి రూ.31.38 లక్షల లోన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.స్థిరాస్తుల విషయానికి వస్తే.. ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి. అలాగే ఘాజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఒక అపార్ట్మెంట్, భువనేశ్వర్‌లో మరో నివాస గృహం కలిపి సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లను ధర్మేంద్ర ప్రధాన్, ఆయన భార్య కలిగి ఉన్నారు.2011 మోడల్ హోండా సిటీ కారు, 200 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి కూడా తమ వద్ద ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.13.5 లక్షలు. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి ఉండగా, వాటి విలువ సుమారు రూ.35 లక్షలు. కంప్యూటర్, గృహోపకరణాలు వంటి ఇతర వస్తువులు కలిపి మరో రూ.6 లక్షల విలువైన ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు! -
‘టైం, ప్లేస్ మీరే చెప్పండి’.. సీజేపీతో చర్చలకు కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి కేంద్రం సీజేపీని చర్చలు ఆహ్వానించింది. మీ ఇష్టం. టైం, ప్లేస్ ఎక్కడో మీరే చెప్పండి అన్ని సమస్యల్ని చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన తక్షణ రాజీనామా, నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, చలో సంసద్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఉపసహరణపై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ నేతలతో చర్చించేందుకు కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం నుంచి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపాం. అన్నీ సమస్యలపై కేంద్రం వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు జరిపేందుకు సమయం, ప్లేస్ వాళ్లం ఇష్టం.ఈ చర్చల్లో నాతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం పాల్గొంటారు. ఈ చర్చలు జేపీ నడ్డా ఇల్లు, కార్యాలయంలో జరిపితే బాగుంటుందని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మాకు ఎలాంటి అహంభావం లేదు. చర్చల ద్వారా సమస్యల్ని క్రమంగా పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న నిరంతర చర్యల్లో ఇది ఒక భాగం. చర్చల్లో పాల్గొనాల్సిందిగా సీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. చర్చలు జరిపేందుకు కేంద్రం పంపుతున్న ఆహ్వానాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. మాతో చర్చలు జరపాలని అనుకుంటే కేంద్రమే మా వద్దకు రావాలి. మా డిమాండ్స్‌కు కట్టుబడాలి. అయితే, జంతర్‌మంతర్‌లో కేంద్రం మాతో చర్చలు జరపాలి. ఆ విషయంలో వెనక్కితగ్గబోమన్నారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ మార్చికి పిలుపునిచ్చిన తరుణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇవాళ ప్రధాని మోదీ పేపర్ లీకేజీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులపై సత్వరమే విచారణ, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. #WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon...This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa— ANI (@ANI) July 23, 2026 -
మోదీ ట్వీట్‌కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్‌పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
నీట్‌ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్‌ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్‌ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్‌కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్‌పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్‌లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్‌లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్‌పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్‌గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్‌ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్‌కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్‌కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్‌కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో చండీగఢ్‌లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్‌లపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్‌పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్‌లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్‌లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్‌పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్‌పూర్‌లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన, విద్యార్థుల సమస్యలను చట్టం, వ్యవస్థ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీ.. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో జరిగింది. అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ద్వారా నిరసనకారులను చెదరగొట్టారు.ఈ నేపథ్యంలో స్పందించిన అన్నా హజారే తన లేఖలో ప్రజాస్వామ్యంలో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అవసరం లేని బలప్రయోగానికి స్థానం లేదని పేర్కొన్నారు. పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగం వంటి అంశాలపై యువత వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని కోరారు. నీట్ (NEET) పరీక్ష వివాదాన్ని ప్రస్తావించిన హజారే, ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులపైనే బాధ్యత మోపడం సరికాదన్నారు. సంబంధిత శాఖకు రాజకీయ బాధ్యత వహించే మంత్రులు కూడా జవాబుదారీతనం చూపాలని సూచించారు. అవసరమైతే శాఖా వైఫల్యాలపై మంత్రిని తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినదని, బాధ్యతాయుత పాలనకు అది సంకేతంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.‘ప్రజాస్వామ్యంలో ఘర్షణ కంటే సంభాషణే ఉత్తమ మార్గం. ప్రజల గొంతును ప్రతిపక్ష స్వరంగా మాత్రమే చూడకూడదు. విభేదాలు సహజం. వాటిని చర్చలు, పరస్పర గౌరవంతో పరిష్కరించాలి’ అని హజారే లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ఆందోళనల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. మరోవైపు లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష విషయంలో కూడా ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని అన్నా హజారే మరోసారి విజ్ఞప్తి చేశారు. -
ప్రధాన్ రాజీనామాకు విపక్షాల పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ సమావేశాల మూడో రోజూ ప్రతిష్టంభన నెలకొంది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల దాష్టీకం, ప్రధాన్ రాజీనామా డిమాండ్ అంశాలపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో సభా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వం నీట్ అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, ముందుగా ప్రధాన్ రాజీనామా చేయా లని ప్రతిపక్షం పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఉభయ సభల ఆరంభానికి ముందే నీట్‌పై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, హిబి ఈడెన్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. నల్ల దుస్తులు ధరించి లోక్‌సభకు హాజరైన విపక్షాల ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలయ్యాక కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. నీట్‌పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘విద్యార్థుల భవిష్యత్తు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. నీట్ పేపర్ లీక్, పరీక్షల పారదర్శకత, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని తెలిపారు. చర్చ ఏ తేదీన నిర్వహించాలనేది స్పీకర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయిస్తామని చెప్పారు. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. విద్యార్థుల లాఠీచార్జ్ ఉదంతంపై ప్రధాని సభలో ఎందుకు ప్రకటన చేయలేదు? అని నిలదీశారు. ‘‘ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తీరా చర్చిద్దామంటే ముందుగా ధర్మేంద్ర మంత్రి పదవికి రాజీనామాచేయాలనే కొత్త షరతు పెడుతున్నారు. అమలుసాధ్యంకాని షరతులు పెట్టి చర్చకు కాంగ్రెస్ మోకాలడ్డుతోంది’’అని రిజిజు విమర్శించారు. -
విద్యార్థులు ఉగ్రవాదులు కాదు
న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, వాటిపై రాజీ పడటానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్–యూజీలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదని.. వారు కేవలం నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాల వల్ల నష్టపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలన్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోను రాహుల్ ప్రదర్శించారు. ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారని, అందుకే విద్యార్థులను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి..‘‘ప్రధానమంత్రి నివాసం వద్ద మంగళవారం శాంతియుత నిరసనలో పాల్గొన్న నన్ను బలవంతంగా ఈడ్చేశారు. భౌతిక దాడి చేశారు, నిర్బంధించారు. అవన్నీ నేను లెక్కచేయను. అవి చాలా చిన్న విషయాలు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే నా పని. ఇప్పుడున్న విద్యా వ్వవస్థ వల్ల పేదలు ఇబ్బంది పడుతుండగా, ధనవంతులు పేపర్ లీక్‌లతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాలి. విద్యార్థులు లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్య పేరిట దోచుకుంటున్నారు మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. భద్రతా దళాలు వారిపై ఆయుధాలు గురిపెట్టడానికి, దాడి చేయడానికి విద్యార్థులు చేసిన తప్పేంటి? వారు ఈ దేశం తమకు ఇవ్వాల్సిన వాటిని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని అంటున్నారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతులేని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ నేడు లోపాలమయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. గత దశాబ్ద కాలంలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. కానీ, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. విద్యా వ్యవస్థ వైఫల్యం కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. సమాజంలో ఒక వర్గం వ్యక్తులు మన విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మన దేశంలో కుటుంబాలు విద్య కోసం చేసే వార్షిక వ్యయం రూ.1.32 లక్షల కోట్లు. ఇది రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్‌కు దాదాపు సమానం. విద్య పేరిట కుటుంబాలను దోచుకుంటున్నారు. దేశంలో తయారీ రంగం మూతపడింది, పరిశ్రమల్లో అవకాశాలు లేవు, కార్పొరేట్ ఉద్యోగాలు లేవు. ఇక మిగిలిన ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. అవి కూడా దక్కకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు’’ అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.జితేంద్ర సింగ్ గురించి చర్చ అనవసరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. జితేంద్ర సింగ్‌ను ‘అప్రస్తుత వ్యక్తి’గా అభివరి్ణంచారు. నీట్–యూజీపై చర్చకు రాహుల్ తొలుత అంగీకరించి, తర్వాత మాట మార్చారని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారని జితేంద్ర సింగ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ బుధవారం స్పందించారు. ‘‘జితేంద్ర సింగ్ తనకు నచ్చిన ఎలాంటి విషయాన్నైనా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆరోపణల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గురించి చర్చ నిరర్థకమని పేర్కొన్నారు. పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్ ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం మానసికంగా కుప్పకూలిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. నాతో ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించినా పట్టించుకోను. విద్యా వ్యవస్థపై, పత్రాల లీకేజీలను అరికట్టడంపై, పిల్లలకు చెల్లించాల్సిన ఖర్చులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా విషయంలో నచ్చింది చేసుకోండి. ఐదు రెట్లు కాదు కదా పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్. పోలీసులు నాతో ప్రవర్తించిన తీరువల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. దెబ్బలు తినడం నాకు అలవాటే. అది సమస్యేమీ కాదు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఒకటి రెండు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు. ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు నన్ను ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ప్రభుత్వాన్ని తొలగించమని నా చెవిలో చెప్పారు. ఆ భావన వారిలో ఉంది. జరిగిన దానిపై పోలీసులు కూడా సంతోషంగా లేరు. విద్యార్థులపై దాడి చేయడం దేశ భవిష్యత్తుకు వ్యతిరేకమైన నేరమని వివేకవంతులైన కొందరు పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. నిరసనకారుల్లో తమ పిల్లలను చూసుకుంటున్నారు. -
30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్ : ఈయన్ని గుర్తు పట్టారా?
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు విద్యార్థకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 1997 పేపర్ లీక్ నిరసనలో పాల్గొన్న విద్యార్థినేత నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ (1996లో 16 రోజుల ప్రభుత్వం) తర్వాత, విద్యార్థి ఉద్యమాల ద్వారా వచ్చి విద్యాశాఖను చేపట్టిన కొద్దిమంది నాయకుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు. ఈ శాఖను 'విద్యా మంత్రిత్వ శాఖ'గా పేరు మార్చిన కొద్ది నెలలకే ఆయన ఈ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పటి రోజుల నుంచి ఆసక్తికర విషయాలు, ఆయన సహచరులు పంచుకున్నారు.In 1997, this man was the ABVP National Secretary and was just about to join the Bharatiya Janata Party. There was a paper leak in Odisha and there was a major protest. This man participated in them. He was beaten by the police. "We staged a protest against the Odisha… pic.twitter.com/U8UojIQ9BF— Mohak Mangal (@mohakmangal) July 22, 2026ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి విద్యార్థి ఉద్యమాలు - పోరాటాలుప్రధాన్ 1983లో ABVP లో చేరి, 1994 నుండి 1997 మధ్య రెండుసార్లు జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఉత్పల్ యూనివర్సిటీలో ఎమ్.ఏ (ఆంత్రోపాలజీ) చదివే రోజుల్లోనే ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ,భువనేశ్వర్‌లోని RMD డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ రౌత్ కొన్ని అనుభవాలను పంచకున్నారు. ఒడిశాలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సచివాలయం ముందు 1,500 మంది విద్యార్థులతో శాంతియుతంగా ఆందోళన చేపట్టినప్పుడు, పోలీసులు చేసిన లాఠీఛార్జీలో ఆయనకు తీవ్ర గాయాలై, ఎముకలు విరిగాయని తెలిపారు.అలాగే యూనివర్సిటీ ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని తెలిసిన అధికార పార్టీ (జనతా దళ్) కార్యకర్తలు ఆయనపై దారుణంగా దాడి చేశారు. ఆ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని ఆయన జూనియర్ ప్రశాంత్ రౌత్ గుర్తుచేసుకున్నారు.మూడు పెన్నులు ముద్దుపేరు'ముకూ' (Muku)బీజేపీ అధికార ప్రతినిధి సుదీప్త్ కుమార్ రే తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన్ ఎప్పుడూ తన వద్ద ఎరుపు, నీలం, నలుపు రంగుల పెన్నులను ఉంచుకునేవారు. డాక్యుమెంట్లను కూలంకషంగా విశ్లేషించి మార్క్ చేయడానికి వీటిని వాడేవారు. అందుకే ఆయన్ను ఒడిశాలోని తన స్నేహితులు, సహచరులు ఆయన్ను ప్రేమగా 'ముకూ' అని పిలుస్తారట.ఒకసారి డెంగ్యూ, సెరిబ్రల్ మలేరియాతో ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా, తనకు కాపలాగా ఉంటూ చలికి వణుకుతున్న తన జూనియర్‌కు రాత్రి వేళ తన దుప్పటిని కప్పి తన ఉదారతను చాటుకున్నారు.అలాగే ప్రధాన్ ప్రతి ఏటా జరిగే ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్రలో ఎలా పాల్గొనేవారో, ఆ దూరాన్ని నడిచి వెళ్లాలని ఎప్పుడూ పట్టుబట్టేవారని కూడా గుర్తుచేసుకున్నారు.ఇదీ చదవండి: ఫీఫా ట్రోఫీ నెత్తుకున్న యువరాణి, ఎవరీ మనోహరి : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్విద్యాశాఖ కంటే ముందు ఆయన పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందిస్తూ కరోనా సమయంలో దేశానికి నిధుల అవసరం ఎక్కువగా ఉందని, భారత్‌ను 'భారత్‌ను గ్యాస్లెస్ ఎకానమీ'గా మార్చే పెద్ద ప్రణాళికలో ఇది భాగమని, భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన తెలిపినట్లు సుదీప్త్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాన్ తల్లిదండ్రులు తండ్రి మాజీ కేంద్ర మంత్రి దేబేంద్ర ప్రధాన్, తల్లి బసంత మంజరి ప్రధాన్. మంత్రి భార్య మృదుల ప్రధాన్ కూడా చాలా కాలం పాటు ఏబీవీపీలో పనిచేశారు. పెళ్లి తర్వాత దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ -
నీట్ లీక్.. రాజీనామా కచ్చితంగా చేయాలా??
ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్‌కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.గతం ఏం నేర్పింది మరి?నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!. లాల్ బహదూర్ శాస్త్రి..స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.టీటీ కృష్ణమాచారి..1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.మాధవరావ్ సింధియా.. 1992లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం1999లో పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.జార్జ్ ఫెర్నాండెజ్..2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్‌కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ::వెబ్ ప్రత్యేకం -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సంబంధించి అప్డేట్స్.. -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు అలాగే ఢిల్లీలో సీజేపీ నిరసనకారులపై పోలీసుల చర్యలను తప్పుబట్టారు. ‘ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై నేను బీజేడీ ఎంపీలతో ఇప్పుడే సమావేశం నిర్వహించాను. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎంతో మంది యువ విద్యార్థులపై హింసాత్మక దాడి జరిగింది. బీజేడీ ఎంపీలు వారిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు... నేను రేపు ఉదయం ముఖ్యమైన పనుల నిమిత్తం భువనేశ్వర్‌కు వెళ్లాలి. మా ఎంపీలు అన్ని పరిణామాలను పరిశీలిస్తున్నారు. విద్యామంత్రి రాజీనామా చేయాలా వద్దా అని కూడా నన్ను అడిగారు... ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయాలని నేను భావిస్తున్నాను’ అని నవీన్ పట్నాయక్ అన్నారు.సోమవారం ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 60 మందికి పైగా నిరసనకారులు గాయాలపాలయ్యారు. హింస, రాళ్లు రువ్వడం, విధ్వంసాలకు సంబంధించి పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్నవారిని గుర్తించడానికి 250కి పైగా వీడియోలను పరిశీలిస్తున్నారు. పోలీసుల చర్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారుకాగా శరద్ పవార్, ఎంపి సుప్రియా సూలేలు సీజేపీ నిరసన కొనసాగిస్తున్న జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి వెళ్లి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు. శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, ‘నీట్ పరీక్షలో పేపర్ లీక్ నేపథ్యంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో విద్యార్థులు నిరాహార దీక్ష, నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు తగనిది. నిరసన ప్రదేశాన్ని సందర్శించి, విద్యార్థులను కలుసుకున్నాను. ఆందోళనలో గాయపడిన వారి గురించి ఆరా తీశాను. వారి డిమాండ్ల గురించి కూడా వివరంగా తెలుసుకున్నాను’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు: శశి థరూర్ -
జంతర్‌మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.లేటెస్ట్ అప్డేట్స్:ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులుపోలీసులపై అల్లరిమూకల దాడిదాడిలో పలువురు పోలీసులకు గాయాలుజంతర్మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై నిషేదంగాయపడిన పలువురు పోలీసులుజంతర్మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణంపోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులుపోలీసులు, RAF సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరిన ప్రొటెస్టర్లుగాయపడిన పలువురు పోలీసులు ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర హైటెన్షన్భారీగా తరలివస్తున్న యువతపార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలుప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్ చేశారు.NEET పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్ మంతర్‌లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని విమర్శించారు.జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ జంతర్ మంతర్‌లో CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు.ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.‘‘భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.ఎలాంటి నెగెటివ్ స్లోగన్స్‌ను సహించబోమని స్పష్టం చేశారు.స్పీకర్‌ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్NEET అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. విపక్షాలుఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామంలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠCJP నిరసనలు.. తాజా పరిణామాలువిద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.రాజీవ్ చౌక్, ఐటీవో, మండీ హౌస్ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.జంతర్ మంతర్ పోలీస్ యాక్షన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు👉 ‘సమయం వృథా చేయొద్దు’జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 👉 వీడియోలు చూడబోమన్న సీజేఐపోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.👉 పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తతనీట్ పేపర్ లీక్‌పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.👉 లాఠీఛార్జ్ చేశారంటూ ఆరోపణలువిద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.👉 నిరసనలు కొనసాగుతున్నాయిజంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారుNEET పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా వ్యాఖ్య.ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.జూలై 20 మార్చ్ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడుNEET-UG 2026 పేపర్ లీక్ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.NEET పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.CJP ఆందోళనకు TMC మద్దతుCJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.జంతర్ మంతర్ పోలీస్ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణజంతర్ మంతర్‌లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ పిటిషన్.ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.జూలై 18న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.పోలీస్ ఆపరేషన్‌పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.భవిష్యత్‌లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.CJP నిరసనలు.. 10 ఎఫ్ఐఆర్లు నమోదుఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో 4, కన్నాట్ ప్లేస్‌లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.మండీర్ మార్గ్, బరాఖంబా రోడ్, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.👉 పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కేంద్రంనీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీనీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్‌తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.👉ఆయన రాజీనామా చేయాల్సిందే!నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్ విపక్షాలకు స్పష్టం చేశారు. #WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc— ANI (@ANI) July 22, 2026👉జంతర్ మంతర్‌లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులువర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్ మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.👉 CJP నేత వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అంటూ ఆరోపణCJP ప్రతినిధి సౌరవ్ దాస్ తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదుమంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.👉 RAF వాహనంపై దాడికన్నాట్ ప్లేస్‌లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAFకు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.👉 రాహుల్ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.👉భద్రత కట్టుదిట్టంజంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు. -
నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి వారిని విడుదల చేశారు.రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి తరలించగా, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రియాంకను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్బంధంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచారు.కీలక డిమాండ్లు..👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 👉విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 👉విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 👉అలాగే విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని, 👉నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో తక్షణమే చర్చ నిర్వహించాలని, 👉దేశ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు.దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..‘భారత్‌లో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోంది? ప్రశ్నపత్రాలు ఎందుకు వరుసగా లీకవుతున్నాయి? విద్య ఎందుకు అంత ఖరీదుగా మారింది? పిల్లలను చదివించడానికి కుటుంబాలు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి? ఇవి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.भारत के छात्रों और प्रधानमंत्री को मेरा सीधा संदेश... pic.twitter.com/pgZZHLLz8h— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026మరోవైపు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినా, కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ లబ్ధే రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. -
నిరసనలకు వెళ్లలేదు.. ర్యాంక్ కొట్టాడు!
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు. మొదట నేనూ బాధపడ్డా..ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.706 నుంచి 715 మార్కులకు..నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్‌లో అతని స్కోర్‌ను 715 మార్కులు. ఎగ్జామ్‌లో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్‌ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.నిరసనలపై నో కామెంట్NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn— NDTV (@ndtv) July 21, 2026పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ రాయడం రాదు’
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహుశా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి.పార్లమెంట్ వైపు సాగిన ‘చలో సంసద్’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించడం కోసమే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని, ఇరవై మందికి పైగా విద్యార్థుల మరణాలకు ఆయనే బాధ్యుడని సీజేపీ ఆరోపించింది. మరోవైపు కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుంది. భద్రతా సిబ్బంది ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వాలంటీర్లు ఆందోళన స్థలాన్ని శుభ్రం చేస్తూ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాజకీయ ఒత్తిడి మరింత పెరుగుతోంది.ఇది కూడా చదవండి: ‘వాంగ్చుక్కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్‌లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్‌ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్‌కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్‌గా వెల్లడించారు. -
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ తగ్గేదే లే అంటోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌పై పట్టు బట్టి కూర్చుంది. ఈ క్రమంలో రెండో రోజు ఇవాళ పార్లమెంట్ మార్చ్ నిర్వహించబోతోంది. దీంతో ఢిల్లీలో మరోసారి హైఅలర్ట్ నెలకొంది. -
నేడు మళ్లీ ‘చలో సంసద్’!.. సీజేపీ ఆందోళనతో ఉత్కంఠ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో.. మరోసారి పరిస్థితులు అదుపుతప్పకుండా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం రాత్రి జంతర్ మంతర్ వద్ద మాట్లాడుతూ.. మంగళవారం కూడా పార్లమెంట్ మార్చ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మేం ఈ నిరసన ప్రదేశాన్ని వదిలిపెట్టం.. మళ్లీ పార్లమెంట్ వైపు కదులుతాం’’ అని ఆయన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.సోమవారం హైటెన్షన్.. టియర్ గ్యాస్, లాఠీచార్జ్పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున CJP ఇచ్చిన ‘సంసద్ చలో’ పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.అయితే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.పోలీసుల కీలక ప్రకటననిరసనల్లో 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారుల దాడుల్లో 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, హింస వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.మరోవైపు జంతర్ మంతర్ పరిసరాల్లో కొంతకాలం పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రాత్రి వరకు కూడా అక్కడ భారీగా పోలీసులు, ఆందోళనకారులు మోహరించారు.చర్చలకు ప్రభుత్వం ప్రయత్నంఘర్షణల మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు మార్గం సుగమం చేసింది. కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు సమావేశమైనట్లు సమాచారం. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందించాలని మంత్రి సూచించగా.. అనంతరం మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించినట్లు తెలుస్తోంది.మంగళవారం మళ్లీ మార్చ్.. పోలీసుల వ్యూహంమంగళవారం మరోసారి పార్లమెంట్ వైపు మార్చ్ చేపడతామని సీజేపీ ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ.. విపక్షాల నిరసనలు, సీజేపీ ఆందోళనలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం ‘చలో సంసద్’ ఎలాంటి మలుపు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ధరేంద్ర ప్రధాన్ రాజీనామాపై జేపీ నడ్డాతో కాక్రోచ్ నేతల భేటీ
-
ఢిల్లీలో హైటెన్షన్.. ధరేంద్ర ప్రధాన్ రాజీనామాకు CJP డిమాండ్
-
కాక్రోచ్ ముట్టడి.. అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతకవలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను కోరుతూనే.. కేంద్రం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం జరగ్గా.. పోలీసులు, భద్రతా సిబ్బంది నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కఠిన చర్యలతో.. పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో..కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రదాన్‌పై ఆరోపణలు చేస్తూ ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏదైనా నిర్ణయం వెలువడుతుందా? లేదంటే కేవలం పరిస్థితిని సమీక్షించే భేటీనా? అనేదానిపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ధర్మేంద్ర ప్రదాన్‌తో అమిత్ షా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమయంలోనే.. మరోవైపు పార్లమెంట్ సమీపంలో సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలుపుతున్నారు. అంతకు ముందు కేంద్రంతో చర్చలు ఉంటాయని సీజేపీ ప్రతినిధులు ప్రకటించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆ ప్రచారాన్ని ఖండించారు. ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ఈ డిమాండ్లతోనే ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన చలో సంసద్ పిలుపు మేరకు మద్దతు దారులు భారీగా తరలి రావడం గమనార్హం. బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంఆందోళనకారులు పార్లమెంట్ ప్రధాన గేటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి తోపులాటకు దారితీసింది. ఆందోళనకారులు భద్రతా బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.పార్లమెంట్ గేట్లు మూసివేతకార్యకర్తలు పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్ గేట్లను మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.భద్రత కట్టుదిట్టంపార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆందోళనను అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. కొంతసేపు నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ పరిసరాలు హోరెత్తాయి. అమిత్ షా–ధర్మేంద్ర ప్రదాన్ భేటీ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న నిరసనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. -
ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలాంటి డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల ప్రాణం చాలా విలువైనది. వారి ప్రాణాలు కాపాడటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను రక్షించడానికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. ఆయన ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ వైద్యులను నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు, కీలక ఆదేశాలను జారీ చేసింది.ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులుఇప్పటిదాకా ప్రైవేట్ వైద్యులు వాంగ్చుక్కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై ప్రతిరోజూ కేవలం ప్రభుత్వ వైద్యుల చేతే క్రమబద్ధమైన తనిఖీలు చేయించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. పౌరుల ప్రాణాలు చాలావిలువైనవి, వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టండి అని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. రానున్న 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని బుధవారం దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు ఈ విచారణ చేపట్టింది.I’m Not in good shape but not so bad either...Rather than asking me to break my fast please join me on 20th July... Peaceful March to the Parliament.#cockroachjanataparty #jantarmantar #cjpprotest #chalosansad pic.twitter.com/QZ6VyxVMAR— Sonam Wangchuk (@Wangchuk66) July 15, 2026సోనమ్ భావోద్వేగ వీడియోమరోవైపు కోర్టు ఉత్తర్వులకు కొన్ని గంటల ముందు సోనమ్ వాంగ్‌చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ,దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తాను నీరస పడినప్పటికీ, గుండె, ఇతర అంతర్గత అవయవాలు ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు నడవ గలను అన్నారు. ఈ సందర్భంగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసనలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యను ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా NEET-UG వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా ఆయనను తొలగించాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలనే డిమాండ్స్‌తో అభిజీత్ నేతృత్వంలోని సీజేపీ ఆందోళనకు దిగింది. ఈ ఉద్యమానికి మద్దతుగానే సోనమ్ వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
Wangchuk: ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత!
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 9 కిలోల బరువు కోల్పోయిన ఆయన ప్రస్తుతం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన పరిస్థితి విషమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర హెచ్చరిక చేసింది.రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బహిరంగ లేఖ రాస్తూ.. వెంటనే వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం వినాలని కోరారు. ఆయనకు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్కు రాజకీయ మద్దతు క్రమంగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్ జంతర్‌మంతర్‌కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వాంగ్చుక్కు బహిరంగ లేఖ రాస్తూ.. దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ), సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఈ దీక్ష ఎందుకు?జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయనతో పాటు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని కేంద్రం రాజకీయ ప్రేరేపితమని అభివర్ణిస్తూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరసనకారులను "అశాంతి సృష్టించే శక్తులు"గా వ్యాఖ్యానించారు. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్?లడఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ప్రముఖ ఇంజినీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలకు కృషి చేసిన ఆయనకు 2018లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది. హిమాలయ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం రూపొందించిన 'ఐస్ స్తూపాలు' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జీవితం, ఆలోచనల ఆధారంగానే బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్ర(అమీర్ ఖాన్ పోషించిన పాత్ర) రూపుదిద్దుకుంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేపట్టిన ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. లడఖ్‌లో గతంలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పటికీ అక్కడి చల్లటి వాతావరణం కారణంగా ఇంతగా బలహీనపడలేదని, ఢిల్లీలోని వేడి, తేమ వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉప్పు, నీటితోనే దీక్ష కొనసాగిస్తున్నారని.. వైద్యుల సూచనలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే ఆలోచన లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకుండా బలవంతంగా ఆహారం అందించాలని, దీక్ష విరమింపజేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. అయితే తాను స్వచ్ఛందంగా చేపట్టిన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేస్తున్నారు. -
‘ధర్మేంద్ర ప్రధాన్‌జీ హ్యాపీ బర్త్‌డే’ : సీజేపీ అభిజీత్ దీప్కే
సాక్షి,న్యూఢిల్లీ: ‘నీట్’ సహా పలు ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీజేజీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు ధర్మేంద్ర ప్రధాన్.. మీరు వెంటనే రాజీనామా చేయాలని వాల్‌పోస్టర్‌పై రాసి తన నిరసన వ్యక్తం చేశారు. ఆ సందేశం రాసిన తర్వాత ‘ధర్మేంద్ర ప్రధాన్ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకో చిన్న సహాయం చేయండి. రాజీనామా చేయండి. పుట్టినరోజు కానుకగా మేమే మీకు రాజీనామా పత్రాన్ని పంపిస్తాం. మీరు దానిపై కేవలం మీ వేలిముద్ర వేస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Happy Birthday @dpradhanbjp, please resign! pic.twitter.com/djLcewkQch— Abhijeet Dipke (@abhijeet_dipke) June 25, 2026 -
మంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 30 నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
అహ్మదాబాద్/భోపాల్/నాగ్‌పూర్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 30వ తేదీ నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థుల గళం పేరుతో 40 రోజులపాటు జరిగే దేశవ్యాప్త నిరసనలు, ఆగస్ట్ 9వ తేదీన ‘ఢిల్లీ ఛలో’తో ముగియనుందని ఆ పార్టీ పేర్కొంది. నిరసనల సమయంలో మొత్తం 28 నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగార్థులు, కోచింగ్ కేంద్రాలు, కాలేజీ క్యాంపస్‌లు, గ్రంథాలయాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని వివరిస్తామంది. కరపత్రాల పంపిణీ, వీధివీధినా సమావేశాలు, క్యాంపస్‌లో విద్యార్థులతో ముఖాముఖి వంటివి చేపడతామంది. అహ్మదాబాద్, భోపాల్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో 30వ తేదీ నుంచి సాగే ఆందోళనలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు. పదేపదే జరుగుతున్న పరీక్షల అవకతవకల కారణంగా విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం తగ్గిపోయిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ ఆరోపించారు. 130 కోట్ల మంది కలిగిన దేశాన్ని నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం..కేవలం 23 లక్షల మంది కోసం పక్కాగా పరీక్షను సైతం నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశారు. పరీక్ష పత్రాలు ముందుగానే లీకవడం మామూలు అంశంగా మారిపోయిందని, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పాటిల్ విమర్శించారు. గతంలో ఇలాంటి అనేక కేసుల్లో కేవలం మధ్యదళారులను మాత్రమే అరెస్ట్ చేసి, వాటి వెనుక ఉన్న కుంభకోణాల నెట్‌వర్క్‌ను మాత్రం వదిలేసిందని దుయ్యబట్టారు. కోచింగ్ కేంద్రాలు, పరీక్ష పత్రాల లీక్ నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలన్నారు. వార్షిక పరీక్షలు, వాటి ఫలితాలు, నియామకాలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన్ క్షమాపణ చెప్పాలి: రాహుల్ పరీక్ష పత్రాల లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ ద్రోహులంటూ బీజేపీ ప్రభుత్వం ముద్రవేస్తోందని రాహుల్ గురువారం ఎక్స్‌లో ఆ రోపించారు. -
రాహుల్‌పై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, ఢిల్లీ: నీట్ వ్యవహారంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్లో ఆయన వ్యవహారించిన తీరు తనను తీవ్ర అసహానానికి గురిచేసిందన్నారు. ఇటీవల నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఈరోజు( మంగళవారం) ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ "ప్రశ్నలు అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది. కానీ పరీక్షకు మూడు రోజుల ముందు, విద్యార్థులను భయపెట్టడానికి, వారి సన్నద్ధతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ కోటాలో ఒక కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థుల సన్నద్ధతను దెబ్బతీయడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు" అని అన్నారు.నీట్ పరీక్ష లీకేజ్‌తో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల తీవ్ర కలత చెందాను. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిగా, విద్యార్థి ఆత్మహత్య జరిగిన ప్రతిసారీ నన్ను నేనే తిట్టుకుంటాను. ఈ విచ్ఛిన్నమైన వ్యవస్థను మనం సరిదిద్దాలి. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ విద్యార్థుల ఆత్మహత్యలను వాడుకున్న తీరు నీచమైన రాజకీయాలని మండిపడ్డారు. ప్రస్తుత వ్యవస్థను ఎలా మెరుగుపరచాలనే దానిపై రాహుల్ గాంధీ , కాంగ్రెస్ నుంచి ఇదివరకూ ఒక్క సానుకూల సూచన కూడా తనకు అందలేదన్నారు.ఒక విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్నివిద్యార్థి తండ్రి అభ్యర్థన మేరకే కేటాయించారని మంత్రి స్పష్టం చేశారు. "ఈ విషయం వెలుగులోకి రాగానే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని గంటల్లోనే స్పందించి, కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చిందని తెలిపారు. ఈ ఘటనను సైతం రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.కాగా నీట్-యూజీలో పేపర్ లీక్‌లు, పరీక్షా కేంద్రాల సమస్యలతో సహా జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్.. ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పించాయి. గత వారం కోటాలో విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో గాంధీ మాట్లాడుతూ, పరీక్షా విధానం మోసపూరితంగా ఉందని, విద్యా వ్యవస్థలోని అవినీతి కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్‌ను తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు.ఉధృతమవుతున్న ఆందోళనలు గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. సోమవారం రాత్రి, నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్‌కు హాజరైన పలువురు నీట్ అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు.తనిఖీల వివాదం – పోలీసుల వివరణఈ నిరసనల్లో ఎస్ఎఫ్ఐ, ఐసా, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని.. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను వైఎస్సార్సీపీ కోరింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మలిచిందని ఆ పార్టీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో రూపొందించిన భారీ కుంభకోణమని.. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినపతిపత్రం అందచేశారు. అందులోని ముఖ్యాంశాలు.. పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతర 16వేల పోస్టుల భర్తీ కోసం జరిపిన డీఎస్సీ పరీక్షలో పారదర్శకతను కాపాడే అన్ని చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. గతంలో ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకీ, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వినర్‌కు ఉండేది. అయితే, ఈసారి రెండు బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం ద్వారా అక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే, ప్రశ్నపత్రాల అప్లోడ్ తదితర బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అదే డీఎస్సీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పేపర్ లీక్‌కు ప్రత్యక్ష నిదర్శనం. అయితే, మెరిట్ జాబితా నుంచి అతని పేరు తొలగించారు. ఫలితాల ప్రకటనలోనూ గందరగోళం ఇక ఫలితాల ప్రకటనలో కూడా ప్రభుత్వం పారదర్శకత పాటించలేదు. గతంలో కలెక్టరేట్ నోటీసుబోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆన్‌లైన్‌కు పరిమితం చేయడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లు, కటాఫ్ మార్కుల ఆధారంగా ఎంపిక పూర్తయిన తర్వాతే ధృవపత్రాల పరిశీలన జరగాలి. కానీ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కూడా పలువురు అభ్యర్థులను తప్పించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు గతంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం కొత్త జీఓలు జారీచేసింది. మరోవైపు.. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగినట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఫోన్ నంబర్లు తెలిసినా అసలు నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదుచేయకుండా దర్యాప్తును బలహీనపరిచారు. ఈ డీఎస్సీ కుంభకోణం పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కంటే తీవ్రమైనది. అందువల్ల సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. -
ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడుతున్నాయా?
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణలో తెలెత్తిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు ఆయన రాజీనామా చేయాలంటూ గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్‌కు అండగా నిలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గట్టిగా వెనకేసుకొస్తుండటం వెనుక బలమైన రాజకీయ, ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.బీజేపీ ట్రబుల్ షూటర్.. అమిత్ షా తర్వాత..ధర్మేంద్ర ప్రధాన్ కేవలం మంత్రి మాత్రమే కాదు, బీజేపీ అగ్రనాయకత్వంలో అత్యంత నమ్మకమైన ఎన్నికల వ్యూహకర్త. అమిత్ షా తర్వాత పార్టీలో సంక్లిష్టమైన ఎన్నికల వ్యవహారాలను చక్కదిద్దగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. ఎలాంటి హడావుడి లేకుండా, తెరవెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. విబేధాలను పరిష్కరించడం, రాష్ట్రాల నాయకత్వాలను సమన్వయం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన్ శైలి ప్రత్యేకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత పటిష్ఠం చేశాయి.ఒడిశాలో చారిత్రాత్మక విజయం2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ఎదుగుదలకు మైలురాయిగా నిలిచింది. ఒడిశాకు చెందిన సీనియర్ నేతగా, అక్కడ దాదాపు 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలకడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర ప్రాంతాలకు పార్టీని ఎలా విస్తరించాలో ప్రధాన్ తన వ్యూహాలతో నిరూపించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, దేశవ్యాప్త రాజకీయ నెట్వర్క్ ఆయనను పార్టీలో కీలక నేతగా మార్చాయి.హర్యానా, బిహార్లలో ఊహించని విజయాలురాజకీయంగా ఎంతో సవాలుతో కూడుకున్న రాష్ట్రాల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యూహాలతో పార్టీని గెలిపించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసినా.. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంలో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. సీట్ల సర్దుబాటు, కూటమి నిర్వహణను ఆయన సమర్థవంతంగా అదుపు చేశారు.యూపీ టర్నింగ్ పాయింట్.. నందిగ్రామ్ సంచలనంభారతదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ధర్మేంద్ర ప్రధాన్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, 255కు పైగా స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అంతకుముందు 2017 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 స్థానాలు సాధించడంలో, 2014 జార్ఖండ్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నందిగ్రామ్’ నియోజకవర్గ బాధ్యతలను ప్రధాన్ తీసుకుని, మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించేలా వ్యూహాలు రచించడం బీజేపీ చరిత్రలో ఒక మైలురాయి.లీకుల వివాదం ఉన్నా.. నీట్ వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున విపక్షాల డిమాండ్ సమంజసమే అయినప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడం లేదు. రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌదరి అభిప్రాయం ప్రకారం.. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే, అది ఒక సంప్రదాయంగా మారి భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని బీజేపీ భయపడుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పవన్ బన్సల్, కామన్వెల్త్ గేమ్స్ వివాదాల సమయంలో ఇలాగే జరిగిందని పార్టీ గుర్తు చేసుకుంటోంది. ఒకవేళ ప్రధాన్‌ను మార్చాలనుకున్నా, విపక్షాల ఒత్తిడితో కాకుండా తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణలో భాగంగానే ఆ పని చేయవచ్చని ఆమె విశ్లేషించారు.జవాబుదారీతనంపై చర్చమరోవైపు నీట్, సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖలో మంత్రుల జవాబుదారీతనంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్లేషకుడు నిఖిల్ జైన్ ప్రకారం.. పార్టీకి రాజకీయంగా, సంస్థాగతంగా అవసరమైన నాయకులను మంత్రులుగా నియమించడం సాధారణమే. అయితే, మంత్రిత్వ శాఖ పరిధిలో వివాదాలు వచ్చినప్పుడు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోజువారీ పరిపాలనను బ్యూరోక్రాట్లు (అధికారులు) చూసుకున్నప్పటికీ, విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పే బాధ్యత మంత్రులదే. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్ వంటి నేతలు రాజీనామా చేసిన ఉదాహరణలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం -
మేం ఎన్నికల్లో పోటీ చేయం
నాగ్‌పూర్: ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నాగ్‌పూర్‌లో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించగా, ‘మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీకి దిగడం సబబా?’అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన ఐదారుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని దీప్కే డిమాండ్ చేశారు. ‘మోదీజీ ప్రపంచంలోనే ఏం జరిగినా ట్వీట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాత్రం పట్టించుకోరు. కనీసం సంతాప సందేశం కూడా ట్వీట్ చేయరు. మన్‌కీ బాత్, పరీక్షా పే చర్చ ఇంకా ఎన్ని రోజులు..? కనీసం విద్యార్థుల మన్‌కీబాత్ వినిపించుకోండి’అంటూ దీప్కే తీవ్రంగా స్పందించారు. సోమవారం జైపూర్‌లో నిరసన సందర్భంగా తనపై జరిగిన దాడిపై దీప్కే స్పందిస్తూ.. ‘ఈ ఘటన వెనుక ఆర్ఎస్ఎస్ నేతల హస్తముందని’ దిప్కే పేర్కొన్నారు. -
హక్కుల కోసం కాక్రోచ్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఆదివారం హక్కుల కోసం నగరంలోని ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ., నీట్ పరీక్షల లీకేజీ వంటి ఘటనలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... కోట్లాది యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో జవాబుదారీతనం అవసరమన్నారు. ఈ నిరసనను ఇప్పటికీ ఒక విజ్ఞప్తిగా చూస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ యువత చూపిన శాంతియుత, శక్తివంతమైన నిరసన దేశానికి ఆదర్శమన్నారు. ‘నేను అనేక నగరాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ హైదరాబాద్‌లో నేను చూసిన శాంతి నిరసన మరెక్కడా చూడలేదు’ అని చెప్పారు. భారత్ గొప్ప దేశంగా మారాలంటే విద్య, పర్యావరణ పరిరక్షణే ప్రధాన అంశాలుగా మారాలని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ‘విద్య ద్వారా రాబోయే తరాలకు పునాదులు వేయాలి. మీరు చెట్లను, అడవులను, నదులను రక్షిస్తున్నారు. ఇది దేశానికే గర్వకారణం’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ పిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారన్నారని, ఇలా అయితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ఎలా సాకారమవుతుందని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలో పాల్గొంటే తమ పిల్లల స్కూల్ అడ్మిషన్‌కు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే పరిస్థితి దేశంలో ఉండటం సిగ్గుచేటన్నారు.యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు: ప్రొ.నాగేశ్వర్ నీట్, సీబీఎస్ఈ సహా అనేక పరీక్షల్లో జరిగిన లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు వేలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా బాధ్యత తీసుకునే రాజకీయ నాయకులు కనిపించడం లేదు. ఇదే మన రాజకీయ పతనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘’పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే బంగారం కొనొద్దంటారు. కానీ యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరు’ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ, ఉద్యోగాలను తొలగించడం అన్యాయమన్నారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులనే ప్రశ్నించే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, చైనా ఏజెంట్, దేశద్రోహి అంటారు. కానీ మేము భారతమాత బిడ్డలం, భగత్ సింగ్ వారసులం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇది సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఆగిపోవద్దు, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది.? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఇలా నెలకొందని ప్రశ్నించారు. ‘యువతను కాక్రోచ్లుగా పేర్కొనడం సమంజసం కాదు. దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను జైలుకు పంపాలి’ అని అన్నారు. -
లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం
పుణె: ప్రతిష్టాత్మక నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్‌లో వైఫల్యాలు, క్యూట్ పరీక్ష నిర్వహణలో అసమర్థత వంటి పలు దారుణోదంతాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి దఫాలో పుణెలో తొలి నిరసన కార్యక్రమాన్ని గురువారం మొదలెట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సారథ్యంలో పుణెలోని సావిత్రీభాయ్ ఫూలే పుణె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పార్టీ అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేపీ తమ ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదలచేసింది. మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే జూన్ 20వ తేదీన పుణె విద్యార్థులంతా ఢిల్లీకొచ్చి ఉద్యమిస్తారని దీప్కే స్పష్టంచేశారు. హిందూ–ముస్లిం విభజన అంశాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. వీటి నుంచి దృష్టి మరలిస్తేనే స్తంభించిన దేశ ప్రగతి రథాలు ముందుకు కదులుతాయని దీప్కే అన్నారు. ‘‘హిందూ–ముస్లిం విభజన రాజకీయాలతో యువత విసిగెత్తిపోయారనేందుకు మా కాక్రోచ్ నిదర్శనం. ఇలాంటి రాజకీయాలతో సమాజం కంపుకొడుతోంది. ఈ కంపు పోగొట్టేందుకే బొద్దింకలొచ్చాయి. ప్రభుత్వంతో చర్చలకు మేం సిద్ధం. మాతో చర్చలకు ముందుకురాకుండా ప్రభుత్వం మా సోషల్‌మీడియా ఖాతాలను స్తంభింపజేయడంలో బిజీగా మారింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... → ఇకమీదట ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు, ఉద్యోగ సంబంధ పరీక్షల్లో ఒక ప్రశ్నపత్రం లీక్ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి/విద్యార్థికి రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి → లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా, సమయానికి పరీక్షాకేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలి → పరీక్ష రద్దయితే ఆ రద్దయిన పేపర్ మాత్రమే 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా ‘షెడ్యూల్ చేసిన తేదీ’లను ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీల్లో పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి → ఆన్లైన్లో పేపర్లను దిద్దడం మానేసి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు స్వయంగా పేపర్లను దిద్దాలి. → రాసిన పరీక్ష రద్దయి తర్వాత పరీక్ష రాసేలోపు వయోపరిమితి దాటిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి → కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాలను ఆడిటింగ్ చేయాలి → పరీక్షలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడో సంస్థకు ఇస్తే వాళ్ల గత చరిత్రను క్షుణ్ణంగా తనిఖీచేయాలి -
మా పోరాటం ఆగదు
ఛత్రపతి శంభాజీనగర్: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకొనేదాకా తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. దేశంలో గత 12 ఏళ్లుగా రాజకీయాలు కేవలం హిందూ–ముస్లిం ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయని ఆక్షేపించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇప్పటికైనా మారాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎజెండాను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్‌లోని సొంత ఇంటికి చేరుకున్న అభిజిత్ దీప్కేకు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని మోదీ మన దేశంలో పేపర్ లీక్‌ను ఆపలేరా? అని దీప్కే ప్రశ్నించారు. జెన్ జెడ్ యువత ఎవరికీ భయపడబోరన్న సంగతి శనివారం నాటి జంతర్‌మంతర్ ధర్నాతో తెలిసిపోయిందన్నారు. తప్పులు జరిగితే యువత ప్రశ్నిస్తూనే ఉంటుందని ఉద్ఘాటించారు. ఈ ధర్నాకు 7,000 మంది హాజరయ్యారని, తమ ఉద్యమం ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని స్పష్టంచేశారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నీట్–యూజీ పేపర్ లీక్ వల్ల లక్షల మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరూ బాధ్యత తీసుకోకపోతే వ్యవస్థ సక్రమంగా ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. దీప్కే ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే జంతర్‌మంతర్ ధర్నా ఒక ట్రైలర్ మాత్రమేనని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ధర్నాకు హాజరైనవారికి ఆదివారం ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను 7 రోజుల్లోగా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శనివారం జరిగిన ధర్నాకు చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఈ ధర్నా ఒక ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి ఒక ట్రైలర్‌ను చూపించిందని వివరించారు. ప్రజలంతా కలిసికట్టుగా గళాన్ని వినిపించకపోతే వ్యవస్థలో ఆశించిన మార్పు రాదని తేల్చిచెప్పారు. -
కదం తొక్కిన కాక్రోచ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. నీట్(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్‌మంతర్ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చా.. ‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక మార్పు రావాలి పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్‌మంతర్ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’పేరిట ఆన్లైన్ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్‌మంతర్ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాక్రోచ్–ఇన్–చీఫ్ అభిజిత్ దీప్కే జంతర్‌మంతర్ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్ పవార్ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్‌చుక్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్ దీప్కేను కాక్రోచ్–ఇన్–చీఫ్‌గా వాంగ్‌చుక్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్ మంతర్ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలుత డెడ్‌లైన్ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్‌లైన్‌ను వారం రోజులకు పొడిగించారు. -
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నిరసనను అడ్డుకోవాలని శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) తోసిపుచ్చింది.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించిన సీజేపీ విదేశీ సర్వర్ల ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. యువతను రెచ్చగొట్టేలా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించాలని లేదా వేరే ప్రాంతానికి మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.వాదనలు విన్న జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మల వెకేషన్ బెంచ్ ఈ పిల్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆందోళనకు సంబంధించిన ప్రస్తుత దశలో ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణ జాబితాలో చేర్చేందుకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు తరలి రావాల్సిందిగా దేశంలోని యువతకు దిప్కే సోషల్ మీడియా వేదికగా ఇటీవల పిలుపునివ్వడం తెల్సిందే. అంతేకాదు, 6న ఢిల్లీకి వస్తున్న తనను విమానాశ్రయం వద్దే కలుసుకోవాలని కూడా అతడు కోరాడు. -
అధికారమే తప్ప పిల్లల భవిష్యత్తు పట్టదు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈలో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం దాల్చడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ శ్రద్ధంతా తన పదవిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే తప్ప, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టింపులేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం), సీవోఈఎంపీటీకి ఈ కాంట్రాక్టును అప్పగించడంపై జ్యుడీషియల్ దర్యాప్తు చేపట్టాలంటూ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే తాను డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు దేశ యువతకు తెలియడం అవసరమన్నారు. ‘ఓఎస్ఎం కోసం సీబీఎస్ఈ మూడుసార్లు టెండర్లు పిలిచింది. మొదటిసారి ఒక్కరూ రాలేదు. రెండోసారి వచ్చిన బిడ్డర్లలో అర్హులు లేరు. చివరగా, ఎంతో కీలమైన సాంకేతిక అర్హతలను కుదించిన తర్వాత సీవోటీఎంపీటీ రంగంలోకి వచ్చింది. ఆ కంపెనీకే టెండర్ కట్టబెట్టారు. ఆన్సర్ షీట్లలో దొర్లే పొరపాట్లకు జరిమానాలను తొలగించారు. రోబోటిక్ స్కానర్ అవసరం లేదన్నారు. స్కానింగ్ రిజొల్యూషన్‌ను తగ్గించారు’అని రాహుల్ తెలిపారు. ‘మంచి పేరున్న దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ టెండర్ వేసినా కాంట్రాక్టు ఇవ్వలేదు. ఘనమైన ఫెయిల్యూర్ రికార్డు కలిగిన సీవోటీఎంపీటీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ కంపెనీ ఎవాల్యుయేషన్ తీరు ఎలా ఉందో బాధిత విద్యార్థులే చెబుతున్నారు’అంటూ రాహుల్ ఆరోపించారు. ఓఎస్ఎం విధానాన్ని తీసుకు వచ్చేముందు కనీసం ఒకటీ రెండు సంవత్సరాలు సన్నద్ధతా చర్యలను చేపట్టాలని ముందు నుంచే నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ విమర్శించారు. ఇలాంటి తప్పిదాలన్నిటికీ ప్రభుత్వానిదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను సైతం పక్కనబెట్టేసి 18.5 లక్షల విద్యార్థుల భవిష్యత్తును ఓ విఫల సంస్థకు ధారాదత్తం చేసిందంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలన్నదే తన ఏకైక డిమాండ్ అని రాహుల్ పేర్కొన్నారు. -
సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. ఓఎస్ఎం వ్యత్యాసాలకు, విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలను గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడిన ప్రధాన్, బోర్డు కొత్త డిజిటల్ మూల్యాంకన నమూనాను సమర్థించడంతో పాటు, విద్యార్థులు ఎదుర్కొన్న ఒత్తిడిని కూడా అంగీకరించారు.స్కాన్ చేసిన కాపీలు అస్పష్టంగా ఉండటం, జవాబులను సరిచూసుకోలేదని ఆరోపణలు, పోర్టల్ క్రాష్‌లు, చెల్లింపు సమస్యలు, పునఃమూల్యాంకన ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలపై అటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి తాను బాధ్యత తీసుకుంటున్నానని, అవకతవకలు కనుగొనబడితే "ఎవరినీ వదిలిపెట్టబోమని" విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు దీన్ని సరిచేసేలా పరిష్కారం కనుగొంటామనీ తామందరూ ఆ పనిపైనే పనిచేస్తున్నామని హామీ ఇచ్చారు. పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థుల 98 లక్షల కాపీల జవాబు పత్రాలను భద్రపరిచామని వెల్లడించారు. ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?కాగా సీబీఎస్ఈ మార్క్‌ల షీట్లు తారుమారు కావడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై విద్యార్థులు ఆన్లైన్ వేదికగా తమ అనుభవాలను స్ర్కీన్ షాట్లతో సహా పంచుకోవడంతోఇది మరింత ముదిరింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రదాన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. -
‘‘అప్పటివరకు ‘నీట్’పై నిరసనలు జరుగుతూనే ఉంటాయి’’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.ఆదివారం ఎక్స్‌లో ఈ మేరకు రాహుల్ గాంధీ ఎన్ఎస్యూఐ నిరసన తెలిపిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. “లక్షలాది మంది యువత రోడ్లపై ఉన్నారు.. 22 లక్షల పిల్లల భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడంపై కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, నీట్ లాంటి ప్రశ్నపత్ర లీకులు ఆగేలా పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము ఆగము” అని రాహుల్ గాంధీ అన్నారు.నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని, “ప్రశ్నపత్ర లీక్ మాఫియా” పెరగడానికి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.ఎక్స్‌లో కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ.. “నీట్ ప్రశ్నపత్ర లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టింది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్ర లీక్ మాఫియా విస్తరిస్తోంది. బాధ్యులు మాత్రం మౌనంగా చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వినోద్ జాఖర్ నాయకత్వంలో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టి, యువత వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌తో చేసే ఈ చెలగాటాన్ని ఏ మాత్రం సహించం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కాంగ్రెస్ పేర్కొంది.అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్ర లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఇదిలా ఉండగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.जब लाखों युवा सड़क पर हों, 22 लाख बच्चों का भविष्य दांव पर हो और PM चुप हो - तो सरकार जवाब देने नहीं, बचने में लगी है।जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता और NEET जैसे पेपर लीक रोकने के लिए foolproof सिस्टम नहीं बनता - हम रुकेंगे नहीं।pic.twitter.com/6KrhfUqDkL— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2026 -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో పోరాటం ఆరంభించింది. ఆ పార్టీ ‘ఎక్స్’ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడంతో ‘కాక్రోచెస్ నెవర్ డై’అనే ట్యాగ్‌లైన్‌తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట కొత్త ఖాతాను సృష్టించుకుంది. ఇదే ఖాతా నుంచి పోస్టులు చే స్తోంది. ఇన్స్టా్రగామ్లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. విద్యా రంగంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతోందని సీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో పెట్టిన పిటిషన్‌కు మద్దతు ఇవ్వాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కోరారు. తాజాగా ఒక వీడియో సందేశం పోస్టుచేశారు. ‘‘బొద్దింకల్లారా.. ఎలా ఉన్నారు? ఇంటర్నెట్లో మీరంతా బాగా రాణిస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు నిజమైన పని చేయాల్సిన సమయం వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ రోజు ఆన్లైన్లో ఒక పిటిషన్‌ను ప్రారంభిస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి’’అనికోరారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జవాబుదారీతనం ఉండాలన్నారు. అందుకు సమయం వచ్చిందన్నారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి, నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవస్థే కారణమని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు బెదిరింపులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు.దీప్కే భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భద్రతపై ఆయన తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కే ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ఎవరైనా ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఆ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎక్స్ ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు అభిజిత్‌కు బెదిరింపులు సైతం వస్తున్నట్లు తెలుస్తోంది. తమ కుమారుడు ఇబ్బందుల్లో పడతాడేమో లేక అరెస్టును కూడా ఎదుర్కొంటాడేమోనన్న భయంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అభిజిత్‌కు ఆమ్ ఆద్మీ పారీ్టతో సంబంధాలున్నాయి. అతడి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో నివసిస్తున్నారు. తమ బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని వారు చెప్పారు. అతడి భద్రత పట్ల ఆందోళన చెందుతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని వెల్లడించారు. ఇంటికి తిరిగిరావాలని అభిజిత్‌ను కోరారు. -
నీట్-యూజీ రీ ఎగ్జామ్: ఏర్పాట్లపై ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కఠిన భద్రతా నిబంధనల మధ్య పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఆ పరీక్షకు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో ఆవేదన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించి.. పరీక్ష నిర్వహణలో నిష్పక్షపాతం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గత పరీక్షా ప్రక్రియలో గుర్తించిన లోపాలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశించారు. కఠిన పర్యవేక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తతతో రీ-నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. అలాగే పరీక్ష ఏర్పాట్లు, భద్రతా పర్యవేక్షణ అమలుపై రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భద్రతా చర్యలతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం, తాగునీరు, ఇతర అవసరమైన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల్లో ఉండాలని ప్రధాన్ అధికారులకు ఆదేశించారు.అభ్యర్థులకు ముఖ్య సూచనలునీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21 (ఆదివారం) నిర్వహిస్తారు.ప్రస్తుతం ఉన్న చిరునామా మారితే పరీక్షా నగర ప్రాధాన్యత మార్చుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు నీట్ ఎన్టీఏ పోర్టల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే 21 వరకు మార్పులు చేసుకోవచ్చు.విద్యార్థులు మొదటి, రెండో ప్రాధాన్యత పరీక్షా నగరాలను ఎంచుకునే అవకాశం పొందుతారు. ప్రస్తుతం ఉన్న చిరునామా, పరీక్షా నగర ప్రాధాన్యత మార్పులకు తప్ప ఇతర సవరణలకు అనుమతి లేదు. మే 21 తర్వాత వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకోరు.రద్దైన పరీక్షకు చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారు. రీ-ఎగ్జామ్‌కు అదనపు ఫీజు వసూలు చేయరు.పరీక్ష పెన్-అండ్-పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలోనే 13 భాషల్లో నిర్వహిస్తారు. అవి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.పరీక్షా ప్రక్రియల నిర్వహణకు విద్యార్థులకు అదనంగా 15 నిమిషాలు ఇస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుంది.సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు, అడ్మిట్ కార్డులు, ఇతర పరీక్షా వివరాలు అధికారిక వెబ్సైట్లో తర్వాత ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. తాత్కాలికంగా జూన్ 14 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.2027 నుంచి నీట్-యూజీని కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తామని ఏజెన్సీ ప్రకటించింది.రీ-ఎగ్జామ్ ఫలితాల విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తారు.అప్డేట్లు, పరీక్షా సూచనల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ఎన్టీఏ సోర్సులనే నమ్మాలని అధికారులు సూచించారు.నీట్ (యూజీ) 2026పై మరింత సమాచారం కావాలంటే అభ్యర్థులు 011-40759000, 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. లేక neetug2026@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చు. -
ప్రధాన్‌ను బర్తరఫ్ చేయండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, లేదా ఈ వైఫల్యానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ప్రదాని మోదీని శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ కుమ్మక్కై దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని, ఫలితంగా 22 లక్షల మంది నీట్ అభ్యర్థుల ఆకాంక్షలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్‌కు రెండు రోజుల ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీకైన విషయం దేశం యావత్తూ తెలిసిపోయింది. ఈ విషయంలో తానేమీ చేయలేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీల కట్టడికి పార్లమెంట్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ కమిటీలో ఉండటమే ఇందుకు కారణం’అని రాహుల్ ఎక్స్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ‘దేశం మూలాలపైనే మీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. కేవలం డబ్బు సంపాదన కోసమే విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ప్రొఫెసర్ల పదవుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబం«దీకులను కూర్చోబెట్టారు. ఇదో పెద్ద అక్రమ కూటమి’అని రాహుల్ ఆరోపించారు. ఈ కూటమి దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్నారు. ‘ఓ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అవ్వాలంటే కావాల్సింది పరిజ్ఞానం అనుభవం కాదు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే చాలు. ఈ విషయం దేశంలో అందరికీ తెలుసు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని వారు వైస్ చాన్స్‌లర్ అయ్యే అవకాశమేలేదన్నారు. అందుకే, ఇప్పటి వరకు కనీసం 80సార్లు పరీక్ష పేర్లు లీకై, 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు. -
జూన్ 21న నీట్ రీఎగ్జామ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–యూజీ రీఎగ్జామ్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ నెల 3న నిర్వహించిన నీట్(యూజీ)–2026 పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షలో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నీట్(యూజీ) పరీక్షలో అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రద్దయిన నీట్‌ను జూన్ 21న మళ్లీ నిర్వహించబోతున్నామని, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాలు పెంచినట్లు తెలిపారు. ఎక్కడ పరీక్ష రాయాలన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చని, జూన్ 14 కల్లా అడ్మిట్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నీట్ అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లను కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరు కావాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు. పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వం మాఫియా కుట్రలు, ధన బలం వంటివి విద్యార్థుల మెడికల్ సీటును లాక్కోవాలని తాము కోరుకోవడం లేదని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. ఇప్పటిదాకా జరిగిన దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గెస్ పేపర్ ముసుగులో కొన్ని ప్రశ్నలు పరీక్షకు ముందే బయటకు వచ్చాయంటూ ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా ప్రాథమిక విచారణ ప్రారంభించామని చెప్పారు. మే 3న పరీక్ష జరిగే, 7న ఫిర్యాదులు వచ్చాయన్నారు. పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులను శిక్షించడం తథ్యమని పేర్కొన్నారు. గతంలో నీట్ పరీక్షలో అక్రమాలు బయటపడిన తర్వాత రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులను అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. అయినప్పటికీ ఈ ఏడాది పేపర్ లీకేజీ ఘటన జరిగిందని, అందుకే మొదటి చర్యగా పరీక్షను రద్దు చేశామని తెలియజేశారు. నీట్ విషయంలో ఎవరైనా భయాందోళనలు, అవాంతరాలను సృష్టిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. మన వ్యవస్థను విశ్వసించాలి ఓఎంఆర్ విధానంతో పోలిస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం కొంత మెరుగైనదని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పరీక్షకు కొంత రక్షణ ఉంటుందన్నారు. మరోవైపు సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సవాళ్లు ఉన్నప్పటికీ, మన దేశ వ్యవస్థను మనం విశ్వసించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జరిగే రీటెస్టుకు సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. ఏ నగరంలో పరీక్ష రాయాలో నిర్ణయించుకోవడానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. నీట్ టెస్టు జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల దాకా జరుగుతుందన్నారు. -
NEET పేపర్ లీక్ స్కామ్‌లో షాకింగ్ నిజాలు
-
ఐఐఎం లక్నోలో 3 కొత్త ఏఐ కోర్సులు
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు చేరువచేయాలనే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(లక్నో) గురువారం మూడు ఏఐ కొత్త కోర్సులను అందుబాటులోకి తెచి్చందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) ఇన్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, టెక్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ సైన్స్ + టెక్ ఎంబీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చారని ఆయన వెల్లడించారు. గురువారం ఢిల్లీలో జరిగిన భారత్ బోధన్ ఏఐ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘‘నైతిక ఏఐలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా అవతరింపజేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మేనేజ్మెంట్ విద్యతోపాటు ఆవిష్కరణలు, రియల్ వరల్డ్ సోషియాటిక్ అప్లికేషన్లలో ఏఐ కోర్సులను విస్తృతంగా అందించాలని బిజినెస్ స్కూళ్లకు సూచిస్తున్నాం. ఏఐ ఆధారిత భవిష్యత్తుకు తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేయడంతోపాటు మానవీయ విలువలను పెంపొందిస్తూ జాతీయాభివృద్ధికి సాంకేతికత దోహదపడేలా చేయండి’’అని బిజినెస్ స్కూళ్లకు మంత్రి పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువ కారి్మకశక్తితో అలరారే భారత్‌లో దేశీయంగా ఏఐ మోడళ్లను తయారుచేసుకునే అద్భుత అవకాశం దాగి ఉంది. ఇది ప్రపంచ సమస్యలనూ తీర్చగలదు అని చెప్పారు. -
అక్షర జాతరకు అంకురార్పణ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో 53వ ‘న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది ‘ఇండియన్ మిలిటరీ హిస్టరీ: వేలర్ అండ్ విజ్డమ్ @ 75’ అనే ప్రత్యేక ఇతివృత్తంతో పుస్తక మేళా జరుగుతోంది. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ వార్షిక వేడుకను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. పుస్తక ప్రదర్శన చరిత్రలోనే తొలిసారిగా అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. దేశ స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్యాగాలను, వారి ధైర్య సాహసాలను ఈ ప్రదర్శన గౌరవిస్తోంది.సైనిక దళాలకు సగౌరవంగా..డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌లో 500కు పైగా పుస్తకాలు, అర్జున్ ట్యాంక్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానాల నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. 21 మంది పరమవీర చక్ర విజేతలకు నివాళులర్పించడంతో పాటు, 1947 బద్గాం యుద్ధం నుండి ‘ఆపరేషన్ సిందూర్’ వరకు కీలక సైనిక చర్యలపై చర్చలు నిర్వహిస్తారు. ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుక, సర్దార్ పటేల్ జీవిత విశేషాలపై ప్రదర్శనలు ఉంటాయి.జ్ఞానం కంటే పవిత్రమైనదేదీ లేదుపుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదని భగవద్గీత చెబుతోంది. ఈ పుస్తక ప్రదర్శన కేవలం సేకరణ మాత్రమే కాదు, ఇది ఆలోచనల సమ్మేళనం. ప్రపంచ ప్రచురణ రంగంలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది, ఇది మన సాంస్కృతిక బలానికి నిదర్శనం’.. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెయిన్ సాంస్కృతిక మంత్రి ఎర్నెస్ట్ ఉర్తాసున్ డొమెనెచ్, ఖతార్ రాయబారి మహమ్మద్ హసన్ జాబిర్ అల్–జాబిర్, ఖతార్ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అబ్దుల్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.35కు పైగా దేశాలు.. వెయ్యికి పైగా ప్రచురణకర్తలుపుస్తక ప్రదర్శన జనవరి 10 నుండి 18 వరకు తొమ్మిది రోజుల పాటు జరగనుంది. 35కు పైగా దేశాల నుండి 1000 మందికి పైగా ప్రచురణకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 3000కు పైగా స్టాళ్లు, 600కు పైగా సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖతార్ ‘గౌరవ అతిథి’ దేశంగా ఉండగా, స్పెయిన్ ‘ఫోకస్ కంట్రీ’గా వ్యవహరించనుంది. పుస్తకాలతో పాటు సాయంత్రం వేళల్లో రాజస్థానీ మంగనియార్ కళాకారుల ప్రదర్శనలు, ఆర్మీ బ్యాండ్ సంగీతం అలరించనున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా కథలు చెప్పడం, వేద గణితం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు 20 లక్షల మంది సందర్శకులు హాజరౌతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పీయూష్ మిశ్రా, స్మృతి ఇరానీ, హేమమాలిని, కైలాష్ సత్యార్థి, రికీ కేజ్ వంటి ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. -
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరక కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు. ‘సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిపై తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆమె చదువు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. ఈ అంశం నేపథ్యంలో బాధితురాలి ప్రాణాలకు హాని ఏర్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి , కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలు చదువు కొనసాగించేందుకు తగిన సురక్షిత వాతావరణం కల్పించాలి’ అని పేర్కొన్నారు.కాగా, విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు.అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
ఆ మూడు రాష్ట్రాలపై బీజేపీ నజర్.. నూతన నియామకాలతో ఎన్నికల వ్యూహం
న్యూఢిల్లీ: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో రాబోయే ఎన్నికలకు పోల్ ఇన్‌చార్జ్‌లను నియమించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ నియామకాలు కీలక రాష్ట్రాలలో ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయుక్తమవుతాయని పార్టీ భావిస్తోంది.బీహార్‌లో ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడులో బైజయంత్ పాండా పశ్చిమ బెంగాల్లో భూపేంద్ర యాదవ్ పోల్ ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్య సహ ఇన్‌చార్జ్‌లుగా పనిచేయనున్నారు. ఈ బృందం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, రాష్ట్రంలో బలమైన బీజేపీ ఉనికిని చాటేందుకు వ్యూహాలను అమలు చేయడం తదితర బాధ్యతలను చేపడుతుంది. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను బైజయంత్ పాండాకు అప్పగించారు. మురళీధర్ మోహోల్ అతనికి సహ ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు.పశ్చిమ బెంగాల్‌కు పోల్ ఇన్చార్జ్గా భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమితులయ్యారు. బిప్లాబ్ కుమార్ దేబ్ ఆయనకు సహ ఇన్చార్జ్గా మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ భావిస్తోంది. అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రచార నిర్వహణ, ఓటర్ల సమీకరణకు సమన్వయ విధానాన్ని రూపొందించనుంది. ఈ నూతన నియామకాలు బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేసే దిశగా పార్టీలోని సీనియర్ నేతల సలహా, సంప్రదింపులను బీజేపీ తీసుకుంటున్నదని సమాచారం. -
11, 12 తరగతుల్లో నైపుణ్యాధారిత బోధన
చెన్నై: జాతీయ విద్యా విధానం–2020 సిఫారసు మేరకు 11, 12వ తరగతుల్లో నైపుణ్య ఆధారిత పాఠ్యాంశాలను చేర్చే విషయం పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. మద్రాస్ ఐఐటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక సర్టిఫికెట్ లేదా డిగ్రీకే విద్యా విధానం పరిమితం కారాదని, విద్యార్థులను పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ విద్యా విధానంలో నైపుణ్యాధారిత విద్య ప్రముఖంగా ఉందని చెప్పారు. గతంలో నైపుణ్యాధారిత విద్య ఆప్షనల్‌గా ఉండేదని∙ఇకపై విద్యలో ఇదో భాగంగా మారనుందన్నారు. ఆరోగతి నుంచే నైపుణ్య ఆధారిత విద్యాబోధనను ప్రవేశపెట్టే యోచన ఉందని మంత్రి వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ కేంద్రం బలవంతంగా రుద్దడం లేదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. త్రిభాషా విధానంపై కేంద్రం రాష్ట్రాలను బలవంతం చేస్తోందంటూ కొందరు చేసే ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. -
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
తమిళులు అనాగరికులు!
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు, తమిళనాడులోని అధికార డీఎంకేకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న రగడ పార్లమెంటునూ తాకింది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వాటిపై డీఎంకే ఎంపీల నిరసనలు, ఆందోళనలతో సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభ అట్టుడికిపోయింది. తమిళుల ఆత్మగౌరవాన్ని మంత్రి దారుణంగా దెబ్బతీశారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి దుయ్యబట్టారు. ఆయనపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా డీఎంకే శ్రేణులు నిరసనకు దిగాయి. ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రివి అహంకారపూరిత వ్యాఖ్యలు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి’’ అంటూ హెచ్చరించారు. ‘‘తమిళ ప్రజలందరినీ మంత్రి ఘోరంగా అవమానించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు దారుణమంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా లోక్‌సభ ప్రాంగణంలో దుయ్యబట్టాయి. డీఎంకేకు నిజాయితీ లేదు! సభ ప్రారంభం కాగానే నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అంశాన్ని డీఎంకే సభ్యులు లేవనెత్తారు. దాన్ని తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పీఎంశ్రీ పథకంపై ప్రశ్నకు ప్రధాన్ బదులిస్తూ డీఎంకే ఎంపీల తీరుపై తీవ్రంగా స్పందించారు. వారికి నిజాయితీ లేదంటూ ఆక్షేపించారు. ‘‘కర్ణాటక, హిమాచల్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా పీఎంశ్రీని అమలు చేస్తున్నాయి. అది తమకూ అంగీకారమేనని పలువురు డీఎంకే ఎంపీలు నాతో స్వయంగా చెప్పారు. ఈ మేరకు స్టాలిన్ కూడా ప్రకటన చేశారు. తర్వాత ఏ ’సూపర్ సీఎం’ జోక్యం చేసుకున్నాడో గానీ, ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. కేవలం భాషాపరమైన వివాదాలు సృష్టించడమే పనిగా ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు. తమిళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా స్వార్థాన్ని పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఎన్ఈపీకి అంగీకరించాలని హితవు పలికారు. వీటిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఎన్ఈపీ అంగీకారమేనని ప్రధాన్‌తో తామెన్నడూ చెప్పలేదన్నారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో హోరెత్తించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వెనక్కు తగ్గలేదు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. మళ్లీ సమావేశమయ్యాక కూడా రగడ కొనసాగింది. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఎన్ఈపీని, హిందీ తప్పనిసరంటున్న త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ముందునుంచీ వ్యతిరేకిస్తోందని కనిమొళి అన్నారు. ప్రధాన్ వ్యాఖ్యలు, ప్రత్యేకంచి ఒక పదం తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వెలిబుచ్చారు. దాంతో మంత్రి స్పందిస్తూ, ‘‘నా సోదరి రెండు అంశాలు లేవనెత్తారు. తమిళనాడు ప్రభుత్వం, ఎంపీలు, తమిళ ప్రజలను ఉద్దేశించి నేనలాంటి పదం వాడకుండా ఉండాల్సిందని అన్నారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకుంటున్నా’’ అని ప్రకటించారు. అవి రికార్డుల్లోకి వెళ్లబోవని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలను అవమానించేలా ప్రధాన్ దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. విద్యావిధానం వంటి అంశాలను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దరాదని కనిమొళి అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి తమను అబద్ధాలకోరులు అనడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అంగీకరించేదే లేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా అన్నారు. ‘‘హిందీని మాపై రుద్దడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు. మీపై చర్యలు తప్పవ్ మారన్‌పై స్పీకర్ ఆగ్రహం డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఎన్ఈపీపై డీఎంకే సభ్యుల ఆందోళన సందర్భంగా పోడియం వద్ద మారన్ ఏవో వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయనపై కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు. ‘‘మాట్లాడేటప్పుడు కాస్త నోరు జాగ్రత్త. మీ వ్యాఖ్యలు రికార్డులకు ఎక్కి ఉంటే తక్షణమే చర్యలు తీసుకునేవాడిని’’ అంటూ హెచ్చరించారు. మారన్‌పై చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుకు సూచించారు. లేదంటే తానే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సభ గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు. -
LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే నడుస్తోంది. హిందీ భాష అమలు చేయడంపై కూడా నేతలు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ సీఎం స్టాలిన్‌కు కౌంటరిచ్చారు. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.జాతీయ విద్యా విధానంపై కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 భాషా స్వేచ్చ సూత్రాన్ని సమర్థిస్తుంది. విద్యార్థులపై బలవంతంగా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. విద్యార్థులు తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు. దాన్ని కొనసాగించేలా ఈ పాలసీ ఉంది. ఇదే సమయంలో విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుంది.తమిళనాడు ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాల వల్లే కొత్త పాలసీని వ్యతిరేకిస్తోందన్నారు. ప్రగతిశీల సంస్కరణలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. అలాగే, 2022లోనే ప్రధాని మోదీ తమిళ భాష శాశ్వతం అనే వ్యాఖ్యలు చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యను రాజకీయం చేయడం వంటి పనులు మానుకోవాలని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ కోరారు. జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య ఆవేదన, ఆక్రోశం కలిగించిందని తెలిపారు. తమిళనాడులో చాలాకాలంగా ద్విభాషా విధానమే ఉందన్నారు. దాన్ని ఆచరించడంలో రాష్ట్రం దృఢంగా ఉందని పేర్కొన్నారు. అధికారిక భాషా నిబంధన 1976లో పేర్కొన్న మేరకు అధికార భాషా చట్టం 1963 హెచ్ అమలు చేయడం నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించడాన్ని గుర్తు చేశారు.Highly inappropriate for a State to view NEP 2020 with a myopic vision and use threats to sustain political narratives. Hon’ble PM @narendramodi ji’s govt. is fully committed to promote and popularise the eternal Tamil culture and language globally. I humbly appeal to not… pic.twitter.com/aw06cVCyAP— Dharmendra Pradhan (@dpradhanbjp) February 21, 2025ఒక రాష్ట్రంలోని కాలపరిస్థితులను అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాన్ని నిర్బంధించడానికి, నిధులు అందించే వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ఇలాంటి ప్రయత్నం సమాఖ్య పాలనాతత్వాన్ని అతిక్రమించే చర్యగా పేర్కొన్నారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. అందుకే నిధులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.ఇదిలాఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోదీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోదీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం మరింత హీటెక్కింది. బీజేపీ నేతలు డీఎంకే నేతలపై మండిపడుతున్నారు. -
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి వీసీలను నియమిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్ల (వీసీ) ను నియమిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలి పారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో వీసీల నియామకం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్రమంత్రికి లేఖ రాశా రు. ఈ లేఖకు స్పందించి ఆయన ప్రత్యుత్తరం రాశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, హైదరాబాద్ ఐఐటీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో బోధన సిబ్బంది నియామకాల్లో ఓబీసీ రిజ ర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని మ రో లేఖలో ఎంపీ చామల కోరగా.. శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రత్యుత్తరంలో వెల్లడించారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధానన్ను కలిసిన కేటీఆర్
-
పర్లేదు సార్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్‌కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 బడ్జెట్లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్‌ను స్వాగతించారు. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. ఐఐటీల విస్తరణ.. 2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు. నైపుణ్యాల పెంపు.. విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు. ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది. ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్వేర్ సర్విసెస్)రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు ఐఐటీలు, ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను పెంచడం వల్ల పీహెచ్డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్స్పష్టత ఇవ్వాల్సింది సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్‌కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360జాతి వృద్ధికి ఊతం ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్ఏటా కుదింపులు.. ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి -
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం. -
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు చెంపపెట్టు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యానికి, చిల్లర రాజకీయాలకు చెంపపెట్టని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సుప్రీం నిర్ణయం విద్యార్థుల ఓటమి కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ప్రభుత్వంపైనే కాదు, సుప్రీంకోర్టుపైనా విశ్వాసం లేదని విమర్శించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పేపర్ లీకేజీలు జరగడం తెలియదా అని ఆ పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన ప్రశ్నించారు. అప్పటి ఘటనలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి తండ్రివంటిది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ అబద్ధాలు, అరాచకాలనే నమ్ముకుందని మంత్రి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలపైనే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఖర్గేకు, రాహుల్ గాం«దీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
2028లో గెలుపు మనదే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ నంబర్‌వన్ పార్టీగా మారడం ఖాయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాల ద్వారా కాంగ్రెస్, బీఅర్ఎస్కు నిద్ర పట్టకుండా చేసి.. ఆ పారీ్టల అక్రమాలపై పోరాటాలతో బీజేపీ తప్పకుండా నంబర్‌వన్ స్థానానికి చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.రానున్న 1,500 రోజుల్లో (రివర్స్ ప్లానింగ్) ప్రజా పోరాటాల ద్వారా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ వద్ద 1,500 రోజుల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గం ముగింపు సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పిన ధర్మేంద్ర.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉందన్నారు. దక్షిణాది సీట్లతోనే మూడోసారి మోదీ సర్కార్ తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్లతో మరింత బలం చేకూరడంతోనే మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిందని ధర్మేంద్ర చెప్పారు. ‘ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిస్తేనే ప్రధాని కావాలని కొందరు కలలు కంటుంటారు. అలాంటిది తెలంగాణ నుంచి పార్టీ సొంతంగా 8 సీట్లను గెలవడం మామూలు విజయం కాదు.. ఇందుకు ఓటర్లకు కృతజ్ఞతలు. లోక్‌సభ ఎన్నికలతో బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అపవాదు తొలగింది. దక్షిణ భారతంలో బీజేపీ మరింత బలపడింది. కొత్త శకం మొదలైంది. కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించాం’’అని ఆయన అన్నారు. రాజ్యాంగం మార్చం.. రిజర్వేషన్లను ఎత్తివేయం ‘పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ పారీ్టకి వంద సీట్లు దాటలేదు. 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. అహంకారంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పదే పదే అవమానించే కాంగ్రెస్‌నేతలు, రాహుల్‌గాంధీ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారు.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులూ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగానికి ఎలాంటి హానీ జరగదని మేమంతా సామూహికంగా వాగ్దానం చేస్తున్నాం బీజేపీ అధికారంలో ఉండగా రిజర్వేషన్లకూ ఎటువంటి ఢోకా లేదు’అని ధర్మేంద్ర స్పష్టం చేశారు. -
Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారాయన. అయితే అక్కడ ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు.నీట్, యూసీజీ-నెట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ యోగా డే కార్యక్రమం కోసం వెళ్లిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యార్థులు అడ్డుకునే యత్నం చేశారు. నల్లజెండాలతో అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే యత్నం చేశారు. ఈ నిరసనలతో ఆయన యోగా డేలో పాల్గొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: నీట్ పేపర్ లీకేజీ నిజమే మరోవైపు.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ నివాసం బయట ఈ ఉదయం యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. యూజీసీ నెట్‌ను రద్దు చేసిన కేంద్రం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడబోమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశం లేకపోలేదు. -
నీట్ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్‌పై పూర్తి స్థాయి రిపోర్టు అడిగామని తెలిపారు. దోషులెవరైనా వదిలి పెట్టమని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై ఉన్నస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. దీంతోపాటు అనేకమంది పూర్తి స్థాయి మార్కులు రావడంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు, పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
ఆందోళన వద్దు.. నీట్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024 వివాదంపై కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ వివాదంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని తెలిపారు.పేపర్ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై అధికారులు వాటిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అంశంలో సంబంధిత అధికారుల విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం జూలై 8 వరకు వేచి చూద్దాం. దాచడానికి ఏమీ లేదు అని ఆయన అన్నారు.భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా 4,700 కేంద్రాలలో 14 విదేశాలలో 13 భాషలలో 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రధాన్ తెలిపారు. రెండు కేంద్రాలపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
సంస్కృత భాషాభివృద్ధికి ఎన్ఎస్యూ కృషి అభినందనీయం
తిరుపతి సిటీ/ఏర్పేడు: సంస్కృత భాషాభివృద్ధికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్ఎస్యూ) ఎనలేని కృషి చేస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. గురువారం తిరుపతి ఎన్‌ఎస్‌యూలో ఉత్కల పీఠం (ఒడిశా చైర్) ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీవారి పాదాల చెంత వెలసిన సంస్కృత వర్సిటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసి పరిరక్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వర్చువల్ విధానంలో వర్సిటీలో నూతన హాస్టల్ భవనాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఉత్కల పీఠం రజతోత్సవ పైలాన్, శిలాఫలకాన్ని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు రేవతి రమణదాన ప్రభు ప్రారంభించారు. ఇన్నోవేషన్ హబ్‌గా తిరుపతి ఐఐటీ తిరుపతి కేంద్రంగా ఏర్పేడులో స్థాపించిన ఐఐటీ విద్యాసంస్థ అనతి కాలంలోనే ఇన్నోవేషన్ హబ్‌గా పేరుగాంచడం గర్వంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గురువారం తిరుపతి ఐఐటీలో జరిగిన నాల్గొవ, ఐదవ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం శుభపరిణామమన్నారు. మొత్తం 355మంది బీటెక్, 106 మంది ఎంటెక్, ఇద్దరు డ్యూయల్ డిగ్రీ, 74మంది ఎమ్మెస్సీ, 17మంది ఎంఎస్, 21మంది పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. -
తెలంగాణకు మరిన్ని కేంద్ర సంస్థలు
సాక్షి, హైదరాబాద్: డిజిటైజేషన్, డిస్టెన్స్ లెర్నింగ్ మెథడాలజీ, ఆన్లైన్ అప్రోచ్, డిజిటల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలకు సంబంధించి తెలంగాణలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తెలంగాణలో ఇటీవలే రూ.వెయ్యి కోట్ల తో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రాచీన భారతం ఎన్నో ఆవిష్కరణలకు భూమికగా నిలిచిందని.. ఆధునిక భారతం విశ్వమిత్రగా వ్యవహరి స్తోందని పేర్కొన్నారు. ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదంతో దేశయువత భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థల రెండో ఎడిషన్ ‘ఇన్వెంటివ్, ఆర్అండ్డీ ఇన్నోవేషన్ ఫెయిర్’ను ధర్మేంద్ర ప్రధా న్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థలు కలిపి మొత్తం 53 విద్యా సంస్థల నుంచి 120 ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టారు. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, క్లైమేట్ చేంజ్, ఈ–మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ స్పేస్, ఇండస్ట్రీ 4.0 తదితర ఇతివృత్తాలతో వీటిని రూపొందించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతాం ప్రజల రోజువారీ జీవితంలో ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఐఐటీలకు ప్రధాని మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న కల సాకారంలో స్టార్టప్ కంపెనీలు వెన్నెముకగా నిలుస్తాయని.. ఇన్వెంటివ్–2024 వంటి సమావేశాలు రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడతాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు మరింత పెరిగేలా విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ అంతా సహకారం అందించాలని కోరారు. దేశ జీడీపీలో కనీసం 25 శాతా నికి దోహదపడేలా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. ఆ దిశగానే ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్, ఎఫ్‌డీఐ లిబరలైజేషన్’వంటి విధానాలను కేంద్రం తీసుకొచి్చందన్నారు. డిజిటల్ పబ్లి క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొమైన్లో 46 శాతం గ్లోబల్ డిజి టల్ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని, మనదేశం ఇన్నోవేషన్‌కు ఇంక్యుబేటర్‌గా మారిందని చెప్పారు. 2014లో 350 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడవి లక్షా 20వేలకు చేరాయన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు విద్యార్థుల ఆత్మహత్యలు సమాజానికి మంచిది కా దని కేంద్ర మంత్రి అన్నారు. ఐఐటీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయన్నారు. -
వచ్చే ఏడాది గిరిజన వర్సిటీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి మార్గం సుగమమైంది. సమ్మక్క –సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అనుమతులు, ఇతర ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచే వర్సిటీ అందుబా టులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంలోనే గిరిజన యూని వర్సిటీ ఏర్పాటును నిర్దేశించినప్పటికీ వివిధ కారణాలతో పదేళ్లుగా జాప్యం అవుతూ వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల క్రితమే భూ కేటాయింపులు పూర్తి చేసి గిరిజన సంక్షేమ శాఖకు స్వాధీనం చేసింది. తాత్కాలిక అవస రాల కోసం భవనాలను కూడా కేటాయించింది. అనంతరం నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) అప్పగించారు. కానీ కేబినెట్ అనుమతులు, పార్ల మెంటులో బిల్లు ఆమోదం కాకపోవడంతో యూని వర్సిటీ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. హెచ్‌సీయూ పర్యవేక్షణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి గెజిట్ జారీ కావడంతో కేంద్ర విద్యా శాఖ అధికారుల బృందం అతి త్వరలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వర్సిటీకి అవసరమైన మౌలిక వసతులు తదితరాలను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత సంబంధిత అనుమతులన్నీ వేగంగా జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వర్సిటీని హెచ్‌సీయూ పర్యవేక్షించనుంది. ఇప్పటికే కోర్సులు, ఇతరత్రా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను రూపొందించింది. అనుమతులు వచ్చిన వెంటనే 2023–24 విద్యా సంవత్సరంలో తరగతులు సైతం ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తోంది. రూ.10 కోట్ల నిధులు..498 ఎకరాల భూమి రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2016–17 వార్షిక బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో 498 ఎకరాల భూమిని వర్సిటీ ఏర్పాటు కోసం గుర్తించి గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. ఇందులో 285 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతా 213 ఎకరాలు అటవీ శాఖకు చెందింది. ఈ భూసేకరణ కోసం అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపించింది. కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)ను కేటాయించింది. వర్సిటీ ఏర్పాటుపై హెచ్‌సీయూ లోతైన పరిశీలన జరిపి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సమర్పించాలని ఆదేశించడంతో, ఆ మేరకు ప్రక్రియ పూర్తి చేసిన హెచ్‌సీయూ.. మూడేళ్ల క్రితమే కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
కొత్త విశ్వ వ్యవస్థకు ఆశాదీపం
భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభా భాండాగారాన్ని కలిగి ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలుస్తామో అటువంటి ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడాలి. భారతదేశ అధ్యక్షతన జి–20 ఇతివృత్తం అయిన ‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’, మన ప్రాచీన విలువ ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. జ్ఞాన నాగరికతగా, భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభ భాండాగారాన్ని కలిగి ఉంది. భారతదేశ చరిత్ర చూస్తే– గణితం, ఖగోళ శాస్త్రం,వైద్యం, తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా వివిధ విజ్ఞాన రంగాల్లో గణనీయమైన కృషి చేసిన ప్రస్థానమే గోచరిస్తుంది. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణలో అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జ్ఞాన నాగరికతగా భారతదేశ చరిత్ర దాని సమకాలీన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇది ప్రపంచ శ్రేయస్సుకు గణనీయమైన సహకారిగా నిలిచింది. విశ్వ శ్రేయస్సుకు జి–20 జి–20 అధ్యక్షతలో భారతదేశం మొత్తం వర్కింగ్ గ్రూపులు లేదా మంత్రుల సమావేశాలలో జరిగిన అన్ని చర్చలను కూడా గొప్ప ప్రపంచ శ్రేయస్సు అనే బంధంతో అనుసంధానం చేసింది. ‘‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’’ అనే జి–20 ఇతివృత్తం, మన ప్రాచీన విలువలైన ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలు స్తామో అటువంటి ప్రపంచ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగ పడాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాని సహజసిద్ధమైన బలం, సామర్థ్యాలను ప్రపంచం స్పష్టంగా విశ్లేషించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ‘ప్రకాశవంతమైన ప్రదేశం’గా గుర్తించింది. భారతదేశ స్థూల ఆర్థిక మూలాధారాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పవనాలు ఎదురవుతున్నప్పటికే , భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశం ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అతి తక్కువ సమయంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆదర్శాలతో కూడిన విద్య విజ్ఞానం, నైపుణ్యం ద్వారా మానవ మూలధనాన్ని పెంచడం అనేది భారతదేశ సామర్థ్యానికి కీలకం. విద్య అనేది వృద్ధి, ప్రేరణలను నడిపించే, నిలబెట్టే ‘మదర్–షిప్’(కేంద్రం). విద్య అనేది పౌరులను శక్తిమంతం చేసే మాతృశక్తి. దానికి అనుగుణంగా రూపొందించిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అన్నింటికీ మూల పత్రం. సమగ్ర జాతీయ విద్యా విధానం–2020, భారత్‌లో విద్యను సమగ్రంగా, భవిష్యత్తు మార్గదర్శకంగా, ప్రగతి శీలంగా ఒక ముందు చూపు ఉండేలా సంపూర్ణంగా రూపొందించడం జరిగింది. బలమైన విషయ అవగాహన, స్పష్టతను నిర్ధారించడం కోసం మాతృభాషలో నేర్చుకోవడానికి నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మాతృభాషలో విద్య అనుసంధాన భాషలను భర్తీ చేయదు, కానీ వాటికి అనుబంధంగా ఉంటుంది. ఇది జ్ఞానపరంగా తక్కువ సమస్యలను అధిగమించే విద్యార్థులతోపాటు సజావుగా చదువుకొనే విద్యార్థులకు కూడా చక్కటి విద్యా మార్గాలను అందిస్తుంది. ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ ఇప్పుడు ప్రాధాన్యతను సంత రించుకుంది. ఎన్ఈపీ–2020, భారతదేశాన్ని అత్యుత్తమ అధ్యయన గమ్యస్థానంగా మార్చడానికిగానూ, అధ్యాపకులు/ విద్యార్థుల మార్పిడి, పరిశోధన, బోధనా భాగస్వామ్యాలు, విదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఎంఓయూలపై సంతకాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐఐటీ– మద్రాస్, ఐఐటీ– ఢిల్లీ ఇప్పటికే తమ విదేశీ క్యాంపస్‌లను వరుసగా జాంజిబార్–టాంజానియా, అబుదాబి– యూఏఈలలో ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందాలను కుదర్చుకున్నాయి. విదేశాలతో విద్యా భాగస్వామ్యం పరిశోధనను ప్రోత్సహించడానికి పరిశ్రమ–అకాడెమియా సహ కారం అనేది ఎన్ఈపీలో చేర్చిన మరొక ప్రాధాన్యత అంశం. అకడమిక్ ఇన్ స్టిట్యూషన్ ్సలో తొలి అడుగు నుండి పరిశోధనల వరకు సులభతరం చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు అవుతోంది. భారతదేశాన్ని పరిశోధన–అభివృద్ధి హబ్‌గా మార్చ డంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సులభతర వ్యాపారం మాత్రమే కాకుండా సులభతర పరిశోధన కూడా ఉండేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా, ప్రధాన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యూరప్ దేశాలతో భారతదేశం విద్యా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ భారతదేశ ప్రతిభను గుర్తించి, దృష్టిలో ఉంచుకుంటారు. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్), క్వాడ్ ఫెలోషిప్ కింద హై–టెక్నాలజీ రంగాలలో మెరుగైన సహకారాన్ని ప్రోత్సహించడం జరగుతుంది. భారతీయ విద్యను ప్రపంచ విద్యతో సమలేఖనం చేయడంలో ప్రామాణీకరణ సహాయ పడుతుంది. జాతీయ విద్యా విదానం కింద, పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ విడుదల చేయడమైనది. ఇది నిర్దిష్ట అభ్యాస ప్రమాణాలు, కంటెంట్, బోధనాశాస్త్రం, మూల్యాంకనాలకు ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా, విభిన్న విద్యావేత్తల అభ్యాసాన్ని అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ పరిధిలోకి తీసుకు రావడానికి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ పనిచేస్తుంది. గొప్ప శ్రామిక శక్తి భారతదేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 60 కోట్ల జనాభా ఉంది. 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు. బహుళ–క్రమశిక్షణ, బహుళ–నైపుణ్యం కలిగిన, విమర్శనాత్మకంగా ఆలోచించే, యువకులు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. భారతదేశం ఇప్పుడు మూడవ అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యావరణ వ్యవస్థ. 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో నైపుణ్యం, వ్యవస్థాపక తకు ప్రతీకగా నిలిచింది. మెట్రో నగరాల్లో మాత్రమే కాదు, భారతదేశ ఆవిష్కరణలు, స్టార్టప్‌లు టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల ద్వారా కూడా ఆవిష్కారం అవుతున్నాయి. 6వ తరగతి నుండి పాఠశాల విద్యలో నైపుణ్యం ఏకీకృతం అయింది. సాంకేతికతతో నడిచే పారిశ్రామిక వాతావరణంలో నిల దొక్కుకోవడానికిగానూ పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం కలిగిన మానవ శక్తిని రూపొందించడానికి సింగపూర్ స్కిల్ ఫ్రేమ్‌వర్క్ అనుసరించదగినది. అభివృద్ధి చెందుతున్న కొత్త క్రమంలో మానవ మూలవనరుల ప్రధాన పాత్రను భారతదేశం గుర్తించింది. విద్య, నైపుణ్యంతో కూడిన వ్యక్తులు నేటి జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మాత్రమే విజ్ఞాన సరిహద్దును విస్తరించడం, ఆర్థిక వృద్ధికి ఊత మివ్వడంతో పాటు, అద్భుతమైన ఆవిష్కరణలు అందించగలరు; శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణానికి అసాధారణమైన సహకారాన్ని అందించగలరు. ప్రపంచ ప్రయోజనాల కోసం ఇప్పుడు భారత దేశం ఒక పెద్ద ప్రయోగశాల. జ్ఞాన శతాబ్దం అయిన 21వ శతాబ్దంలో కొత్త సాంకేతి కతలు కొత్త క్రమానికి నాంది పలుకుతాయి. భారతదేశం తన విస్తారమైన నైపుణ్య గనిని ఏర్పరచడంలో, కొత్త క్రమాన్ని రూపొందించడంలో ముందంజలో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాసకర్త కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపకత మంత్రి -
ఈ ఘనత మోదీ, జగన్‌లదే
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతానికి రావడం పట్ల గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. విజయవంతమైన చంద్రయాన్–3 ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం సంతోషకరం అన్నారు. ఇలాంటి రాష్ట్రంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం అని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమష్టి కృషితో రూ.800 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారమవుతోందన్నారు. 561 ఎకరాల భూమి, విద్యుత్తు, రోడ్డు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ చొరవ తీసుకొని ముందుకు వచ్చారని తెలిపారు. 21వ శతాబ్దానికి ఆధునిక దేవాలయమైన ఈ విశ్వ విద్యాలయం సాలూరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటవ్వడం వల్ల పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్టాల్లోని గిరిజనులతో సామాజిక అనుబంధం ఏర్పడుతుందన్నారు. గిరిజనుల ప్రగతికి దోహదం ఇక్కడ ప్రసిద్ధి గాంచిన అరకు కాఫీ, నల్ల మిరియాలు, తేనె, పనస, పైనాపిల్ తదితర అటవీ పంటలపై పరిశోధనకు ఈ వర్సిటీ ద్వారా అవకాశం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఒడిశాలో ఉన్న యూనివర్సిటీతో ఈ వర్సిటీ భాగస్వామ్యమైతే దేశంలో గిరిజనుల ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్లవచ్చని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖ, గంగవరం పోర్టులను కలిపే గ్రీన్‌ఫీల్డ్ హైవే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ట్రైబల్ వర్సిటీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, స్థానికంగా ప్రజల మాతృభాషనూ ప్రోత్సహిస్తూ బోధనలో బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్‌ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కళ్లెదుటే అభివృద్ధి ► భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గిరిజన ప్రాంతంలోకి వెళ్తుంటే మనం గిరిజనుల కోసం ఏం చేశామో కళ్లెదుటే కనిపిస్తోంది. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజినీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒకటి కాదు.. రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఏర్పాటు చేశాం. ఇవాళ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. ► రూ.వెయ్యి కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లా పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణమవుతోంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా ఉన్న నర్సీపట్నంలో ఇంకో కాలేజీ కడుతున్నాం. ► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం మన కళ్ల ముందే కనిపిస్తోంది. గిరిజన తండాలో జనాభా 500 ఉంటే గ్రామ పంచాయతీగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని మాట ఇచ్చాం. ఆ ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో రూ.250 కోట్లు ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన అసైన్మెంట్ భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. -
గిరిజనుల్లో విద్యా కాంతులు
గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోంది. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు వారివి. వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో బాహ్య ప్రపంచంతో అడుగులు వేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వారిని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం. నాలుగేళ్లలో 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.16,805 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా గిరిజనుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలికామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల్లో విద్యాకాంతులు నింపే ఈ ప్రాజెక్టును రూ.830 కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికి, ఆయనతో కలిసి నేరుగా చినమేడపల్లికి హెలికాప్టర్లో చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయం వచ్చిందని, రాష్ట్రంలో రెండవ సెంట్రల్ వర్సిటీ అని చెప్పారు. గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడేలా గొప్ప అడుగుకు బీజం పడబోతోందని చెప్పారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లుగా గుండెల్లో పెట్టుకున్నాం ► ఈ నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేశాం. వారిని గుండెల్లో పెట్టుకున్నాం. అన్ని విధాలా అండగా నిలబడ్డాం. వారిని తోటి ప్రపంచంలో నిలబెట్టే సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. ► తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్నాం. మీడియం నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ► గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోంది. వారి విద్యా సాధికారత కోసం, తోటి పోటీ ప్రపంచంలో గెలవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ అనే కాన్సెప్ట్ అమలవుతోంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయి. విద్యాకానుకతో బడిపిల్లల రూపాన్ని, బైలింగువల్ విధానంతో వారి టెక్టŠస్ బుక్స్‌నూ మార్చగలిగాం. ► ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను చదువును ప్రోత్సహించేలా తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చాం. ► మెరుగైన చదువులు, కరిక్యులమ్‌లో మార్పులతో పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచి్చన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కుతుంది. విదేశీ విద్యా దీవెనలో భాగంగా ప్రపంచంలోని టాప్ 50 వర్సిటీల్లోని 21 ఫ్యాకలీ్టలకు వర్తింపజేస్తున్నాం. మొత్తంగా 350 కాలేజీల్లో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకు మన పిల్లలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాజకీయంగానూ పెద్దపీట ► నా ఎస్టీలు.. అనే పదానికి అర్థం చెబుతూ గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా గిరిజనులకు రాజకీయ పదవులిచ్చి నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. మొట్టమొదట గిరిజన చెల్లెమ్మకు, తర్వాత గిరిజన అన్నకు కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా.. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా నియమించాం. ► నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిíÙగా వారికి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధితో అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాల ప్రయోజనం కోసం రూ.410 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్య పరిరక్షణలోనూ శ్రద్ధ ► గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భవతుల వరకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్, చిన్న పిల్లలకు గోరుముద్ద స్కీమ్‌లతో వారు తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగాం. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం అమలు జరుగుతోంది. ప్రతి అడుగూ గిరిజనుల బాగు కోసమే ► గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. 1,53,820 కుటుంబాలకు మేలు చేస్తూ 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఏకంగా 84 శాతం కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 497 సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ముళ్లూ, చెల్లెమ్మలే. ► నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్ నొక్కుతుంటే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. నాలుగేళ్ల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.11,548 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం. నాన్ డీబీటీ అంటే ట్యాబ్‌లు, ఇళ్ల పట్టాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద వంటివి కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు మరో రూ.5,257 కోట్ల మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్ల లబ్ధి చేకూరింది. ► సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వల్ల గొప్ప మార్పు జరగబోతోంది. దీన్ని మన ప్రాంతానికి మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు. -
గిరిపుత్రుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చాం : సీఎం జగన్
సాక్షి, విజయనగరం: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. సీఎం జగన్ కామెంట్స్ చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య ఈరోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతోంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తున్నా. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతిస్నేహితుడికీ, నిండు మనసుతో రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ► ఈరోజు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలకు పునాదులు వేస్తున్నాం. దాదాపు 830 కోట్ల ప్రాజెక్టు. మరో మూడు సంవత్సరాలకు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టు. మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గిరి పుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ► రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు ఇక్కడి నుంచి బీజం పడబోతోంది. మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ ఉండేది. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వారు. కల్మషం లేని మనసులు కలిగిన వారు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు. ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో వెనకాలే ఉన్నారు. ఈనాలుగు సంవత్సరాల పరిపాలనలో విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా కానీ గిరిజనులను గుండెల్లో పెట్టుకొని అడుగులు వేశామని గర్వంగా చెప్పలగుతా. ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. ► తరతరలాలుగా నిర్లక్షానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ఈరోజు గిరిపుత్రులకు అభివృద్ధిపట్ల మనందరి ప్రభుత్వం బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోందో నాలుగు మాటల్లో పంచుకుంటా. విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, మన పిల్లలు గెలవాలని, వారు చదువుకొనే మీడియంలో మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి ఉందని మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెబుతున్నా. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ అమలవుతోంది. నాడు-నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు మార్చబడుతూ కనిపిస్తున్నాయి. ► విద్యాకానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగువల్ టెక్స్ట్ బుక్కులతో మార్చగలుగుతున్నాం. ప్రతి గవర్నమెంట్ బడిలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ తెస్తూ, ఐఎఫ్పీలను ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే ఆ పిల్లలందరికీ వారి చేతిలో ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా అనే కార్యక్రమాలను తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తెచ్చాం. మెరుగైన చదువులు, కరిక్యులమ్ లో మార్పులు తెచ్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. ► ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది. పాడేరులో మరో మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో మూడో మెడికల్ కాలేజీ కట్టబడుతోంది. ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త దూరం కురుపాంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టబడుతోంది. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతోందో చెప్పడానికి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త దూరంలో పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నది మన కళ్ల ఎదుట కనిపిస్తోంది. ► మరికాస్త దూరంలో సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. మరో నాలుగు అడుగులు ముందుకు వెళ్లి చూస్తే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ మనకు కనిపిస్తోంది. ఒక్క గిరిజన ప్రాంతలోనే రెండు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, నాడు-నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు గిరిజనులకు కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. మనందరి ప్రభుత్వం 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో మీ అందరితో నాలుగు మాటలు పంచుకుంటా. నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా గిరిజనులకు నా పక్కనే పెట్టుకున్నా. ఏ నామినేటెడ్ పదవి, కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేట్లుగా ఏకంగా చట్టం చేసి కార్యరూపం చేస్తున్నాం. ఇంకా ఏమన్నారంటే.. ► మొట్ట మొదట గిరిజన చెల్లెమ్మకు, నా గిరిజన అన్నకు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ బద్ధంగా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమించిన చరిత్ర మీ బిడ్డ ప్రభుత్వంలోనే. నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీ కూడా మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాం. 2019 జూలై నుంచి 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం 410 కోట్లు ఖర్చు చేశామని సవినయంగా తెలియజేస్తున్నా. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒక జిల్లా కాదు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. ► రూ.1000 కోట్లతో అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లాలో పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం అని చెబితే మన కళ్ల ఎదుటే నిర్మాణం కనిపిస్తోంది. గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాస్తామని మాట ఇచ్చాం. మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి జిల్లా రంపచోడవం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకారం జిల్లా దోర్నాలలో 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లు కనిపించే కార్యక్రమం జరుగుతోంది. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశామని తెలియజేస్తున్నా. ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. వారి బాగోగుల కోసం 153820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ, 322538 ఎకరాలను ఆర్వోఎఫ్ ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారు ఏకంగా 84 శాతం ఉద్యోగాలు వాళ్లే చేస్తూ అక్కడే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ములు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నా. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. ► అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గిరిజనుల వరకు మాత్రమే చూస్తే 50 నెలల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు 11548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు రూ.5,257 కోట్లు మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే అక్షరాలా 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్లు నేరుగా వాళ్లకు వెళ్లాయి. ఈ ప్రాంతంలో మీకు జరిగిన మార్పును మీకు తెలియజేసేందుకు ఇవన్నీ చెబుతున్నా. ఈ యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోంది. రాబోయే రోజుల్లో తరతరాలు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని తెలియజేస్తున్నా. దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సహకారం మరింతగా రావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం: సీఎం జగన్
Updates.. ►ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ► నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. ► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చాం. ► కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. ► రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ► కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ తలచారు. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నాం. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయం. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతాం. ► కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ► ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. ► మన్యం జిల్లా చినమేడపల్లి చేరుకున్న సీఎం జగన్ ► కాసేపట్లో కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ► గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్. ► రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ► విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. ► వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు.


